‘మహా సంగ్రామం’ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. గత వారం రోజులుగా సాగుతున్న మహా సంగ్రామం ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా ఇరు సీరియల్ ల నటులు కలిసి సందడి సందడి చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, అనామిక ల హల్దీ ఫంక్షన్, మెహిందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి. తాజాగా పెళ్లిలో గాజులు వేసుకునే సంప్రదాయం గురించి పెద్దావిడ.. కుటుంబ సభ్యులందరికీ చెప్తుంది.
ఈ క్రమంలోనే అనామికకు అన్న వరుస అయిన వాళ్లందరి చేత.. గాజులు వేయిస్తారు. సరిగ్గా అప్పుడే పద్మావతికి కూడా గాజులు వేయమని మురళిని పిలిచి చెప్తుంది కావ్య. అరవింద కూడా పద్మావతికి గాజులు వేయాలని చెప్తుంది. దీంతో మురళి తప్పనిసరిగా గాజులు వేస్తాడు. ఆ తర్వాత జంటలందరూ కలిసి డ్యాన్సులు వేయడం మొదలు పెడతారు. కావ్య – రాజ్, విక్రమ్ – పద్దూ, అను – ఆర్య, అనామిక – కళ్యాణ్ లు డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తారు.
అనామిక – కళ్యాణ్ లు డ్యాన్స్ చేస్తుండగా చూసిన అప్పూ ఒక్కసారిగా చాలు అని అంటుంది. దీంతో అందరూ ఏం జరిగిందా అని చూస్తారు. ఒక్కసారిగా అప్పూ వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. ఇది చూసిన అందరూ ఏం జరుగుతుందో తెలీక ఒక్కసారిగా షాక్ అయి నిల్చుండి పోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో.. అప్పూ ఎలా కవర్ చేస్తుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
రాత్రి డ్రింక్ తాగి శుభ్రంగా పడుకుంటారు. తెల్లారు లేచే సరికి రాజ్ పై.. కావ్య పడుకుంటుంది. లేచే సరికి ఏం జరిగిందని.. రాజ్ రచ్చ రచ్చ చేస్తాడు. అలాగే పద్మావతి కూడా టెంపరోడిని అలియాస్ విక్రమ్ ని ఓ ఆట ఆడుకుంటుంది. అరుణ్ కి దొంగ చాటుగా టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది కనకం. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని ఐస్ చేస్తుంది. కానీ అరుణ్ చెప్పడు. స్వప్న గురించి తప్పుగా వాగుతాడు. దీంతో ఒక్కటి ఇస్తుంది స్వప్న. నువ్వే నా వెంట పడ్డావ్ కదారా.. నేనేమన్నా నిన్ను ప్రేమించానని కానీ.. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానా అని ఆవేశంతో ఊగిపోయి.. అరుణ్ చంపేస్తానని పీక పట్టుకుంటుంది. కనకం విడిపించి.. అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత కుచల కుమారి అన్న మాటలకు.. అను తిండి మానసి ఆలోచిస్తూ కళ్లు తిరిగి పడి పోతుంది. దీంతో అనుకి ఏమైందా అని అందరూ సీరియస్ గా ఆలోచిస్తారు. ఈలోపు డాక్టర్ గుడ్ న్యూస్ చెబుతుందని మురళి అంటే.. కుచల కుమారి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ డాక్టర్ వచ్చి.. అనూకి హెల్త్ బాలేదని చెప్తుంది. దీంతో అనూని నోటికి వచ్చినట్లు తిడుతుంది కుచల కుమారి. కావ్య తన స్టైల్లో చెప్తూ నోరు మూయిస్తుంది. నెక్ట్స్ పెళ్లికి అందరికీ మట్టి గాజులు తెప్పిస్తుంది ఇందిరా దేవి.
అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు గాజులు వేయడం సంప్రదాయమని చెబుతుంది. దీంతో వరసకు అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లకు గాజులు వేస్తారు. ఈ క్రమంలోనే నాకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే చాలా బావుండేదని కనకం ఫీల్ అవుతుంటే.. మేము ఉన్నాం కదమ్మా.. అని సుభాష్, ప్రకాష్ లు వచ్చి కనకానికి గాజులు వేస్తారు. ఇది చూసి రుద్రాణి.. అయిన వాళ్లకు ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అని సెటైర్లు వేస్తుంది. ఇలా నిన్నటి ఎపిసోడ్ కొనసాగింది.