Brahmamudi, November 29th episode: అరుణ్ కోసం కావ్య ఎంక్వైరీ.. అప్పూ కోసం స్కెచ్ రెడీ చేస్తోన్న కనకం!

|

Nov 29, 2023 | 10:10 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఎంతసేపు అయినా కళ్యాణ్ బయటకు రాకపోవడంతో అనామిక ఇంటి లోపలికి వచ్చి.. కళ్యాణ్ ని తిడుతుంది. అందరూ నా కోసమే వెయిట్ చేసేవారు. నేను ఎవరి కోసం కూడా వెయిట్ చేయలేదు. ఈ రోజు నీ కోసం ఇంత సేపు వెయిట్ చేశాను. అది కాదు అనామిక పాపం అప్పూ ఎలా ఫీల్ అవుతుందో.. తనని మనతో తీసుకెళ్దామని కన్విన్స్ చేస్తున్నా.. కాస్త లేట్ అయిందని కళ్యాణ్ అంటాడు. అందంతా కాదు.. ఇప్పుడు నువ్వు వస్తున్నావా.. రావడం లేదా.. అని అనామిక అంటాడు. ఒక్క నిమిషం ఆగు వస్తాను.. బ్రో రావచ్చు కదా అని కళ్యాణ్ అంటే.. నీ కోసం అనామిక వెయిట్ చేస్తుంటే..

Brahmamudi, November 29th episode: అరుణ్ కోసం కావ్య ఎంక్వైరీ.. అప్పూ కోసం స్కెచ్ రెడీ చేస్తోన్న కనకం!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఎంతసేపు అయినా కళ్యాణ్ బయటకు రాకపోవడంతో అనామిక ఇంటి లోపలికి వచ్చి.. కళ్యాణ్ ని తిడుతుంది. అందరూ నా కోసమే వెయిట్ చేసేవారు. నేను ఎవరి కోసం కూడా వెయిట్ చేయలేదు. ఈ రోజు నీ కోసం ఇంత సేపు వెయిట్ చేశాను. అది కాదు అనామిక పాపం అప్పూ ఎలా ఫీల్ అవుతుందో.. తనని మనతో తీసుకెళ్దామని కన్విన్స్ చేస్తున్నా.. కాస్త లేట్ అయిందని కళ్యాణ్ అంటాడు. అందంతా కాదు.. ఇప్పుడు నువ్వు వస్తున్నావా.. రావడం లేదా.. అని అనామిక అంటాడు. ఒక్క నిమిషం ఆగు వస్తాను.. బ్రో రావచ్చు కదా అని కళ్యాణ్ అంటే.. నీ కోసం అనామిక వెయిట్ చేస్తుంటే.. నన్ను బ్రతిమ లాడుతున్నావేంటి? వెళ్లు నేను రాను.. నాకు వేరే పని ఉంది. నాన్న వస్తే బయటకు వెళ్లాలి అని అప్పూ అంటుంది.

అప్పూ కోసం అనామికను వదిలేసిన కళ్యాణ్:

ఒకటి చెప్పు నాతో రావడం నీకు ఇష్టం లేదు కదా అని అప్పూని అడుగుతాడు కళ్యాణ్.. అసలు నాతో రావడం నీకు ఇష్టం ఉందా.. లేదా.. అని అనామిక అడుగుతుంది. అబ్బా మధ్యలో నువ్వేంటి అనామిక.. తను ఫీల్ అవుతుంది తెలియడం లేదా.. తనని వదిలేసి ఎలా రాను అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. సరే నువ్వు నీ ఫ్రెండ్ తోనే ఉండు నేను వెళ్తున్నా అని అనామిక సీరియస్ గా వెళ్తుంది. ఏంటి బాబూ ఇది పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అలా బాధ పడుతుంది. మా అప్పూతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. తనతో వెళ్లాల్సి ఉండేదని కనకం అంటుంది. అనామికతో ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోవచ్చు. కానీ ఈ బ్రో అలా కాదు. చెప్పిన మాట వినదు. ఏం చేయను చెప్పండి. ఈ రోజు నేను తనని హ్యాపీగా చూసేంతవరకూ నేను వెళ్లను అని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఎంత సేపు కూర్చున్నా నీకు సమాధానం దొరకదు. ఎందుకంటే నేను ఏ విషయంలో కూడా బాధ పడటం లేదని అప్పూ అంటే.. నువ్వు నిజం చెప్పేంత వరకు నేను ఎక్కడికీ వెళ్లను అని కళ్యాణ్ అంటాడు.

రాజ్ తో కావ్య ఛాలెంజ్..

మరోవైపు ఆఫీస్ కి రెడీ అవుతాడు రాజ్. ఈ రోజు మీరు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు అని కావ్య అంటే.. ఎక్కడికి అని రాజ్ అంటాడు.. పని ఉందని కావ్య చెప్తుంది. అదే ఏ పని అని రాజ్ అడిగితే.. చెప్తే గానీ తీసుకెళ్లరా.. అసలు విషయం చెప్తే మీరే నాతో వస్తారని కావ్య అంటుంది. అది స్వర్గమైనా నేను నీతో రాను అని రాజ్ అంటాడు. ఇక కావ్య సెటైర్లు వేస్తుంది. నీతో కలిసి ఎక్కడికీ రానని రాజ్ చెప్పేస్తాడు. కానీ అది మన ఫ్యామిలీ హ్యాపీ నెస్ కోసమని చెప్పినా రారా అని అడుగుతుంది కావ్య. మా అక్కని బ్లాక్ మెయిల్ చేసిన ఆ అరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది. వాడిని వెళ్లి పట్టుకుని నాలుగు పీకితే అసలు నిజం బయట పెడతాడని కావ్య అంటే.. మీ అక్క తప్పు లేదని ప్రూవ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నావా.. అని రాజ్ అంటాడు. అవును.. మా అక్క ఏ తప్పూ చేయలేదంటే ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనే అని కావ్య అంటుంది. మీ అక్క కదా.. వెళ్లి ప్రూవ్ చేసుకో అని రాజ్ అంటాడు. ఇక కావ్య మీరు ఎలాగైనా వచ్చేలా చేస్తాను అని నాటకం మొదలు పెడుతుంది. కిందకు మెట్లు దిగుతూ ఉంటే.. ఏంటి కోడలి పిల్ల కొత్తగా కనిపిస్తుందని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అబ్బే ఏమీ లేదు అత్తయ్యా.. ఏమైనా విశేషం ఉందా అని ధాన్య లక్ష్మి అంటుంది.. ఇక కావ్య సిగ్గు పడుతూ.. వారు చెప్పొద్దు అన్నారు.. సర్ ప్రైజ్ అత్తయ్యా అని అంటుంది కావ్య.

ఇవి కూడా చదవండి

రాజ్ ని ఇరకాటంలో పడేసిన కావ్య.. షాక్ లో అపర్ణ:

అప్పుడే రాజ్ పై నుంచి కిందకు వస్తాడు. రా రాజ్.. భార్యను స్పెషల్ గా రెడీ చేయించి ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.. అంటూ కావాలని ధాన్య లక్ష్మి ఆట పట్టిస్తుంది. ఇక వీర లెవల్లో యాక్టింగ్ మొదలు పెడుతుంది కావ్య. మధ్యలో ఇరుక్కు పోతాడు రాజ్. వాళ్లిద్దరూ ఎక్కడికో సరదాగా వెళ్తుంటే.. ఎందుకు అలా ఆట పట్టిస్తున్నారు వెళ్ల నివ్వు అని ఇందిరా దేవి అంటుంది. సరే రా అని రాజ్ అంటే.. నేను రానండి.. మీరు అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుంటేనే.. అత్తయ్య గారు వెళ్ల మంటనే వస్తాను అని కావ్య అంటుంది. వామ్మో అని రాజ్ మనసులో తిట్టుకుంటాడు. ఇక అడగలేక.. అపర్ణను మమ్మీ నేనూ, కళావతి బయటకు వెళ్లి వస్తాం అని అంటాడు రాజ్. వెళ్లు నాన్నా నీ భార్యకు సర్ ప్రైజ్ లే ఇస్తావో ఏం ఇచ్చుకుంటావో తీసుకెళ్లు అని అంటుంది. అదిగోండి.. అత్తయ్య సంతోషంగా చెప్పడం లేదని కావ్య మళ్లీ ఫిటింగ్ పెడుతుంది.

కావ్య నటనకు బిత్తరపోయినా అపర్ణ, రాజ్ లు:

దానికి అపర్ణ, రాజ్ లు బిత్తర పోయి చూస్తారు. మమ్మీ కాస్త సంతోషంగా అంట చెప్పొచ్చు కదా అని రాజ్ అంటే.. అపర్ణ వెకిలి నవ్వు నవ్వి.. తీసుకెళ్లు అని అంటుంది. దీంతో మళ్లీ కావ్య అత్తయ్య గారి ఆశీర్వాదం ఉంటే మనకు అంతే చాలు అని అంటుంది. అమ్మో దీని యాక్టింగ్ చూస్తే నేనే పడి పోయేలా ఉన్నాను అని రాజ్ కావాలని కావ్యని తీసుకెళ్లాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ నవ్వుతాడు. అప్పుడే అబ్బబ్బ ఏమీ ఎరుగని వెల్లుల్లి పాయ ముంతలో వేస్తే కరిగిపోయే అన్నట్టు.. ఏమీ ఎరగనట్టు ఉండే నీ కోడలు ఎంత బాగా రాజ్ ని మ్యానేజ్ చేస్తుంది వదినా అని రుద్రాణి అంటుంది. ధ్యలో నీకేంటి బాధ.. పతివ్రత పరమాన్నం చేస్తే.. తెల్లారినా చల్లారలేదంట.. వాళ్ల కాపురం అలాంటిది మరి అని ధాన్య లక్ష్మి అంటుంది.

అప్పూ కోసం ప్లాన్ స్టార్ట్ చేసిన కనకం:

ఇక ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ కూర్చుని అన్నం తింటుంది. పొద్దున్న నుంచి మనం తినమంటే ఆకలి లేదని చెప్పింది కదా.. ఇప్పుడు చూడు ఎలా తింటుందో అని అంటుంది కనకం. అవునే.. అనామిక వచ్చి అరిచినా.. పట్టించుకోకుండా అప్పూ కోసం ఆగి పోయాడని అన్న పూర్ణ అంటుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కంటే.. అప్పూకి ప్రాధాన్యం ఇచ్చాడంటే ఎంతలా అప్పూని ఇష్ట పడుతున్నాడని కనకం అంటుంది. అవును ఎంత కాదన్నా స్నేహితుడే కదా అని అన్న పూర్ణ అంటే.. స్నేహితుడు అయితే మాట్లాడి వెళ్లి పోవచ్చు.. ఇలా అప్పూ బాధని అర్థం చేసుకుని మనసులో ఉండే భారం అంతా తగ్గించి వెళ్లి పోయాడని కనకం అంటుంది.

అప్పూపై ఉన్న ప్రేమను కళ్యాణ్ తో బయట పెట్టిస్తా:

అప్పూ కూడా ఒకప్పుడు తనకు తెలీకుండా కళ్యాణ్ ని ఇష్ట పడిందో.. అలాగే కళ్యాణ్ కూడా అప్పూని ప్రేమిస్తున్నాడు అనిపిస్తుందని కనకం అంటే.. మరి అనామికతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అని అన్నపూర్ణ అంటాడు. ఒకవేళ అప్పూ స్థానంలో కళ్యాణ్ ఉండి.. దీనికి పెళ్లి గనక అవుతుంటే కళ్యాణ్ కూడా ఇలాగే బాధ పడేవాడు.. అప్పుడు ప్రేమ బయటకు వస్తుందని కనకం అంటే.. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావేమో కనకం అని అన్న పూర్ణ అంటుంది. ఎలాగైనా కళ్యాణ్ లోపల ఉన్న ప్రేమ బయటకు వస్తే చాలు.. అప్పూని ప్రేమిస్తున్నానని చెప్తాడు. నేను ఆ ఇంటికి వెళ్తే.. కళ్యాణ్ మనసులో అనామిక లేదు అప్పూ ఉందని చెప్పాలి. ఆ దేవుడు నాకు ఒక్క అవకాశం వస్తే చాలు.. నేను నా కూతురు తల రాతని మార్చేస్తా.. కళ్యాణ్ తో అప్పూ పెళ్లి జరిపిస్తా అని అంటుంది కనకం.

కడుపుతో ఉన్నానని చెప్పిన స్వప్న.. కొత్త నాటకమా అని కనకం ఫైర్:

సరిగ్గా అప్పుడే స్వప్న.. కనకానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పమ్మ.. ఈ సారి ఏం చేశావ్ అని అడుగుతుంది కనకం. కావ్యతో మాట్లాడేసరికి ప్రేమ పొంగుకొస్తుంది.. నేను అనేసరికి వెటకారం వెతుక్కుంటూ వచ్చేస్తుందని స్వప్న అంటే.. ఏం చేస్తాం కొంత మంది తలరాతలు అంతే కదా అని కనకం అంటుంది. నేను తల్లిని కాబోతున్నా అని స్వప్న చెప్తుంది. కానీ కనకం పెద్దగా పట్టించుకోదు. ఆడిన నాటకమే మళ్లీ ఎన్నిసార్లు ఆడతావే.. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా.. సీమంతం రోజు అంత అవమానం జరిగినా మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టావ్ అని అడుగుతుంది కనకం. అయ్యో నేను చెప్పేది నిజమే అమ్మా.. ఈసారి నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్తుంది. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే.. నీ ముద్దుల కూతురికి ఫోన్ చేసి అడుగు అని స్వప్న ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందే అని అన్న పూర్ణ అడిగితే.. స్వప్న కడుపుతో ఉందక్క నమ్మలేక పోతున్నా అని కనకం ఆలోచిస్తూ ఉంటుంది.

కారులో కావ్య, రాజ్ ల గిల్లి కజ్జాలు.. కనకం మాటలకు నవ్విన రాజ్:

ఇక కారులో కావ్య, రాజ్ లు ఇద్దరూ వెళ్తూంటారు. దీంతో కావ్య కావాలనే రాజ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్ ఏమో చిర్రుబుర్రులు ఆడుతూ ఉంటాడు. తాతయ్య గానీ లేకపోతే నిన్ను మీ ఇంటికి పంపించేదాన్ని అని రాజ్ అంటే.. ఏంటంటి అలా మాట్లాడుతున్నారు అని కావ్య అంటే.. అవును ఏంటి అలా అన్నాను.. తాతయ్య కానీ అడ్డు పడక పోతే అని రాజ్ అంటూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ గొడవ పడుతూ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి.. ఏంటే ఆ స్వప్న నిజంగానే కడుపుతో ఉందా.. లేక మరో కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టిందా అని కనకం అడుగుతూ ఉంటే.. రాజ్ నవ్వుతూ ఉంటాడు. ఏంటే ఏం మాట్లాడవేంటి? అని కనకం అంటే.. అక్క నిజంగానే కడుపుతో ఉందమ్మా.. అని కావ్య చెప్తే.. నేను చస్తే నమ్మను. మళ్లీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టినట్టుంది ఆ రాక్షసి అని కనకం అంటుంది. ఇక ఇవాళ్టితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.