Brahmamudi, March 5th episode: రాజ్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా.. పెద్దావిడకు అపర్ణ హెచ్చరిక!

|

Mar 05, 2024 | 12:05 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి మాటలకు సుభాష్ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి.. క్షమించమని అడుగుతాడు. ధాన్య లక్ష్మి అన్నదానిలో కూడా నిజం ఉంది. నా తమ్ముడు అన్నింట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలని, ఎవరూ వేలెత్తి చూపించకూడదు అనుకున్నా. అందుకే తప్పు చేస్తే నీలో ఉన్న లోపాన్ని కూడా మర్చిపోయి తిట్టేవాడిని. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించురా అని సుభాష్ అడుగుతాడు. మనిషిలో లోపాన్ని చూసి పరాయివాడు..

Brahmamudi, March 5th episode: రాజ్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా.. పెద్దావిడకు అపర్ణ హెచ్చరిక!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి మాటలకు సుభాష్ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి.. క్షమించమని అడుగుతాడు. ధాన్య లక్ష్మి అన్నదానిలో కూడా నిజం ఉంది. నా తమ్ముడు అన్నింట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలని, ఎవరూ వేలెత్తి చూపించకూడదు అనుకున్నా. అందుకే తప్పు చేస్తే నీలో ఉన్న లోపాన్ని కూడా మర్చిపోయి తిట్టేవాడిని. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించురా అని సుభాష్ అడుగుతాడు. మనిషిలో లోపాన్ని చూసి పరాయివాడు.. ఏమన్నా భరించేవాడు మనవాళ్లు. ఇన్ని రోజులూ అలానే ఉన్నాం. ఇప్పుడు ఇలా మాట్లాడి పరాయివాడిని చేయకు అన్నయ్యా. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉంటావన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యాన్ని దూరం చేయకు అన్నయ్యా అని ప్రకాష్ హగ్ చేసుకుని బాధ పడతాడు. ఈ సీన్ నిజంగానే మనసులను హత్తుకుంటుంది.

లోలోపల ఉడుక్కున్న రాజ్..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యపై రాజ్‌ లోపల దాగి ఉన్న ప్రేమను బయటకు తీడానికి ట్రై చేస్తూ ఉంటారు కావ్య, భాస్కర్. ఈ క్రమంలోనే పుట్టింటికి వస్తారు. ఇక రాజ్‌కి వినబడేలా.. అక్కా ఏం చేస్తున్నావే.. అని అప్పూ అంటుంది. నేనూ, బావా క్యారెమ్స్ ఆడుకుంటున్నాం అప్పూ అని కావ్య చెప్తుంది. వెంటనే రాజ్ తలుపు తీస్తాడు. రాజ్‌ని చూసిన కావ్య.. బావా ఇక ఆట మొదలు పెడదామా అని అంటుంది. లోలోపల ఉడుక్కుంటున్న రాజ్.. ఏంటి మేము ఆడొద్దా అని అంటాడు. ఈ గేమ్‌లో నువ్వూ, నేనూ ఓ జట్టు అని బావ అంటే.. రాజ్ సీరియస్‌ అయి.. లేదు జంట్స్ ఓ టీమ్.. లేడీస్ ఓ టీమ్ అని చెప్తాడు రాజ్.

రాజ్‌ని క్యారెమ్స్ ఆడుకున్న కావ్య, భాస్కర్‌లు..

రాజ్‌ని ఏడిపిద్దాం అని ఫీక్స్ అయిన భాస్కర్.. కావ్య చేయి పట్టుకుని మరీ గేమ్ ఆడిస్తాడు. ఆ సీన్ చూసి రాజ్ తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత కావ్య కాయిన్ పడేయగానే.. భాస్కర్ సంతోషంగా గంతులు వేస్తాడు. కానీ నెక్ట్స్ రాజ్ కాయిన్ పడేసినప్పుడు మాత్రం బావ సైలెంట్‌గా ఉంటాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టవేంటిరా అని రాజ్ అంటే.. మనకు ఏంటి అన్నయ్యా అంత ఎగ్జైట్మెంట్ అని భాస్కర్ అంటాడు. దీంతో రాజ్ సీరియస్‌గా చూస్తాడు. రాజ ఆమె బావ గురించి తెగ బిల్డప్‌లు ఇస్తుంది. కానీ బావ మాత్రం ఒక్క కాయిన్ కూడా వేయడు. కానీ కావ్యకు మాత్రం సలహాలు ఇస్తూ.. దగ్గరుండి ఆడిస్తాడు. ఇలా వీళ్ల ఆట కొనసాగుతూ ఉండగా.. రాజ్ ఉక్రోశంతో రగిలిపోతాడు. గేమ్‌లో నుంచి పైకి లేచి గదిలోకి వెళ్తాడు.

ఇవి కూడా చదవండి

కావ్య డిజైన్స్ పాడు చేసిన రాజ్..

గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కావ్య గీసిన డిజైన్స్ గుర్తొచ్చి వాటిపై ఇంకు పోస్తాడు. ఆ తర్వాత బయటకు కళావతి వెంటనే వచ్చి డిజైన్స్ ఇవ్వు.. క్లయింట్స్ కాల్ చేస్తున్నారు. వెంటనే ఇవ్వాలి అని చెప్తాడు. సరే అని కావ్య లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న డిజైన్స్ మీద ఉన్న ఇంక్ చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే ఏం చేస్తాడో అని భయ పడుతుంది. ఇప్పుడెలాగ.. కూర్చొని వేసేయ్ అని అంటాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. వెంటనే బావ వచ్చి.. ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే.. కావ్య ఈ పని చేసిందని.. పెన్ డ్రైవ్ రాజ్ చేతిలో పెడతాడు. ఇక ఇప్పుడు పనేం లేదు కదా.. రా కావ్య మనం ఆడుకుందాం అని భాస్కర్ అంటాడు. ఈ సీన్స్ భలే నవ్వు తెప్పిస్తాయి.

ధాన్య లక్ష్మి గురించి అపర్ణ ఆవేదన..

నెక్ట్స్ ఇందిరా దేవి దగ్గరకు అపర్ణ వస్తుంది. అత్తయ్యా మీరిలా పుస్తకాలు చదువుతూ కూర్చుంటే సరిపోదు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ప్రతీ సారి మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే.. ఏదో చిన్న పిల్లలు కంప్లైంట్ చేసినట్టు ఉంటుందని అపర్ణ అంటే.. ధాన్య లక్ష్మి ఏమన్నా అందా అని పెద్దావిడ అడిగితే.. నన్ను అన్నా పర్వాలేదు అత్తయ్యా తోడికోడల్ని సర్దుకుంటాను. కానీ ఈ రోజు ఆవిడ గారి కోపం నా భర్త మీద చూపించిందని అపర్ణ అంటే.. ఇందిరా దేవి షాక్ అవుతుంది. ప్రకాశం ఏదో తప్పు చేశాడని ఆయన మందలిస్తూ ఉంటే.. నా భర్త మీద అరవడానికి మీరెవరూ అని నోటికి వచ్చిట్టు మాట్లాడింది అని అపర్ణ అంటే.. ఈ ధాన్య లక్ష్మికి ఏమైంది.. అలా ఎందుకు మాట్లాడుతుందని ఇందిరా దేవి అంటుంది. ధాన్య లక్ష్మి మాటలకు సుభాష్ చాలా బాధ పడి కుమిలిపోయారు అని అపర్ణ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.