Brahmamudi, June 23rd Episode: సుభాష్‌ని క్షమించని అపర్ణ.. కావ్య, రాజ్‌ల రొమాన్స్ స్టార్ట్..

|

Jun 24, 2024 | 1:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్ భయ పడుతూ ఉంటాడు. మాయ వెనుక మనం ఉన్నామన్న సంగతి బయట పడలేదు కాబట్టి.. బ్రతికిపోయాం. లేదంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని అంటాడు. ఎవరైనా వెంటే ఏం జరుగుతుంది.. మెల్లగా మాట్లాడని రుద్రాణి అంటే.. నా మీద ఎందుకు అరుస్తాం. మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఆ రాజ్ మళ్లీ ఇప్పుడు ఆఫీస్‌కి వస్తాడని రాహుల్ అంటే.. అందులో ఎలాంటి డౌట్ లేదు రాహుల్..

Brahmamudi, June 23rd Episode: సుభాష్‌ని క్షమించని అపర్ణ.. కావ్య, రాజ్‌ల రొమాన్స్ స్టార్ట్..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్ భయ పడుతూ ఉంటాడు. మాయ వెనుక మనం ఉన్నామన్న సంగతి బయట పడలేదు కాబట్టి.. బ్రతికిపోయాం. లేదంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని అంటాడు. ఎవరైనా వెంటే ఏం జరుగుతుంది.. మెల్లగా మాట్లాడని రుద్రాణి అంటే.. నా మీద ఎందుకు అరుస్తాం. మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఆ రాజ్ మళ్లీ ఇప్పుడు ఆఫీస్‌కి వస్తాడని రాహుల్ అంటే.. అందులో ఎలాంటి డౌట్ లేదు రాహుల్ అని కావ్య అంటుంది. ఆయన స్థానం ఎప్పటికీ ఆయనదే.. ఎవరూ లాక్కోలేరు. మాయని కిడ్నాప్ చేయించినట్టు.. ఈజీగా మా ఆయన స్థానం రాదని కావ్య అంటుంది.

అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి, రాహుల్‌లు..

మేము కిడ్నాప్ చేయించడం ఏంటి? ఎవరో మాఫియా తన వెనుక ఉండి చేశారని.. ఆ మాయే చెప్పింది కదా అని రుద్రాణి అంటుంది. బిడ్డని తీసుకొచ్చి నాటకం ఆడే వరకూ ఆ మాయ చేసింది. కానీ నిజం బయటకు రాకుండా కిడ్నాప్ చేశారన్న విషయం నాకు తెలుసని కావ్య అంటుంది. సరే నేనే చేయించాను ఇప్పుడేంటి? ఈ విషయం అందరికీ చెప్తావా? అని రుద్రాణి అంటే.. నేనే నమ్మించలేను కానీ.. నా దగ్గర ఉన్న సాక్ష్యంతో నమ్మించగలను. మీరు కిడ్నాప్ చేయించిన ఆ రౌడీ వెధవల ఫోన్. మా ఆయన పట్టుకునేటప్పుడు నాకు దొరికింది. అయితే ఏంటీ అనుకుంటున్నారా..? ఇందులో మీ ఫోన్ నెంబర్ ఉంది. ఈ రౌడీ వెధవలు మీతో మాట్లాడిన ఫోన్ కాల్స్ మొత్తం రికార్డ్ చేసి పెట్టారు. అన్నీ మొత్తం రికార్డ్ చేసుకున్నారని కావ్య అంటే.. రాహుల్, రుద్రాణిలు‌ టెన్షన్ పడుతూ ఉంటారు.

రుద్రాణిని బెదిరించిన కావ్య..

ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో మనుషులుకే ద్రోహం చేయాలని అంటున్నారు. నాది మీ అంత చీప్ క్యారెక్టర్ కాదు. మిమ్మల్ని శిక్షించి ఇంట్లోంచి తరి మేయడానికి.. నాలో ఇంకా మానవత్వం ఉంది కాబట్టే మిమ్మల్ని వదిలేస్తున్నా. మీతో పాటు మా అక్క కూడా ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే వదిలేస్తున్నా.. అని కావ్య బెదిరించి వెళ్తుంది. దీంతో రుద్రాణి.. ఆవేశంతో రగిలిపోతుంది.

ఇవి కూడా చదవండి

సుభాష్ పై తగ్గని అపర్ణ కోపం..

మరో వైపు గదిలో అపర్ణ కోపంగా ఉంటుంది. అప్పుడే వచ్చిన సుభాష్ ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను జీవితాంతం ఆ తప్పుకు భయ పడుతూ.. నాలో నేను కుంగిపోతానని చాలా భయ పడ్డాను. ఆ బిడ్డ నా వల్ల పుట్టలేదని ఆ మాయ చెప్పగానే నేను చాలా సంతోష పడ్డాను. ఇన్ని రోజులూ నేను నిన్ను మోసం చేశాను అన్నట్టు నీ కళ్లలోకి చూడలేక పోయాను. కానీ ఇప్పుడు ఈ నిజం బయట పడ్డాను. ఇక నుంచి మన మధ్య ఎలాంటి మనస్పర్థలు రావు అంటూ అపర్ణపై చేయి వేస్తాడు సుభాష్. చేయి తీయండి.. నేను మిమ్మల్ని క్షమించానని మీతో చెప్పానా? నేను మారిపోయాను.. కరిగిపోయాను అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. అందరి ముందూ తండ్రిగా మీ పరువు తీయకూడదని మౌనంగా ఉన్నాను. కావ్య ఎంతో కష్ట పడి ఆ నిజాన్ని బయట పెట్టింది. తన మనసును బాధ పెట్టకూడదని మౌనంగా ఉన్నాను. మీరు తప్పు అయితే చేశారు కదా.. మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నారు. కేవలం బయట ప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తలం. కానీ ఈ గదిలో మాత్రం మన మధ్య ఉన్న ఈ దూరం ఎప్పటికీ చెరిగిపోదని అపర్ణ అంటుంది.

రాజ్‌లో చిగురించిన సరసం.. కావ్య గిల్లి కజ్జాలు..

మరోవైపు కావ్య గదిలో ఉంటుంది. అప్పుడే కావ్య మీద ప్రేమతో రాజ్ వెనక నుంచి వచ్చి సౌండ్ చేస్తాడు. దీంతో కావ్య ఉలిక్కి పడి.. బెడ్‌పై పడుతుంది. నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మొదలు పెట్టండని కావ్య అంటే.. రాజ్ తికమక పడుతూ ఉంటాడు. ఏంటి ఇది ఇంత ఫాస్ట్‌గా ఉందని అనుకుంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఆలోచిస్తున్నా అని రాజ్ అనుకుంటాడు. ఇంకేముంది.. నీకు బుద్ధి ఉందా.. తెలివి ఉందా? తిట్టండని కావ్య అంటుంది. హేయ్ అది కాదే అని రాజ్ చెప్తున్నా.. కావ్య వినిపించుకోకుండా ఆడుకుంటుంది. సరేలా నేను వెళ్తున్ాన అని నవ్వుకుంటూ వెళ్తుంది కావ్య.

ఇకపై కావ్య – రాజ్ రొమాన్స్..

అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. నీ మొహానికి థాంక్స్ చెప్పడానికి వస్తేనే కదరా అని అంతరాత్మ అంటుంది. అసలు నా పెళ్లాం చెప్పనిస్తేనే కదా అని రాజ్ అంటే.. ఇప్పుడు చూడురా.. మై డియర్ కళావతి అంటూ పైకి చూడమంటాడు. కావ్యని పట్టుకుని గిరా గిరా తిప్పి.. ముద్దు పెట్టబోతుంది అంతరాత్మ. రేయ్ ఆపు అని రాజ్ గట్టిగా అరుస్తాడు. నా భార్యకి నేనే మొదటి ముద్దు ఇవ్వాలని రాజ్ సిగ్గు పడతాడు. నిన్ను నమ్ముకుంటే నా శోభనం జరిగినట్టే అని అంతరాత్మ అంటే.. ఇన్ని రోజులూ వేరు.. ఇప్పుడు వేరురా అని రాజ్ సిగ్గు పడతాడు.

కనకం ఆవేశం.. పాపం కవి..

ఆ తర్వాత కనకం ఫ్యామిలీ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే చుట్టు పక్కల ఉండే అమ్మలక్కలు వస్తారు. ఏం చేస్తున్నావ్ అని అంటారు. కనబడటం లేదా దుమ్ము దులుపుతున్నా అని కనకం అంటే.. ఈ దుమ్ముది ఏం ఉంది కానీ.. నీ చిన్న కూతురు మీద పడ్డ మచ్చ ఎలా పోతుంది. లాడ్జ్‌లో దొరికింది అంట కదా.. అని వాళ్లు అంటే.. అప్పూ ఆవేశంతో మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండని అంటుంది. అయినా కావాలనే రెచ్చ గొట్టాలని మాట్లాడతారు. ఇక కనకం తన స్టైల్‌లో వాళ్లకు దుమ్ము దులిపేస్తుంది. ఇంట్లోంచి బయటకు పంపేస్తుంది. అప్పుడే కళ్యాణ్ కారులో వస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్ల మాటలు విన్న కళ్యాణ్ బాధ పడతాడు. కళ్యాణ్ రావడం చూసిన కనకం.. తలుపులు వేసేస్తుంది. కళ్యాణ్ ఎంత పిలిచినా.. తలుపులు తీయరు. లోపల ఎంతో బాధ పడుతూ ఉంటారు. బయట కళ్యాణ్ కూడా బాధతో వెళ్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.