బ్రహ్మ ముడి సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తో ముందుకు సాగుతోంది. వారం వారంలో ఫ్యాన్స్ కి ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది బ్రహ్మముడి సీరియల్. ఈ క్రమంలోనే మళ్లీ గత నాలుగు రోజుల నుంచి ఎపిసోడ్ రిలీజ్ చేయకుండా సస్పెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఎపిసోడ్ రిలీజ్ చేయలేదు. అయితే ప్రోమోను చూస్తుంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ లో మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. కడుపు ఉందని నాటకం ఆడుతూ స్వప్న.. రాహుల్ ని పెళ్లి చేసుకుంటుంది. ఈ నిజం కేవలం కావ్యకు మాత్రమే తెలుసు. ఇక ఆ తర్వాత ఈ నాటకాన్ని బయట పెట్టమని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు స్వప్న. అలా ఇప్పుడు సీమంతం వరకూ తీసుకొచ్చింది.
స్వప్న కడుపు నాటకాన్ని బయటపెట్టేసిన కనకం:
అయితే స్వప్న మెట్లపై నుంచి జారి పడడంతో కనకం చూడటానికి వస్తుంది. చూడటానికి వచ్చిన కనకాన్ని.. ఇందిరా దేవి ఇంట్లోనే ఉండి స్వప్నని చూడమని చెప్తుంది. ఈ క్రమంలోనే దుగ్గిరాల ఇంట్లోనే ఉంటూ స్వప్నని చూసుకుంటుంది. ఇక పై నుంచి వచ్చిన కావ్యని జ్యూస్ తీసుకు రమ్మని చెప్తుంది స్వప్న. ఇది విన్న కనకం.. అమ్మా తల్లీ సీమంతానికి, ప్రసవానికి మధ్య చాలా టైమ్ ఉంది. అంటూ కనకం జాగ్రత్తలు చెబుతూ ఉంటే కావ్య వింటూ ఉంటుంది. ఒక్క చోటే ఉప్పు బస్తాలా కూర్చోకుండా అటూ ఇటూ నడువు.. ప్రసవం దాకా నువ్వు నా మాట వినాల్సిందే అంటూ కనకం.. స్వప్నకి చెప్తూ ఉంటుంది. ఈ మాటలు విన్న కావ్య జ్యూస్ తీసుకొచ్చి.. కడుపు ఉంటేనే కదా అమ్మా ప్రసవం అవ్వడానికి అని పొరపాటును అనేస్తుంది. ఇది విన్న కనకం, స్వప్న షాక్ అవుతారు. కావ్య మాటలకు కనకం కంగారు పడుతుంది. అయితే ఇది గమనించిన కావ్య.. మళ్లీ కవర్ చేస్తుంది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో..
అప్పూని కారులో తీసుకెళ్తూ.. అనామిక, కళ్యాణ్ ఇద్దరూ షాపిగ్ విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అప్పూ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. అప్పూని గమనించిన అనామిక.. ఎవరినో లవ్ చేస్తున్నట్టు ఉంది అంటూ చెప్పేస్తుంది. ఈ మాటలకు అప్పూ షాక్ అవగా.. కళ్యాణ్ నవ్వుతాడు. ఏంటి బ్రో లవ్ చేయడమా.. ఛాన్సే లేదు అని అంటాడు. ఇక నేరుగా అనామిక అప్పూని లవ్ చేస్తున్నావా.. అని అడుగుతుంది. కానీ అప్పూ నేను లవ్ చేయడం ఏంటి అని అడుగుతుంది. ఆ తర్వాత అప్పూని ఇంటి దగ్గర దింపేస్తాడు. ఈ లోపు అప్పూకి బై చెప్తూ.. అనామిక మీద పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. ఇదంతా చూసిన అప్పూ బాధ పడుతూ ఉంటుంది.
రాహుల్ ని కడిగి పారేసిన స్వప్న:
ఇక నెక్ట్స్ గదిలోకి వచ్చిన రాహుల్ని కడిగి పారేస్తుంది స్వప్న. ఇలా దొంగలా నా నగలను ఎత్తుకెళ్లాల్సిన పని ఏంటి? నీ పర్మిషన్ తీసుకోవడం ఏంటి? అని రాహుల్ రివర్స్ అవుతాడు. అయినా పట్టించుకోని స్వప్న నగలను తీసుకుని లాక్ వేసి వెళ్లి పోతుంది.
రొమాంటిక్ ఫీల్ లో రాజ్, కావ్యలు:
ఆ తర్వాత నడుము నొప్పితో బాధ పడుతూ కావ్య గదిలోకి వస్తుంది. పరుపు తీసుకుని వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత ఆయింట్మెంట్ తీసుకుని కావ్య కి రాసుకుంటుంది. అది గమనించిన రాజ్.. హెల్ప్ చేద్దాం అంటే మళ్లీ ఏం అనుకుంటుందో అని అడగడు. ఆ తర్వాత కావ్యే రాజ్ ని పిలిచి.. కాస్త హెల్ప్ చేయవచ్చు కదా అని అడగ్గా.. వచ్చి రాయబోతాడు. కానీ చేతులు వణుకుతాయి. ఏంటి? అదేదో పాముని పట్టుకున్నట్టు చేతులు వణికిపోతున్నాయని కావ్య అడగ్గా.. నువ్వేం కాసేపు మాట్లాడకు అని రాజ్ అని అంటాడు. ఆ తర్వాత మెల్లగా నడుముకి ఆయింట్మెంట్ రాయగా.. అప్పడే’మధురమే ఈ క్షణమే చెలీ’. అనే సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడే రాజ్ నిన్న ఓ మాట అడగాలి అని అంటాడు. ఏంటి చెప్పండి అని కావ్య అంటుంది. కానీ రాజ్ మెలికలు తిరుగుతూ సిగ్గు పడుతూ.. నువ్వు తిడతావ్ అని అంటాడు. అమ్మో ఏంటి కొంపదీసి ముద్దు అడుగుతారా? ఏంటి అని కావ్య మనసులో అనుకుంటూనే ఏంటండి అని అడుగుతంది. అసలు నువ్వు ఆ రోజు రాత్రి గుడికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు రాజ్. దీనికి కావ్య ఒక్కసారిగా పైకి లేచి ఫైర్ అవుతుంది.
కనకం చీరల్ని చింపేసిన రుద్రాణి:
ఇక ఆ తర్వాత రుద్రాణి చీరలు కనకం కప్పుకుని పడుకుందని.. కట్ చేస్తుంది రుద్రాణి. ఇది గమనించని కనకం.. స్నానం చేయడానికి వచ్చి బట్టలు తీసుకోగా.. అవి చిరిగి ఉంటాయి. ఇదేంటి చీరలన్నీ చిరిగి పోయాయి. అని అంటుంది. ఎలుక కుట్టేసింది కనకం అని రుద్రాణి చెబుతుంది. ఇదంతా రుద్రాణి పని అని గమనించిన కనకం.. ఎలుకని తిట్టినట్టు తిడుతూ రుద్రాణిని తిడుతుంది.