
ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. రాజ్ విషయంలో అపర్ణ చేసింది తప్పు అని కావ్య అంటుంది. అయినా తప్పు చేసింది మీ అబ్బాయి. దానికి ఆ అభం శుభం తెలియని పసివాడిని ఎందుకు బాధ పెడుతున్నారు? వాడిని బాధ పెట్టే హక్కు ఎవరికీ లేదు. తప్పు చేస్తే సరిదిద్దు కోవాలి. సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తే.. శిక్ష పడాలి. అది మీ అబ్బాయి మాత్రమే వేయండి. అయినా డబ్బుతో నిజాన్ని పాతి పెట్టాలని చూడకూడదు. అయినా డబ్బుపై ఆశ ఉంటే.. ఈ పాటికే నేను చాలా సంపాదించేదాన్ని. అలాగే నాకు కావాల్సింది నా కళ్ల దగ్గరకు తెచ్చుకునేదాన్ని అని అపర్ణ, రుద్రాణి, ధాన్య లక్ష్మి, అనామికలకు చెప్తుంది. అప్పుడే ఇందిరా దేవి చప్పట్లు కొట్టుకుంటూ.. శభాష్ కావ్య.. నా మనవరాలు అనిపించుకున్నావ్. గొప్పగా ఆలోచించాలి అంటే.. గొప్పగా ఉంటేనో.. గొప్ప ఇంట్లో పుడితేనే రావు. గొప్ప మనసు ఉంటే వస్తుందని చెప్పావ్ అని అంటుంది.
అంటే వదిన చేసింది తప్పని నువ్వు కూడా అంటున్నావా అమ్మా అని రుద్రాణి అంటుంది. తప్పని అనడం లేదు. రాజ్ చేసిన తప్పుకు.. ఆ పసివాడిని బాధ పెట్టడం తప్పు అంటున్నా. కావ్య చేస్తున్నది కరెక్ట్ అని చెప్తున్నా. మీరన్నది నిజమే.. కావ్య స్థానంలో మరొక ఆడది ఉంటే పెద్ద గొడవే చేసేది. కానీ కావ్య ఎంత గొప్పగా ఆలోచించిందో నాకు మాత్రమే తెలుసు. అది మీకు అర్థం కావాలి అంటే ఈ జన్మ సరిపోదు. నువ్వు ఏం చేసినా నేను నీకు తోడుగా ఉంటాను వెళ్లు కావ్యా అని ఇందిరా దేవి చెప్తుంది.
ఆ తర్వాత పాలు తీసుకెళ్లి రాజ్‌కి ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. రాజ్ థాంక్స్ అని చెప్తాడు. దీంతో ఆగి.. నాకెందుకు.. మీరు థాంక్స్ చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏంటి? నేను మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి? ఆ ప్రశ్నలకు జవాబు నా నుంచి రాదని రాజ్ అంటే.. ఆ జవాబు వచ్చేంతవరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఈ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఇలానే స్పందిస్తారు. ఆశలు చచ్చిపోయి.. ఆనందాలు అడుగంటి పోయి.. మనసు ముక్కలైపోయి.. గుండె బండరాయి పోయి.. భవిష్యత్తు శూన్యం అయిపోయి.. నిశ్శబ్దంగా మీ ముందు నిలబడటమా.. మిమ్మల్ని కన్న తల్లే మీరు చేసిన పనికే దుమ్మెత్తి పోస్తుంటే.. మరి మీ భార్య ఇంతే మౌనంగా ఉంటుందా? భూదేవిలోనూ భూకంపంలో ఉంటుంది.. గుర్తు పెట్టుకోండని కావ్య అంటుంది.
నాకు తెలుసు.. నేను సర్దుకొమ్మని.. ఈ మార్పును జీర్ణం చేసుకోమని కూడా చెప్పలేను. నీలో ఎంత సంఘర్షణ ఉందో తెలుస్తూనే ఉంది. తెలుస్తాయి.. అర్థం అవుతాయి.. కానీ ఏం లాభం.. నష్టాన్ని పూర్చలేరు.. కష్టాన్ని తీర్చలేరు కదా అని కావ్య అంటుంది. కష్టాన్ని.. నష్టాన్ని ఇక నీకు రాకుండా చేయగలను. ఇవి నువ్వు సంతకం చేసి ఇచ్చిన విడాకుల పత్రాలే. ఈ బిడ్డతో నేను రాక ముందే నువ్వు తీసుకున్న నిర్ణయం. అన్నీ వదిలేసి.. గడప దాటి వెళ్లడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది. నీ కష్టానికి.. నష్టానికి ఈ నాటితో ముగింపు చెప్పుకుందాం. నువ్వు ఏది అడిగినా చేయలేక పోయాను. దీంతో విడాకుల పత్రాలపై సంతకం చేసి కావ్యకు ఇచ్చేస్తాడు రాజ్.
ఈ నరకం నుంచి విముక్తి పొందే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఇన్నాళ్లూ ఏదో ఒక పరీక్ష పెట్టి.. వాయిదా వేస్తూ వచ్చాను. నిన్ను ఉండమని చెప్పాను. ఇప్పుడు నాకు ఆ అర్హత, అవకాశం కూడా లేదు. నీ జీవితం నీది.. నీ నిర్ణయం నీది. వీడ్కోలు చెప్పడం తప్ప నిన్ను ఆపే శక్తి నాలో లేదని రాజ్ అంటాడు. ఇంతటితో మీ బాధ్యత తీరిపోయిందా. నేను మిమ్మల్ని వదిలేయాలంటే ఈ కాగితాలు అవసరమా.. మనసు విరిగి పోయినప్పుడే మన బంధం ముక్కలై పోయింది. ఈ కాగితాలు కేవలం చట్ట ప్రకారం విడిపోయామని చెప్పడానికి మాత్రమే ఉపయోగ పడతాయి. అసలు ఏం అనుకుంటున్నారు మీరు? ఉండమంటే ఉండాలి.. పొమ్మంటే పోవాలి.. లేదంటే విడాకులు తీసుకుని వెళ్లిపోవాలా.. నా కంటూ ఒక మనసు ఉండదా.. నేను ఇలా వెళ్లను. ఇంత సింపుల్‌గా ఒక సంతకంతో తెగతెంపులు చేసుకుని వెళ్లను. ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలియాలి? తల్లి లేకుండా ఈ బిడ్డను మాత్రమే ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియాలి? అప్పుడు నేను వెళ్లాలో.. ఇక్కడే ఉండిపోవాలో నిర్ణయించుకుంటాను. గుర్తు పెట్టుకోండి.. అని చెప్పి వెళ్తుంది కావ్య.
ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక తన తల్లి శైలూకి ఫోన్ చేసి రాజ్ విషయం చెప్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి ఫోన్ లాక్కుని కట్ చేస్తుంది. మీ అమ్మేనా.. ఏం చెప్తున్నావ్ అని అనామికను అపర్ణ నిలదీస్తుంది. జరిగింది చెప్తున్నాను అని అనామిక అంటుంది. అదా నీ ఇల్లు ఇదా నీ ఇల్లు.. నీ అత్తవారింటి విషయాలు.. నీ పుట్టింటికి ఎలా చెప్తావ్? అని ఫైర్ అవుతుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి వచ్చి కోడలికి ఏదో కోటింగ్ ఇస్తున్నట్టు ఉంది. అత్త తీసుకొచ్చి రచ్చ చేస్తే సీన్ సూపర్ ఉంటుందని వెళ్లి ధాన్య లక్ష్మిని తీసుకొస్తుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు ఈ ఇంటి కోడలివి.. అత్తవారింట్లో ఏం జరిగినా.. ఆవిషయం బయటకు వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. మీ అమ్మ వాళ్లు ఈ ఇంటి వియ్యంకులు. వాళ్లకు తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుందని అపర్ణ చివాట్లు పెడుతుంది. తప్పు బావగారు చేసినా.. మీరేం చేయలేదు కానీ.. నేను మాట్లాడితేనే తప్పు అయిపోయిందా అత్తయ్యా అని అనామిక అంటుంది.
ఇంతలో ధాన్యం వస్తుంది. ఇంట్లో ఏం జరిగినా సరే మాట పెదవి దాటకూడదు.. అడుగు బయట పడకూదని చెప్తూ ఉంటుంది. ఏం చేసింది అక్కా నా కోడలు అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. నీ కోడలినే అడుగు.. అని అపర్ణ అంటుంది. బావగారు చేసినదాని గురించి మా అమ్మకు చెప్తున్నా.. దానికే పెద్ద అత్తయ్య నా మీద అరుస్తున్నారు అని చెప్తుంది. మరి నువ్వెందుకు చెప్పావ్ అని ధాన్య లక్ష్మి అంటుంది. దానికి అందరూ షాక్ అవుతారు. అదేమన్నా ఘన కార్యమా పది మందికీ చెప్పడానికి. మూడో కంటికి తెలియకుండా బిడ్డను వదిలించుకుందాం అని ఇంట్లో వాళ్లు చూస్తుంటే.. నువ్వు పనిగట్టుకుని పబ్లిసిటీ చేస్తున్నావా అని కోడలికి చివాళ్లు పెడుతుంది ధాన్య లక్ష్మి. నా కోడలిని తిట్టి ఏం ప్రయోజనం అక్కా.. ఆ బిడ్డ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి అని అంటుంది. ఇదేంటని రుద్రాణి అడిగితే.. నేనూ నీ రూట్లోనే వచ్చాను. ఇంత పెద్ద తప్పు చేశాక రాజ్ ని ఎలా వారసుడిగా ఉండనిస్తారు. అప్పుడు నా కొడుకే కదా వారసుడు అవుతాడు అని ధాన్యం అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.