Brahmamudi, February 7th episode: కన్నీళ్లతో కుమిలిపోతున్న కావ్య.. రాజ్ విడాకుల వెనుక కారణం అదేనా?

ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కళావతికి మండేలా రాజ్ కావాలనే శ్వేతతో వీడియో కాల్ మాట్లాడతాడు. అది చూసిన కావ్య లైట్ ఆఫ్ చేస్తుంది. ఏయ్ కాల్ మాట్లాడుతుంటే ఎందుకు లైట్ ఆఫ్ చేశావ్ అని అడుగుతాడు రాజ్. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని చెప్తాడు. నువ్వు ఎదురుగా ఉంటే నాకు అసలు మాట్లాడాలన్నా మూడే రాదు. నన్ను ఏడిపించడమే నీ పని కదా రాజ్ అంటాడు. ఆ పని చేస్తుంది మీరు..

Brahmamudi, February 7th episode: కన్నీళ్లతో కుమిలిపోతున్న కావ్య.. రాజ్ విడాకుల వెనుక కారణం అదేనా?
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Feb 07, 2024 | 11:25 AM

కావ్యకు ఖచ్చితంగా విడాకులు ఇస్తానని రాజ్ భీష్మించుకు కూర్చుంటాడు. కానీ అందుకు కావ్య ఒప్పుకోదు. ఖచ్చితంగా కారణాలు కావాలి అంటుంది. దీంతో రాజ్ నువ్వు మోడ్రన్‌గా ఉండవని చెప్తాడు. దీంతో రాజ్ కు నచ్చేలా ఉండేందుకు కావ్య ట్రై చేస్తుంది. కానీ రాజ్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. కావ్య అంటే తనకు అస్సలు ఇష్టం లేదని.. ఎలా అయినా విడాకులు తీసుకోవాలి అనుకుంటాడు. కావాలనే శ్వేతతో క్లోజ్‌గా ఉన్నట్లు నటిస్తాడు. అది చూసిన కావ్య చాలా బాధ పడుతుంది. దీంతో శ్వేతను ఆఫీస్‌‌కి పిలిపించి.. కావ్యకు మండేలా చేస్తాడు.

ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో..

ఈ క్రమంలోనే ఈ రోజు ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కళావతికి మండేలా రాజ్ కావాలనే శ్వేతతో వీడియో కాల్ మాట్లాడతాడు. అది చూసిన కావ్య లైట్ ఆఫ్ చేస్తుంది. ఏయ్ కాల్ మాట్లాడుతుంటే ఎందుకు లైట్ ఆఫ్ చేశావ్ అని అడుగుతాడు రాజ్. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని చెప్తాడు. నువ్వు ఎదురుగా ఉంటే నాకు అసలు మాట్లాడాలన్నా మూడే రాదు. నన్ను ఏడిపించడమే నీ పని కదా రాజ్ అంటాడు. ఆ పని చేస్తుంది మీరు.. అని కావ్య బాధ పడుతుంది. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. త్వరలో నీకే తెలుస్తుందిలే. అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తాను అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇలా రాజ్ అనడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తుంది. లోలోపల కావ్య అంటే ఇష్టం ఉన్నా.. ఏదో బలమైన కారణం వల్ల రాజ్ కావాలనే కావ్యను దూరం పెడుతున్నాడు. మరి ఆ కారణం ఏదో త్వరలోనే బయటపడుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

కావ్య కోసం రాజ్, శ్వేతలు గొడవ పడుతూ ఉంటారు. కావ్య మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది రాజ్.. నేను తట్టుకోలేకపోతున్నా.. మన మధ్య స్నేహం తప్ప ఏమీ లేదన్న విషంయ వెంటనే కావ్యకు చెప్పేస్తానని శ్వేత అంటుంది. ఆమె అంటే నాకు మనసులో ప్రేమ లేదు. ఏమీ లేనప్పుడు కలిసి ఉండటం అనవసరం. అందుకే తనతో విడిపోవాలని నిర్ణయించుకున్నా అని రాజ్ అంటాడు. షటప్.. పెళ్లి అంటే అంత తేలిక అయిపోయిందా.. నా మొగుడు అంటే మూర్ఖుడు. నీకేమైంది. చదువు, సంస్కారం, ఉన్నతమైన కుటుంబం ఉండి ఏ తప్పూ చేయని భార్యతో విడిపోతానని ఎలా అంటున్నావ్. నేను నిన్ను క్షమించలేను. నా పరిస్థితే కావ్యకు రావడానికి నేను ఒప్పుకోను అని శ్వేత అంటుంది. అయినా రాజ్ పట్టించుకోడు. కావ్య ఉక్రోశంతో రగిలిపోతుంది తప్ప.. నిన్ను వదిలేసి పోతాను అనడం లేదు. ఈ అపార్థాలు తొలగిపోయి.. మీరు హ్యాపీగా ఉండాలి అని శ్వేత అంటుంది. నేను చెప్పను అని రాజ్ అంటే.. అప్పుడు నీకూ నా మొగుడికి నా దృష్టిలో పెద్ద తేడా ఏమీ ఉండదు. వాడు పైకి కనిపిస్తాడు. నువ్వు కనబడకుండానే కాపురాన్ని కూల్చుకుంటున్నావ్. పెళ్లి అంటే బొమ్మలాట అయిపోయిందా అని వార్నింగ్ ఇస్తుంది శ్వేత.

మర్డర్ చేయడానికి రివాల్వర్ అడిన కావ్య.. షాక్‌లో కళ్యాణ్

మరోవైపు ఫ్రస్ట్రేషన్‌తో ఉంటుంది. వెంటనే కళ్యాణ్‌కి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కళ్యాణ్.. ఏంటి వదినా.. ఎలా ఉంది రెస్పాన్స్. ఆ లుక్‌లో మిమ్మల్ని చూసి.. అన్నయ్య ఫిదా అయిపోయాడా అని అడుగుతాడు. అవును స్లో మోషన్‌లో వచ్చి నన్ను గిరగిరా తిప్పాడు అని వెటకారంగా చెప్తుంది. ఓవెన్, గీజర్, బాయిలర్ స్విచ్ వేస్తే ఎలా మరుగుతాయో.. నా రక్తం అలా సలసలా కాగిపోతుంది. కవిగారూ నాకు అర్జెంట్‌గా రివాల్వర్, కత్తి కావాలి అని అడుగుతుంది కావ్య. అవి ఎందుకు వదినా అని కళ్యాణ్ అడిగితే.. మర్డర్ ప్లాన్ చేస్తున్నా అని కావ్య సమాధానం చెప్తుంది. ఊరుకోండి వదినా ఏదో చాక్లెట్ అడిగినట్టు మారణాయుధాలు అడుగుతున్నారు అని కళ్యాణ్ అంటాడు. నాకు ఇక్కడ మండిబోతుంది.

కావ్య చాలా మంచిది.. దూరం చేసుకోకు రాజ్: శ్వేత

శ్వేత అక్కడికి వచ్చిందా అని కళ్యాణ్ అంటే.. అవును ఇక్కడే ఉంది. ఉండండి వాళ్లు ఏం చేస్తున్నారో చూస్తాను అని వెళ్తుంది కావ్య. ఈలోపు శ్వేతను ఆఫీస్ బయటకు తీసుకెళ్తాడు రాజ్. తను వద్దు అనడానికి నువ్వు ఒక్క కారణం కూడా చెప్పడం లేదు. మీ మధ్య ఉంది కేవలం దూరం అంతే.. దానికే విడిపోవాలా. నా వల్ల మీరు విడిపోకూడదు అని శ్వేత చెప్తున్నా రాజ్ వినిపించుకోడు. అప్పుడే కావ్య వచ్చి చూస్తుంది. నాకు తనతో ఉండటం ఇష్టం లేదు. నేను విడిపోవడానికి కారణం వెతుకుతున్నా. ఇప్పుడు మనిద్దరినీ చూసింది. ఇప్పుడు నాకు సులభం అవుతుంది అని రాజ్ అంటాడు. కావ్య చాలా మంచిది. నేను నీతో ఉండటం తట్టుకోలేకపోయింది. నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఉంటుంది. తనను ఈ ఇంట్లో ఉంచి ఇంకా బాధ పెట్టలేను అని రాజ్ చెప్తాడు. ఇంతలో కావ్యను చూసిన రాజ్.. కావాలనే శ్వేతతో క్లోజ్‌గా ఉన్నట్టు చేస్తాడు. శ్వేతను పట్టుకుని.. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు వెళ్లు భుజంపై చేయి వేసి మరీ కారు ఎక్కిస్తాడు రాజ్. ఇది చూసిన కావ్య చాలా బాధ పడుతుంది. ఆ తర్వాత కావ్యను చూసిన రాజ్ కావాలనే పొగరుగా చూసుకుని వెళ్తాడు.

అప్పూ కోసం వచ్చిన పెళ్లి సంబంధం..

ఈ సీన్ కట్ చేస్తే.. కనకం ఇంటికి పెళ్లి చూపుల కోసం ఓ ఫ్యామిలీ వస్తుంది. మీ అమ్మాయిని ఎక్కడో చూశాడట. చాలా ఇష్ట పడుతున్నాడు. అందుకే మాట్లాడటానికి వచ్చాడు. మావాడు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. నెలకు రూ.50 వేలు. ఇల్లు కూడా ఉంది. అమ్మాయి గురించి అంతా తెలుసుకునే వచ్చాం అని చెప్తారు. ఇది విన్న కనకం, కృష్ణ మూర్తి సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంతలోనే అప్పూ వస్తుంది. వాళ్లను చూసిన ఏం జరుగుతుంది అని అడుగుతుంది. చెప్తా పదా అని కనకం లోపలికి తీసుకెళ్తుంది. కనకం ఎంత నచ్చ చెప్పినా అప్పూ ఒప్పుకోదు. నేరుగా వాళ్ల దగ్గరకు వెళ్లి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని అప్పూ అంటుంది. అప్పూపై కనకం సీరియస్ అవుతుంది. ఆగండి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మనసు మారితే ఫోన్ చేయండి అని వెళ్లి పోతారు.

నేను పోలీస్ అవుతానన్న అప్పూ..

ఆ తర్వాత అప్పూపై కనకం సీరియస్ అవుతుంది కనకం. నీకు మేము వెతికినా అంత మంచి సంబంధం తీసుకురాలేమే. మంచి ఉద్యోగం. మంచి వ్యక్తి అని కనకం చెప్తుంది. అయినా అప్పూ ఒప్పుకోదు. ఎందుకే ఒక్క కారణం చెప్పు అని కనకం అంటే.. అప్పూ నేను పోలీస్ అవుతా అని చెప్తుంది. అది విన్న కనకం, కృష్ణ మూర్తిలు షాక్ అవుతారు.

శ్వేత భర్తకు దిమ్మతిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చిన కావ్య:

మరోవైపు కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంతలో శ్వేత భర్త కారులో వచ్చి అడ్డంగా కారు ఆపుతాడు. దీంతో అతనిపై ఫైర్ అవుతుంది కావ్య. అడ్డంగా వచ్చి కారు ఆపిందే కాకుండా.. నువ్వు అని అంటున్నావ్ ఏంటి? అని రివర్స్‌ అయిపోతుంది. ఆగండి.. రాజ్, శ్వేతల ఫొటోలు పంపించింది నేనే అని చెప్తాడు. అది నువ్వా.. అంత పని కట్టుకుని నాకు ఫొటోలు పంపించాల్సిన అవసరం ఏముంది అని కావ్య అంటుంది. నేను శ్వేత భర్తను అని చెప్తాడు. మనం ఇద్దరం మోసం పోయాం. వాళ్లిద్దరూ నీకూ.. నాకూ.. విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. నీ మొగుడు నా పెళ్లాన్ని ట్రాప్ చేశాడు అని అంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావ్.. నీ భార్యే మా ఆయన్ని ట్రాప్ చేసి ఉండొచ్చుగా. అంత వరకూ వచ్చేంత నువ్వు ఏం చేస్తున్నావ్. నీకు పనీ పాటా ఏమీ లేదా. కట్టుకున్న పెళ్లిం ఇంకొంకరితో తిరుగుతుంది అని తెలిసి కూడా నువ్వు తాపీగా క్యాండిడ్ షార్ట్స్‌తో ఫొటోలు తీస్తూ తిరుగుతున్నావా. బెస్ట్ ఫొటోగ్రాఫర్ గా బతికేద్దాం అనుకుంటున్నావా.. అయినా నీకు సిగ్గుందా.. బుద్ది ఉందా.. నీ పెళ్లాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని తెలీదా అంటూ చెడా మడా వాయించేస్తుంది కావ్య. వామ్మో.. ఇదెక్కడి ఆడదిరా బాబూ. నా పెళ్లాం కూడా ఇలా తిట్టలేదు. తిడితే పడింది. కొడితే కింద పడింది. అది నా మాట వినడం లేదని ఇటు నుంచి నరుకొద్దాం అంటే.. ఇదే నరికేసేలా ఉంది. ఇలాంటి దాన్ని భరించలేకనే ఆ దరిద్రుడు నా పెళ్లాం వెంట పడినట్టు ఉన్నాడు అని అనుకుంటాడు.