Brahmamudi, September 27th episode: రాహుల్ ప్లాన్ సక్సెస్.. కిడ్నాప్ అయిన స్పప్న.. పోలీసుల ఎంట్రీ! టెన్షన్ లో రుద్రాణి!!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాహుల్, రుద్రాణి చేసిన ప్లాన్ ప్రకారం.. స్వప్నని కిడ్నాప్న చేస్తారు రౌడీలు. రాహుల్ ని కొట్టినట్టు నాటకం ఆడి.. స్వప్నని కిడ్నాప్ చేస్తారు. ఇక కావ్య.. రాజ్ బట్టలను ఇస్త్రీ చేస్తుంది. అయితే రాజ్ షర్ట్ బటన్ ఊడిపోతుంది. ఈలోపు కుడదామని కావ్య సూది కోసం వెళ్లగా.. రాజ్ వచ్చి షర్ట్ వేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపు వీళ్లిద్దరూ కీచులాడుకుంటారు. ఇక సినిమాలో సీన్ లాగా.. కావ్య గుండీని కుడుతుంది. కావ్య గుండీని వేస్తుంటే అలానే చూస్తూ..

Brahmamudi, September 27th episode: రాహుల్ ప్లాన్ సక్సెస్.. కిడ్నాప్ అయిన స్పప్న.. పోలీసుల ఎంట్రీ! టెన్షన్ లో రుద్రాణి!!
Brahmamudi

Updated on: Sep 27, 2023 | 11:55 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాహుల్, రుద్రాణి చేసిన ప్లాన్ ప్రకారం.. స్వప్నని కిడ్నాప్న చేస్తారు రౌడీలు. రాహుల్ ని కొట్టినట్టు నాటకం ఆడి.. స్వప్నని కిడ్నాప్ చేస్తారు. ఇక కావ్య.. రాజ్ బట్టలను ఇస్త్రీ చేస్తుంది. అయితే రాజ్ షర్ట్ బటన్ ఊడిపోతుంది. ఈలోపు కుడదామని కావ్య సూది కోసం వెళ్లగా.. రాజ్ వచ్చి షర్ట్ వేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపు వీళ్లిద్దరూ కీచులాడుకుంటారు. ఇక సినిమాలో సీన్ లాగా.. కావ్య గుండీని కుడుతుంది. కావ్య గుండీని వేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతాడు రాజ్. ఇది చూసిన ఇందిరా దేవి సంబరపడిపోతుంది. కావ్య కూడా రాజ్ ని చూస్తుంది.

రాజ్ షర్ట్ గుండీ కుడుతున్న కావ్య.. మురిసిపోతున్న ఇందిరా దేవి:

ఇందిరా దేవి తనలో తాను నవ్వుకుంటూ.. సీతా రామయ్య దగ్గరకు వెళ్లి చెప్తుంది. రాజ్ లో చాలా మార్పు వచ్చింది బావా.. కావ్యతో నడుచుకుంటున్న పద్దతే మారిపోయింది. వాళ్లిద్దర్నీ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.. అంటూ చెప్తూ మురిసి పోతుంది ఇందిరా దేవి. మరి రాజ్ నాకు మాట ఇచ్చాక ఎలా తప్పుతాడు అంటూ సీతా రామయ్య నోరు జారతాడు. నీకు మాట ఇవ్వడం ఏంటి అని ఇందిరా దేవి షాక్ అవుతుంది. ఆ తర్వాత సీతా రామయ్య కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఇందిరా దేవి, సీతా రామయ్య టిఫిన్ తినడం కోసం ఇంట్లోకి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

రాజ్ ని ఆడుకున్న ధాన్యలక్ష్మి:

ఇక పైనుంచి రాజ్ కూడా టిఫిన్ కోసం కిందకు వస్తాడు. రా తాతయ్య టిఫిన్ చేద్దాం అని పిలుస్తాడు. మేము చేసేశాం రా.. నువ్వు తిను అంటాడు సీతారామయ్య. అదేంటి మావయ్య గారూ.. గుండీ ఒక్కటి ఊడిందో.. రెండు ఊడాయో తెలీదు కదా అంటూ ఇరికిస్తుంది ధాన్య లక్ష్మి. ఈ విషయం వీళ్లకు ఎలా తెలుసు? అని రాజ్, కావ్యలు షాక్ అవుతారు. దీంతో రాజ్ సీరియస్ అవుతా.. పిన్నీ నీకు ఆకలి వేస్తే టిఫిన్ తిను.. అంతే కానీ నన్ను తినకు అంటూ సెటైర్ వేయ్యగా.. అందరూ నవ్వుకుంటారు.

షాక్ లో దుగ్గిరాల ఫ్యామిలీ:

ఈ టైంలో వచ్చి సుభాష్ కు ఫోన్ వస్తుంది. రాహుల్ కి గాయాలై ఆస్పత్రిలో ఉన్నాడంటూ కాల్ వస్తుంది. దీంతో సుభాష్ షాక్ అవ్వగా.. ఇంట్లో వాళ్లందరూ కంగారు పడతారు. ఏమైంది డాడీ అంటూ రాజ్ అడగ్గా.. రాహుల్ కి గాయాలై.. ఆస్పత్రిలో ఉన్నాడంట అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. స్వప్న ఏమైంది మావయ్యా.. అంటూ కావ్య కూడా కంగారు పడుతుంది. వెంటనే కావ్య, రాజ్, సుభాష్, రుద్రాణి ఆస్పత్రికి వెళ్తారు. ఇక వీర లెవల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి.

ఇరుకున్న తింగరి స్పప్న.. నవ్వుకుంటున్న రౌడీలు:

ఇక స్వప్నని కిడ్నాప్ చేసి.. కట్టేస్తారు రౌడీలు. నన్ను మర్యాదగా విడిచి పెట్టండంటూ రౌడీలకు చెప్తుంది స్వప్న. నువ్వు నా రస గుల్లవి బంగారం నిన్ను విడిచి పెట్టను.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అంటాడు. దీంతో స్వప్న షాక్ అవుతుంది. రాహుల్ వచ్చి నీ పని చెప్తాడు.. మిమ్మల్ని చంపేస్తాడు అని అంటుంది స్వప్న. దీంతో రౌడీలు అందరూ నవ్వుతూంటారు.

నర్స్ తో పులిహోర కలుపుతున్న రాహుల్.. వీర లెవల్లో యాక్టింగ్ ఇరగదీస్తున్న రుద్రాణి:

ఇక ఆస్పత్రిలో ఉన్న రాహుల్.. నర్స్ లతో పులిహోర కలుపుతూ ఉంటాడు. ఈలోపు మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని.. డాక్టర్ చెప్పగా.. రాహుల్ నటిస్తాడు. ఇక రుద్రాణి వీర లెవల్లో నటిస్తూ.. యాక్టింగ్ చేస్తుంది. ఇదేమీ తెలియని రాజ్, సుభాష్, కావ్యలు బాధ పడతారు. ఈలోపు డాక్టర్ వచ్చి.. రాహుల్ కి తలకు పెద్ద గాయం అయిందని.. చికిత్స తీసుకుంటున్నాడని చెప్తాడు. మరోవైపు కావ్య ఏమో.. స్వప్న గురించి కంగారు పడుతుంది. తనతో మా అక్క కూడా ఉండాలి డాక్టర్ తను రాలేదా అని కావ్య అడుగుతుంది. లేదని చెప్పగా.. కావ్య టెన్షన్ పడుతుంది. స్పప్న అక్క ఏమైందని.. బాధ పడుతూ పోలీసులకు చెప్దాం అని రాజ్ అంటుంది. కంగారు పడకు.. ముందు ఏం జరిగిందో తెలియాలి కదా. అది తెలియాలంటే రాహుల్ స్పృహలోకి రావాలి అంటూ చెప్తాడు.

రాహుల్ అర్థం లేని సమాధానం.. కావ్య ఇరికించేస్తుందా:

ఈలోపు నర్స్ వచ్చి.. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు అంటూ చెప్తుంది. వెంటనే అందరూ రాహుల్ దగ్గరకు వెళ్తాడు. రాహుల్ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తూ.. స్పప్న.. స్వప్న ఎక్కడ? అంటూ అడుగుతాడు. నేను వెళ్లి కాపాడాలి అంటూ అంటాడు. ఏంటి మా అక్కని ఎత్తుకెళ్లిపోయారా? అని కావ్య షాక్ అవుతుంది. దీంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు. అసలేం జరిగిందో చెప్పు.. నేను వెళ్లి స్పప్నని తీసుకొస్తాను అని రాజ్ అడగ్గా.. రాహుల్ అర్థం లేకుండా ఏదేదో చెప్తూ ఉంటాడు. దీంతో కావ్యకు డౌట్స్ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈలోపు రుద్రాణి కవర్ చేస్తుంది. ఇలా ఈరోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.