Brahmamudi, September 23rd episode: దొంగిలించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సిద్ధమైన రౌడీలు.. కావ్య పని అయిపోయినట్టేనా?

|

Sep 23, 2023 | 12:19 PM

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. గత వారం రోజులుగా సస్పెన్స్ ని కొనసాగిస్తున్నాడు సీరియల్ డైరెక్టర్. రుద్రాణి, రాహుల్ అనుకున్నట్లుగానే ప్లాన్ అమలు పరుస్తారు. రాహుల్ ప్లాన్ ప్రకారం.. విగ్రహాలను ఎత్తుకెళ్లడానికి వచ్చిన రౌడీలు.. అక్కడే ఉన్న కృష్ణమూర్తిని కొట్టేసి విగ్రహాలను డీసీఎంలోకి ఎక్కించుకుని వెళ్తారు. అక్కడే నిద్ర పోతున్న బంటి అందంతా చూసి.. వెళ్లి రాజ్, కావ్య, కనకం, అప్పులకు చెప్తాడు..

Brahmamudi, September 23rd episode: దొంగిలించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సిద్ధమైన రౌడీలు.. కావ్య పని అయిపోయినట్టేనా?
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. గత వారం రోజులుగా సస్పెన్స్ ని కొనసాగిస్తున్నాడు సీరియల్ డైరెక్టర్. రుద్రాణి, రాహుల్ అనుకున్నట్లుగానే ప్లాన్ అమలు పరుస్తారు. రాహుల్ ప్లాన్ ప్రకారం.. విగ్రహాలను ఎత్తుకెళ్లడానికి వచ్చిన రౌడీలు.. అక్కడే ఉన్న కృష్ణమూర్తిని కొట్టేసి విగ్రహాలను డీసీఎంలోకి ఎక్కించుకుని వెళ్తారు. అక్కడే నిద్ర పోతున్న బంటి అందంతా చూసి.. వెళ్లి రాజ్, కావ్య, కనకం, అప్పులకు చెప్తాడు.

వాళ్లు వెంటనే కారులో వచ్చి చూసేసరికి కృష్ణ మూర్తి దెబ్బలతో కనిపిస్తాడు. కృష్ణ మూర్తిని అలా చూసి కనకం, కావ్య, అప్పులు బాధ పడతారు. ఇక కృష్ణ మూర్తి కూడా తన బాధనంతా వెళ్లగక్కుతాడు. ఈలోపు విగ్రహాలు ఏవంటూ కాంట్రాక్టర్ వస్తాడు. కృష్ణమూర్తిని దెబ్బలతో చూసిన కాంట్రాక్టర్ ఏమైందని అడగ్గా.. విగ్రహాలు ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్తారు. దీంతో షాక్ అయిన కాంట్రాక్టర్ కంగారు పడతాడు. నా పని అంతా అయిపోయింది.. కస్టమర్స్ కి నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ బాధ పడతాడు.

ఇక అప్పుడే రాజ్ కి బల్బ్ వెలుగుతుంది. మనం వస్తున్నప్పుడు వాళ్లు డీసీఎంలోనే విగ్రహాలను తరలించారని చెప్తాడు. వెంటనే రాజ్, ఇక అప్పు ఇద్దరూ సిటీ అంతా గాలిస్తూంటారు. కావ్య కృష్ణ మూర్తిల దగ్గరే ఉంటుంది. రాజ్ అందరినీ అడుగుతూ వెళ్తూంటాడు. ఇక అప్పూ కూడా తన ఫ్రెండ్స్ తో గల్లీ గల్లీ తిరుగుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈలోపు రౌడీలు రాహుల్ కి కాల్ చేసి.. విగ్రహాలను ఏం చేయాలి? అని అడుగుతాడు. నిమజ్జనం చేయమని చెప్తాడు.. అంత ఖరీదైనవి ఎలా నిమజ్జనం చేస్తాం సార్.. అమ్మేస్తాం అంటాడు రౌడీ. అలా అయితే మన ప్లాన్ అంతా తెలిపోతుంది.. నేను చెప్పినట్టు చేయండి.. మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్తాడు రాహుల్. అలాగే అని విగ్రహాలను ఎవరూ లేని చెరువు వైపు తీసుకెళ్తారు రౌడీలు.

మరో వైపు గాయాలతో ఉన్న కృష్ణమూర్తికి కట్టు కడుతుంది కావ్య. వీళ్లు ఇంకా రాలేదేంటి? అని కంగారు పడుతూంటారు. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కాంట్రాక్టర్ అయిపోయిదమ్మా.. అంతా అయిపోయింది.. ఇక విగ్రహాలు దొరకవు.. వాళ్లు అమ్మేసి ఉంటారు. నేను కస్టమర్స్ కి ఏం సమాధానం చెప్పాలి.. అంటూ కంగారు పడుతూ ఉంటాడు. దీంతో కనకం, కావ్య, కృష్ణ మూర్తి బాధ పడుతూంటారు.

మరోవైపు చెరువు దగ్గరకు వచ్చేసిన రౌడీలు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి డీసీఎం నుంచి దింపుతూ ఉంటారు. ఒక వైపు అప్పు తన ఫ్రెండ్స్ తో, రాజ్ తన ఇన్ ఫ్లులెన్స్ తో విగ్రహాలను ఎక్కడికి తీసుకెళ్లారో తెలీక వెతుకుతూంటారు. సడన్ గా ఇక్కడే సస్పెన్స్ పెడుతూ ఎపిసోడ్ ని ఎండింగ్ చేసాడు డైరెక్టర్. వినాయక విగ్రహాలను రౌడీలు నిమజ్జనం చేసేశారా? కావ్య పని ఇక అయిపోయిందా? రాహుల్ – రుద్రాణిల ప్లాన్ సక్సెస్ అయిందా? తెలియాలంటే మళ్లీ సోమవారం వరకూ వెయిట్ చేయాల్సిందే.