
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో పెళ్లి పత్రిక ఇవ్వడానికి అనామిక వాళ్లు ఇంటికి వస్తారని చెప్తాడు కళ్యాణ్. ఇది విన్న కనకం లోలోపల మండి పడుతూ ఉంటుంది. దీంతో ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. అనామికతో పాటు పేరెంట్స్ ఇంట్లోకి వస్తారు. ఇంట్లోని వారంతా వారికి స్వాగతం పలుకుతారు. ధాన్య లక్ష్మి, అనామిక తల్లి ఒకరికొకరు కుంకుమ పెట్టుకుంటారు. ఇంట్లో ఉన్న పెద్దావిడ పెళ్లి కార్డుల మీద బొట్టు వాళ్లిద్దరికీ ఇస్తుంది. అప్పుడే వాళ్లు పెళ్లి పత్రికలు మార్చుకునే సమయానికి.. మధ్యలోకి వచ్చి కుంకుమ భరిణ తీసుకుంటాను. అప్పుడే అపశకునం పక్షిలాగా కార్డులు మార్చుకునే సమయానికి కుంకుమ భరిణ నేల మీద పడేలా చేస్తుంది. అది చూసిన ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు.
ఏమిటీ ఈ అమంగళం.. ఇదిలా జరిగి ఉండకూడదు.. మా ఆయన ప్రాణానికి ప్రమాదమా.. అని ధాన్య లక్ష్మి అంటే.. నువ్వు వెళ్తే నేను ఏమౌతానే.. అని ప్రకాష్ అంటే.. మీరిద్దరూ లేకపోతే నేను కూడా ఉండలేను. అంత మాట అనకు కళ్యాణ్ అని అనామిక అంటుంది. ఇక ఒకరి తర్వాత మరొకరు డైలాగులు చెప్తూ ఉంటారు. దీంతో అపశకునం జరిగిందని.. పెళ్లి జరగదని ఇంట్లోని వాళ్లంతా వెళ్లి పోతారు.. అంటూ వాళ్లను ఊహించుకుంటూ కల కంటుంది కనకం. ఇక అక్కడే చప్పట్లు కొట్టుకుంటూ.. పెళ్లి ఆగి పోయింది.. ఆగి పోయింది అని సంతోషంతో సంబర పడుతుంది కనకం. సరిగ్గా అప్పుడే అప్పూ లోపలికి వస్తుంది. అమ్మా అమ్మా అని పిలుస్తుంది. కలలో నుంచి తేరుకున్న కనకం.. ఏం జరిగిందో తెలుసా అనేలోపు.. కళ్యాణ్ అక్కడికి వచ్చి.. రా బ్రో లోపలికి వెళ్దాం అని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు.
కళ్యాణ్, అనామిక పెళ్లి ఆపాలని ఆలోచిస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే రాహుల్ వచ్చి.. అనామిక వాళ్లు పెళ్లి కార్డు తీసుకువస్తున్నారని.. కళ్యాణ్ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలని వాళ్లు ఆలోచిస్తూ ఉంటే.. నువ్వేంటి మమ్మీ? ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఆ పనికి రాని స్వప్నని నీకు ఇచ్చి పెళ్లి చేసి.. ఇప్పుడు ఆ కళ్యాణ్ కి మంచి సంబంధం తీసుకొస్తారా.. చూస్తూ ఎలా ఉంటాను. ఒప్పుకోను ఎలాగైనా ఈ పెళ్లి ఆపేస్తా అని రుద్రాణి అంటే.. అదెలాగ మమ్మీ అని రాహుల్ అడుగుతాడు. ఎలాగో పంతులు గండాలు, దోషాలు ఉన్నాయని చెప్పాడు కదా.. దాన్ని అడ్డం పెట్టుకుంటే సరి పోతుంది. ఎలాగో కావ్య ఉంది కదా.. ఈ నేరాన్ని ఎలాగో కావ్య మీద తోసేద్దాం అని అంటుంది రుద్రాణి.
ఇక పెళ్లి పత్రిక తీసుకుని అనామికతో పాటు పేరెంట్స్ కూడా ఇంటికి వస్తారు. వాళ్లను దుగ్గిరాల వారి ఇంట్లోని వారందూ ఆహాన్విస్తారు. ఆ తర్వాత కళ్యాణ్, అనామికలను ఇంట్లోని వారు ఆట పట్టిస్తూ ఉంటారు. మీ కంగారు చూస్తుంటే ఆడ పిల్లను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అన్నట్టు ఉన్నారని రుద్రాణి అంటే.. కావ్య సీరియస్ గా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత రుద్రాణి కవర్ చేస్తుంది. ఆ తర్వాత కావ్యని పెళ్లి కార్డు తీసుకుని రమ్మని చెప్తుంది. అలాగే ధాన్య లక్ష్మిని వచ్చి పెళ్లి కార్డు తీసుకోమని చెప్తుంది పెద్దావిడ. ఇక ధాన్య లక్ష్మి, ప్రకాష్ కలిసి కార్డు ఇవ్వడానికి సిద్ధమవుతారు. సరిగ్గా అప్పుడే కుంకుమ భరిణ తీసుకుంటుంది కనకం. ఇక వియ్యంకులు ఇద్దరూ పెళ్లి కార్డు మార్చుకుంటారు. అప్పుడు కావాలని కుంకుమ భరిణ వదిలేస్తుంది కనకం. దీంతో ధాన్య లక్ష్మి కుంకుమ పట్టుకుంటుంది.
ఆ తర్వాత కావ్యని పెళ్లి కార్డుకు బొట్టు పెట్టి హారతి ఇవ్వమని చెప్తుంది పెద్దావిడ. అయితే ఇంట్లో వాళ్లకు తెలీకుండా పసుపులో ఏదో కలుపుతుంది రుద్రాణి. అది తెలియని కావ్య.. కార్డుకు పసుపు రాసి హారతి ఇస్తుంది. ఆ హారతి వేడికి కార్డు అంటుకుంటుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. కార్డు అంటుకోవడంతో రుద్రాణి, రాహుల్ లు సంతోష పడతారు. ఇక దొరికిందే ఛాన్స్ కదా అని రుద్రాణి రెచ్చి పోతుంది. ఏంటి? అలా ఎలా చేశావ్ కావ్య.. అనామిక వాళ్ల పేరెంట్స్, ధాన్య లక్ష్మి ముఖం చూడు ఎంత ఫీల్ అవుతున్నారో.. నువ్వు ఇలా పెళ్లి పత్రిక తగలబెడతావ్ ఏంటి? నీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది. నువ్వే ఈ తప్పు చేశావ్ అని రుద్రాణి ఏసుకుంటుంది.
అప్పుడు రాజ్ రియాక్ట్ అవుతూ.. కళావతి ఏమన్నా కావాలని చేసిందా.. ఏదో అనుకోకుండా జరిగింది అని అంటాడు. అనుకోకుండా కాదు బాబూ.. అజాగ్రత్త వల్ల జరిగింది. ఆడ పిల్ల తల్లిదండ్రులుగా ఒకసారి ఆలోచించింది. రుద్రాణి గారు చెప్పింది కూడా నిజమేగా.. అమ్మాయి దోషం వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు కదా.. అనామిక తండ్రి సుబ్రమణ్యం అంటాడు. ఏదో అనుకోకుండా తప్పు జరిగింది.. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాకుండా.. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిది కదా అని కనకం అంటే.. ఏం ఆలోచించమంటారు. మీకు కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కదా వాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకోమంటారా అని అనామిక తల్లి శైలు అంటుంది. ఇక కనకం తల దించుకుంటుంది.
ఆ తర్వాత కావ్యపై సీరియస్ అవుతుంది శైలు. ఎందుకు ఇలా చేశావ్.. రేపు మా అమ్మాయి ఇంట్లోకి వచ్చాక చీమ కుట్టినా తన వల్లే జరిగింది అంటారు అని శైలు అంటే అంటే.. ఆంటీ ఎందుకు మీరు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నారు అని కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. ఆలోచన కాదు కళ్యాణ్ బాబూ.. ఇది మా కూతురు జీవితం.. పెళ్లి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోదు కదా.. తను ఇక్కడ సంతోషంగా ఉండటం కూడా మాకు ముఖ్యమే. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఈ పెళ్లి మీ వదినకు ఇష్టమేనా.. ఇందాకేమో వాళ్ల అమ్మ.. కుంకుమ భరిణ పడేపోయింది. ఇప్పుడు కావ్య.. ఇదంతా చూస్తుంటే అనుమానం వస్తుంది. అనామిక తల్లి మాటలు విన్న కళ్యాణ్.. ఆవేశంగా అనామికా అని గట్టిగా పిలుస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.