ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గేమ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సుభాష్, అపర్ణ పెళ్లి రోజును ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసతూ ఉంటారు. పెళ్లి చూపుల్లో మావయ్య ఏ కలర్ షర్ట్ వేసుకున్నారో చెప్పాలి అని అపర్ణని అడిగితే.. సుభాష్ వైట్ కలర్ షర్ట్ అని రాస్తాడు. అది అపర్ణ కరెక్ట్ చెప్తుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి, ప్రకాశంలు ఆడతారు. ప్రకాశం మతిమరుపుతో వీళ్లు ఓడిపోతారు. వీళ్ల సీన్ ఎంతో ఫన్నీగా ఉంటుంది. మరోవైపు కళ్యాణ్ బాధతో కూర్చుంటాడు. నెక్ట్స్ రాజ్, కావ్యలు ఆడతారు. మొదటి సారి వీళ్లు ఎక్కడ కలుసుకున్నారో చెప్పాలని అంటే.. కావ్య ఆన్సర్ కరెక్ట్ చెప్పినా.. రాజ్ ముందు ఆన్సర్ రాంగ్ చెప్తాడు. ఆ నెక్ట్స్ రాజ్‌కి నువ్వు పెట్టిన నిక్ నేమ్ ఏంటో రాయమని కావ్యకి చెప్తే.. కావ్య మిస్టర్ డిఫెక్ట్ అని రాస్తుంది. అది రాజ్ కరెక్ట్‌గానే గెస్ చేస్తాడు. దీంతో వీళ్లు గెలుస్తారు.
ఆ తర్వాత కళ్యాణ్ డల్‌గా ఉండటం చూసి డ్యాన్స్ ప్రోగ్రామ్ మొదలు పెడతారు రాజ్ కపుల్. ముందు కళ్యాణ్‌ని డ్యాన్స్ చేయమని అడిగితే.. అయ్యో వద్దు అన్నయ్యా నేను చేయను అంటాడు. లేదు చేయాలని అందరూ అంటారు. సరే అయితే.. అమ్మా నాన్నలు చేసిన తర్వాత చేస్తానని అంటాడు. దీంతో ప్రకాశం, ధాన్య లక్ష్మిలు కలిసి ‘బాలకృష్ట సూపర్ హిట్ సాంగ్ అందాల ఆడ బొమ్మ’ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత స్వప్న, రాహుల్ లు కలిసి డ్యాన్స్ చేయమని పిలుస్తారు. రాహుల ఇష్టం లేకుండా వెళ్తాడు. వీళ్లకు లేటెస్ట్ ‘అల్లూ అర్జున్ హిట్ సాంగ్ వీడు మొరటోడు’ అనే సాంగ్ పెడతారు. ఇద్దరూ కలిసి బాగా చేస్తారు. డ్యాన్స్ బాగానే చేసావు అని రుద్రాణి అంటుంది. వెంటనే స్వప్న కౌంటర్ ఇస్తుంది.
ఆ తర్వాత కళ్యాణ్ డ్యాన్స్ చేయడానికి వస్తాడు. కళ్యాణ్ కావాలనే ‘చిరు నవ్వు నవ్వుతూ’ అనే సాడ్ సాంగ్ ఎంచుకుని డ్యాన్స్ చేస్తాడు. కళ్యాణ్ బాధకు అందరూ బాధ పడతారు. ఈ సాంగ్‌కు ఎంతో బాధగా డ్యాన్స్ చేస్తూ కుప్ప కూలిపోతాడు కళ్యాణ్. దీంతో అందరూ కంగారు పడతారు. ఇక తర్వాత రుద్రాణి వెళ్లి డ్యాన్స్ చితకొట్టేస్తుంది. రుద్రాణి ‘రాజమండ్రి రాజ మంజరి’ అనే మాస్ సాంగ్ పెడితే.. ఇరగదీస్తుంది. ఇక ఆ తర్వాత కావ్య, రాజ్‌లు డ్యాన్స్ చేస్తారు. అప్పుడే ఇందిరా దేవి పిలిచి నీ ప్రేమను చెప్పడానికి ఇదే మంచి సమయం చెప్పు అని అంటుంది. వీళ్లిద్దరికీ ‘నిజమేనే చెబుతున్నా’ అనే హిట్ సాంగ్ పెడతారు. ఈ పాటకు ఎంతో కూల్‌గా రాజ్, కావ్యలు డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు పెద్దమ్మ, పెదనాన్నా కేక్ కటింగ్ అని కళ్యాణ్ చెప్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.