Brahmamudi, September 15th episode: రుద్రాణి వల్ల షేక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ.. అపర్ణకు రాజ్ గట్టి వార్నింగ్.. వెలి వేసుకున్న అపర్ణ!!

పని మనిషికి డబ్బులు ఇవ్వడానికి కావ్య పై నుంచి వస్తుంది. ఈ లోపు రుద్రాణి మాటలకు ఆగ్రహంతో రెచ్చిపోతున్న అపర్ణ బయటకు వస్తుంది. కావ్య పని మనిషికి డబ్బులు ఇవ్వబోతుండగా.. ఆగు అంటూ పెద్ద కేక వేస్తుంది. అపర్ణ అరుపులకు ఇంటి సభ్యులందరూ వచ్చేస్తారు. ఇక అపర్ణ.. కావ్యను తగులుకుంటుంది. ఏయ్ ఆగు.. ఏం చేస్తున్నావ్? శాంత డబ్బులు అడిగితే ఇస్తున్నా అని చెబుతుంది కావ్య. అంటే నువ్వు ఈ ఇంటి యజమానురాలివా? అప్పుడే అంత కొమ్ములు వచ్చాయా? నీకు అని అపర్ణ నిలదీస్తుంది. ఇప్పుడేం జరిగింది అత్తయ్యా? దానికి దీనికి సబంధం ఏంటి? అని అడుగుతుంది. నీకేం తెలియనట్లు నటించకు...

Brahmamudi, September 15th episode: రుద్రాణి వల్ల షేక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ.. అపర్ణకు రాజ్ గట్టి వార్నింగ్.. వెలి వేసుకున్న అపర్ణ!!
Brahmamudi

Updated on: Sep 15, 2023 | 1:19 PM

ఈ రోజు బ్రహ్మ ముడి సీరియల్ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో రచ్చ మామూలుగా లేదు. ఒక రేంజ్ లో రెచ్చిపోయిన అపర్ణకు.. రాజ్, ఇంటి సభ్యులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో నన్ను వెలి వేసేయండి అంటూ దన్నం పెడుతుంది అపర్ణ. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. పని మనిషికి డబ్బులు ఇవ్వడానికి కావ్య పై నుంచి వస్తుంది. ఈ లోపు రుద్రాణి మాటలకు ఆగ్రహంతో రెచ్చిపోతున్న అపర్ణ బయటకు వస్తుంది. కావ్య పని మనిషికి డబ్బులు ఇవ్వబోతుండగా.. ఆగు అంటూ పెద్ద కేక వేస్తుంది. అపర్ణ అరుపులకు ఇంటి సభ్యులందరూ వచ్చేస్తారు. ఇక అపర్ణ.. కావ్యను తగులుకుంటుంది. ఏయ్ ఆగు.. ఏం చేస్తున్నావ్? శాంత డబ్బులు అడిగితే ఇస్తున్నా అని చెబుతుంది కావ్య. అంటే నువ్వు ఈ ఇంటి యజమానురాలివా? అప్పుడే అంత కొమ్ములు వచ్చాయా? నీకు అని అపర్ణ నిలదీస్తుంది. ఇప్పుడేం జరిగింది అత్తయ్యా? దానికి దీనికి సబంధం ఏంటి? అని అడుగుతుంది. నీకేం తెలియనట్లు నటించకు.. ఈ డబ్బు నీకు ఎక్కడిది? నీ పుట్టింటి నుంచి తెచ్చావా?. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని నీకు తెలీదా? ఈ దాన ధర్మాలు ఎప్పుడు మొదలు పెట్టావ్ నీకు ఏం హక్కు ఉంది? అంటూ కావ్యని నిలదీస్తుంది.

మీకే నిజం తెలుస్తుంది ఆగండి అత్తయ్యా..

అసలు ఏం జరిగింది అపర్ణా? అంటూ ఇందిరా దేవి అడుగుంది. మీకు తెలీదు.. ఒక్క నిమిషం ఆగండి.. అంతా మీకే తెలుస్తుంది అత్తయ్యా అంటూ అపర్ణ ఆవేశంగా అంటుంది. దీంతో ఇందిరా దేవి షాక్ అవుతుంది. ఏయ్ చెప్పు? ఆ డబ్బు నీకు ఎక్కడిది? నువ్వు ఎందుకు ఇస్తున్నావ్? అని కావ్యపై మళ్లీ రంకెలు వేస్తుంది అపర్ణ. నేనేం చేశాను అత్తయ్యా? శాంతకి ఏదో అవసరం ఉందంట అందుకే డబ్బు ఇస్తున్నాను.. ఇది మంచి పనే కదా అని అంటుంది కావ్య. అది నువ్వు డిజైన్స్ గీసి సంపాదించావా? లేక నీ పుట్టింటి నుంచి తెచ్చావా? నా కొడుకు డబ్బు కదా అని అడుగుతుంది. అవును ఇది మీ అబ్బాయి డబ్బే కానీ.. నేను చెప్పేది వినండి.. అంటుంది కావ్య. హేయ్ నువ్వు ఆపు.. మీ అత్తగారు మాట్లాడుతున్నారు కదా.. మాట్లాడనివ్వు అని అంటుంది రుద్రాణి మధ్యలో.

ఇవి కూడా చదవండి

అహంకారం తలకెక్కి.. నన్నే ధిక్కరిస్తుందా?

అది కాదు అత్తయ్య.. ఈ పని మనిషి శాంత ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు కూడా అడిగిన ప్రతిసారీ డబ్బు ఇస్తూనే ఉన్నాను. నన్ను కాకుండా రాజ్ ని.. రాజ్ కి తెలీకుండా నన్ను అడుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా అడిగితే.. ఇవ్వనని చెప్పాను. ఇవ్వడం తప్పు లేదు.. అంతే కానీ అడిగి ప్రతి సారి ఇచ్చుకుంటూ పోతే ఎలా? అంటూ అపర్ణ అంటుంది. నేను ఇవ్వను అన్నాను.. వెంటనే ఈ పని మినిషి కావ్యను అడిగింది. ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. నేను ఇవ్వను అన్న మనిషికి మళ్లీ ఇవ్వడం ఏంటి? అసలు నా గురించి ఏమనుకుంటుంది? ఈ ఇంట్లో సర్వ హక్కులు తనవే అనుకుంటుందా? తన స్థానమే గొప్పదని విర్రవీగుతుందా? అహంకారం తలకెక్కి.. నన్నే ధిక్కరించడం అలవాటుగా మార్చుకుందా? అంటూ అపర్ణ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

రుద్రాణికి చివాట్లు:

ఇదంతా అర్థం కాని కావ్య అయోమయంగా పని మనిషి వైపు చూస్తుంది. దీంతో ఇందిరా దేవి ఏంటి కావ్య.. మీ అత్తగారు ఇవ్వను అని చెప్పాక నువ్వెందుకు ఇస్తున్నావ్? ఏ కారణంతో ఇవ్వను అంటుందో ఆలోచించాలి కదా? అంటూ ఇందిరా దేవి కోపంగా కావ్యను ప్రశ్నిస్తుంది. దీంతో కావ్య.. అయ్యో అమ్మమ్మ గారూ నాకు ఇదంతా తెలీదు అని అంటుంది. ఇక సుభాష్ ఎంటర్ అవుతూ.. అపర్ణ.. నువ్వు రుద్రాణి మాటలు వింటున్నావా? అని ప్రశ్నిస్తాడు. ధాన్య లక్ష్మి, ప్రకాష్ కుడా రుద్రాణిని తిడతారు. దీంతో అదేంటి అన్నయ్య అంత మాట అన్నావ్.. ఇంత గొడవకు నేనే కారణం అంటావా? అని ప్రశ్నిస్తుంది.

ఆవేశంతో రగిలిపోయిన అపర్ణ:

దీంతో పని మనిషి అది కాదు అమ్మగారూ నేను చెప్పేది వినండి.. అంటూ నిజం చెప్పబోతే.. రుద్రాణి చెప్పనివ్వదు. ఏయ్ ఏంటి నీకు కావాల్సింది డబ్బు అంతే కదా.. ఇదిగో తీసుకో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కావ్య చేతిలో ఉన్న డబ్బును తీసుకుని పని మనిషికి ఇస్తుంది రుద్రాణి. ఇంత గొడవకు కారణం నేనే కాబట్టి.. ఈ డబ్బు నాకు వద్దు అంటూ పని మనిషి అంటే.. లేదు దీనికి నీకూ సంబంధం లేదు డబ్బు తీసుకుని నువ్వు వెళ్లు అంటుంది కావ్య. అదిగో చూశారా అత్తయ్య.. ఇంతసేపటి నుంచి నేను తల కొట్టుకుని చెబుతూ ఉంటే.. మీ మనవరాలు మాత్రం ఏమీ పట్టించు కోవడం లేదు. డబ్బు ఇచ్చి పని మనిషిని వెళ్లిపోమంటుంది. అసలు ఎంత ధైర్యం? అని అపర్ణ అంటే.. రుద్రాణి ఇంకా మాట్లాడుతూ అపర్ణని రెచ్చ గొడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు ఇంటి పెద్దల్లారా? నా పెద్దరికాన్ని మంట గలిపిన ఈమెను ఏం చెయ్యమంటారు అంటూ బిగ్గరగా అరుస్తుంది.

మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్యా.. నేను చెప్పింది వినండి. ఇంతకు ముందు మీరు పని మనిషికి చాలా సార్లు డబ్బు ఇచ్చారు.. అప్పుడు అమ్మమ్మ గారు కూడా ఇలానే గొడవ చేశారా? అడ్డుకున్నారా? ఈ మాటలకు అపర్ణ బిత్తర పోతుంది. అయినా ఇది మా ఆయన డబ్బు.. ఇవ్వడంలో తప్పేం ఉంది అంటుంది కావ్య. నేను లేకుండా మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషిగా చూసే సరికి అహంకారం తలకు ఎక్కిందా? వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నావా? అప్పుడు కూడా ఇలా డబ్బు నీ పుట్టింటికి దోచి పెట్టావ్.. ఇప్పుడు నా మాట కాదని పని మనిషికి ఇచ్చావ్? నీకు ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అంటుంది అపర్ణ ఆవేశంగా.

మీకెంత హక్కు ఉందో.. నాకూ అంతే హక్కు ఉంది: 

ఈ ఇంటి కోడలిగా మీకు ఎంత హక్కు ఉందో? నాకు అంతే హక్కు ఉంది అంటూ కావ్య అంటుంది. దీంతో అపర్ణ ఏంటి ఏం అన్నావ్.. నువ్వూ నేనూ ఒకటా? నువ్వెంత నీ బతుకెంత? చంపి పడేస్తావా అంటూ చేయి ఎత్తి కొట్ట బోతుంది అపర్ణ. కావ్య భయంతో కళ్లు మూసుకుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి అపర్ణ చేతిని అడ్డుకుంటాడు. చేయి దించు మమ్మీ.. అంటాడు. దీంతో షాక్ అయిన అపర్ణ.. బిత్తర పోయి చూస్తుంది. ఇప్పటి వరకూ ఈ దుగ్గిరాల వంశంలో ఎవరూ ఎవరి మీదా చేయి ఎత్తలేదు. నువ్వెందుకు మమ్మీ ఇలా ఈ కళావతిని మీద చేయి ఎత్తావు అంటాడు రాజ్. తప్పా నేనే చేసేది తప్పా.. ఏ కారణంతో ఈ అమ్మాయి మీద చేయి ఎత్తానో తెలుసా? అంటుంది అపర్ణ. కారణం ఏదైనా.. ఇలా మన ఇంటలో ఓ ఆడ పిల్లపై చేయి ఎత్తడం.. అవమానించడం మాత్రం నా దృష్టిలో తప్పే మమ్మీ. మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. నాకు ఎంత ఆవేశం వచ్చినా నేను ఎప్పడూ ఈ కళావతిపై చేయి ఎత్తలేదు అంటాడరు రాజ్. నీకు ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయ్ మమ్మీ. అంతే కానీ ఇలా కళావతిని కొట్టే అధికారం నీకే కాదు.. ఈ ఇంట్లో ఎవరికీ లేదు అంటాడు రాజ్.

అపర్ణ చేయిని అడ్డుకున్న రాజ్:

ఈ లోపు రుద్రాణి అపర్ణను రెచ్చ గొట్టేలా చురకలు వేస్తుంది. అసలు ఈ కళావతి ఏం తప్పు చేసింది? అని అడుగుతాడు రాజ్. అక్క డబ్బు ఇవ్వనని పని మనిషికి చెబితే.. కావ్య ఇచ్చిందట రాజ్ అదే అంటుంది ధాన్య లక్ష్మి. అప్పుడు కావ్య రియాక్ట్ అవుతూ.. భగవంతుడి సాక్షిగా.. నిజంగా అత్తయ్య డబ్బులు ఇవ్వన్న విషయం నాకు తెలీదండి. పని మనిషి కష్టం అనగానే.. డబ్బు ఇవ్వాలి అనుకున్నా అని అంటుంది. దీనికేనా ఇంత రచ్చా? ఇది నేరమా? కావ్య తనంతట తాను డబ్బును తీసుకు రాలేదు.. నన్ను అడిగింది.. సరే అన్నాకే తీసుకొచ్చి ఇచ్చింది అంటాడు రాజ్. విన్నావా అపర్ణ.. నీ కొడుకు చెప్పింది కూడా అబద్ధమేనా? చెలికత్తెల మాటలు విని ఎన్నో రాజ్యాలే కూలిపోయాయి. నువ్వు ఈ రుద్రాణి మాటలు పట్టుకుని ఎందుకు గొడవ చేశావ్ అని ప్రశ్నిస్తుంది. ఇక ఒకరి తర్వాత మరొకరు అపర్ణని తప్పు పడతారు. నువ్వేం మాట్లాడవేంటీ బావా అని ఇందిరా దేవి.. సీతారామయ్యని అడుగుతుంది. ఏం మాట్లాడమంటావ్ చిట్టీ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పాకులాడే ఈనాటి కోడల్ని చూసి నిర్ఘాంత పోయి చూడటం తప్ప అంటూ బాధగా మాట్లాడతాడు.

రెండు చేతులూ పైకెత్తి దండం పెట్టిన అపర్ణ:

ఇంటి సభ్యుల అందరి మాటలకు బాధ పడిన అపర్ణ.. రెండు చేతులూ పైకెత్తి.. నన్ను క్షమించండి అత్తయ్య గారూ, మావయ్య గారూ, నా భర్త గారూ, నా కొడుకు గారూ, నా మరిది గారూ, తోటి కోడలు గారూ మీరందరూ మానవత్వానికి పెద్ద పీట వేసిన మహాను భావులు. నేను మాత్రమే తప్పు చేశాను అని అంటుంది. మమ్మీ ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్.. అని అంటాడు రాజ్. అందరూ నన్ను ఒంటరి దాన్ని చేశారు. ఈ రోజు ఈ అవమానం కావ్యకు జరగలేదు.. నాకు జరిగింది అని బాధ పడుతుంది. నేను ఏం మాట్లాడినా తప్పే జరుగుతుంది. ఈ తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా.. ఎవరితోనూ మాట్లాడను. జడ పదార్థం లాగే బతుకుతాను. నన్ను ఈ ఇంట్లో నుంచి వెలి వేయండి అని అపర్ణ అంటుంది. అపర్ణ మాటలకు అందరూ షాక్ అవుతూ అలా చూస్తుండి పోతారు. ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.