Brahmamudi, December 28th episode: సస్పెన్స్‌లో కళ్యాణ్ – అనామిక పెళ్లి.. అప్పూ హగ్ తో రచ్చ షురూ!

పెళ్లిలో విలన్స్ గుట్టు బయట పెట్టాలని కావ్య, పద్మావతిలు అనుకుంటారు. అదే క్రమంలో సస్పెన్స్‌లు ఇస్తున్నారు. ఈ లెక్క చూస్తే కళ్యాణ్ - అనామికల పెళ్లి ఎలా జరుగుతుందో.. అసలు జరుగుతుందో లేదో అన్న టెన్షన్ నెలకొంది. ఒక వైపు కళ్యాణ్.. అనామికను ఇష్ట పడుతూ పెళ్లికి సిద్ధమయ్యాడు. మరోవైపు అప్పూపై ప్రేమను కూడా చూపిస్తున్నాడు. దీంతో అనామికను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎలాంటి సీన్లు రివిల్ చేయకుండా..

Brahmamudi, December 28th episode: సస్పెన్స్‌లో కళ్యాణ్ - అనామిక పెళ్లి.. అప్పూ హగ్ తో రచ్చ షురూ!
Brahmamudi

Updated on: Dec 28, 2023 | 10:23 AM

బ్రహ్మముడి, నువ్వూ నేను ప్రేమ సీరియల్స్ ‘మహా సంగ్రామం’ ఎపిసోడ్ ఇంట్రెస్టిం‎గ్‎గా కొనసాగుతుంది. గత వారం రోజులుగా సాగుతున్న మహా సంగ్రామం ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా రెండు సీరియల్స్‌కి సంబంధించిన నటులు కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, అనామిక ల హల్దీ ఫంక్షన్, మెహిందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఆ తర్వాత పెళ్లిలో గాజులు వేసుకునే సంప్రదాయం కూడా బాగానే ముగిసింది. ఇక చివరిగా సంగీత్ ఫంక్షన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది.

పెళ్లిలో విలన్స్ గుట్టు బయట పెట్టాలని కావ్య, పద్మావతిలు అనుకుంటారు. అదే క్రమంలో సస్పెన్స్‌లు ఇస్తున్నారు. ఈ లెక్క చూస్తే కళ్యాణ్ – అనామికల పెళ్లి ఎలా జరుగుతుందో.. అసలు జరుగుతుందో లేదో అన్న టెన్షన్ నెలకొంది. ఒక వైపు కళ్యాణ్.. అనామికను ఇష్ట పడుతూ పెళ్లికి సిద్ధమయ్యాడు. మరోవైపు అప్పూపై ప్రేమను కూడా చూపిస్తున్నాడు. దీంతో అనామికను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎలాంటి సీన్లు రివిల్ చేయకుండా సస్పెన్స్ పెట్టాడు డైరెక్టర్.

అందరి ముందు కళ్యాణ్ ని హగ్ చేసుకున్న అనామిక..

సంగీత్ లో కావ్య – రాజ్, విక్రమ్ – పద్దూ, అను – ఆర్య, అనామిక – కళ్యాణ్ లు డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తారు. ఇదే జోరులో అనామిక – కళ్యాణ్ లు డ్యాన్స్ చేస్తుండగా.. అప్పూ ఒక్కసారిగా పైకి లేచి చాలు అని అంటుంది. దీంతో అందరూ ఏం జరిగిందా అని చూస్తారు. ఒక్కసారిగా అప్పూ వెళ్లి కళ్యాణ్‌ని హగ్ చేసుకుంటుంది. ఇది చూసిన అందరూ ఏం జరుగుతుందో తెలీక ఒక్కసారిగా షాక్ అయి నిల్చుండి పోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో.. అప్పూ ఎలా కవర్ చేస్తుందో.. అనామిక, ఇంట్లోని సభ్యులందరూ ఎలా రియాక్ట్ అవుతారో.. తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

అరవిందకు రాజ్, విక్కీ, ఆర్య, కళ్యాణ్ లు అందరూ కలిసి గాజులు తొడుగుతారు. మేము కూడా నీకు తమ్ముళ్లమే. నీకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటామన్న విషయం మర్చి పోకు అని రాజ్ అంటాడు. వాళ్లను చూసి అందరూ సంతోషిస్తుండగా.. బామ్మర్దులు ఎక్కువైపోయి.. శత్రువుల సంఖ్య పెరిగిపోతుందని మురళి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య కావాలనే మురళిని ఇరికించి.. పద్మావతికి గాజులు తొడగమని చెబుతుంది. కానీ మురళి చేతికి గాయం చేసుకుని.. గాజులు కిందకు జారుస్తాడు మురళి. అయ్యో అంటూ అరవింద.. మురళికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది.

పెళ్లికి వచ్చిన బంటి.. నిజం చెప్పాలని కళ్యాణ్ రూమ్ కి వెళ్లి చెప్పబోతుంటే.. అప్పూ వచ్చి ఆపేస్తుంది. ఇక జరిగింది తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు మురళి. నన్ను గెలికితే ఎలా ఉంటుందో.. ఆ కావ్యకి నేనేంటో చూపిస్తాను అని మురళి అంటాడు. పెళ్లిలో అందరూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఇందిరా దేవి ఫైర్ అవుతుంది. ఫోన్స్ అన్ని తీసుకుని ఒక ట్రైలో పెట్టమని చెబుతుంది. ఆ తర్వాత కాబోయే భార్య భర్తలకు అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. రాజ్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ ని తలుచుకుంటూ ప్రేమ గురించి చెప్తాడు. ఆ తర్వాత అప్పూ కూడా తన ప్రేమని ఇన్ డైరెక్ట్‌గా రాధాకృష్ణుల ప్రేమ కథగా చెప్తుంది.

ఈ సీన్ కట్ చేస్తే.. పెళ్లికి వచ్చిన వారితో పులిహోర కలుపుతూ ఉంటాడు మురళి. అది చూసిన విక్కీ ఆవేశంతో ఊగిపోతాడు. ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా అంటూ మురళి కాలర్ పట్టుకుని నిలబెడతాడు. ఈలోపు అది చూసిన అరవింద అక్కడికి వస్తుంది. దొరికిందే ఛాన్స్ అని విక్కీని.. మురళి ఇరికిస్తాడు. అసలు విషయం తెలీక.. విక్కీపై అరిచి.. కొడుతుంది. ఇక్కడేం జరుగుతుందో నీకు తెలీదు అక్క.. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు.. అని బాధతో విక్కీ వెళ్లిపోతాడు.