
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో మైఖేల్ ఇచ్చిన షాక్ లో ఉంటాడు రాహుల్. ఏం చేయాలా అని ఆలోచిస్తూంటాడు. ఈలోపు లాయర్ కి కాల్ చేసి మైఖేల్ ని బెయిల్ పై విడిపించాలని చెప్తాడు. డబ్బును ఎలాగైనా ఏర్పాటు చేస్తాను.. ముందు ఆ పనిలో ఉండాలంటూ చెప్తాడు. ఇక డబ్బును ఎలా సర్దు బాటు చేయాలా అని ఆలోచనలో పడతాడు. దీంతో ఇంట్లో ఉన్న నగల్లో కొన్నింటిని తీసుకుని బ్యాగ్ లో వేసుకుని వెళ్తాడు. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్ లో కూర్చుంటారు. కావ్య వంట పనులు చూసుకుంటూ ఉంటుంది. రాజ్ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాడు. పై నుంచి వస్తోన్న రాహుల్ బిత్తర చూపులు చూస్తూ అటూ ఇటూ చూసుకుంటూ భయంతో కిందకు దిగుతాడు. ఇది గమనించిన రాజ్.. రాహుల్ ఆ బ్యాగ్ లో ఏముంది అని అడుగుతాడు. రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉంటాడు. రుద్రాణి కూడా ఏం అర్థం కానట్టు చూస్తూ ఉండిపోతుంది.
ఈ లోపు ప్రకాష్.. కొత్త డిజైన్స్ అయ్యి ఉంటాయి.. అని అంటాడు. దానికి రాహుల్ హా.. అవును అని అంటాడు. దీంతో ప్రకాష్.. ఏది ఒకసారి నాకు చూపించని ఆ బ్యాగ్ లాక్కుంటూ.. ఉంటాడు. రాహుల్ ఏమో వెనక్కి లాక్కుంటాడు. ఈ మధ్యలో బ్యాగ్ లో నుంచి నగలన్నీ కింద పడిపోతాయి. ఇవి చూసిన ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాహుల్ బిత్తర చూపులు చూస్తూ.. ఏం చెప్పాలో అర్థం కాక అలా నుంచొని ఉంటాడు. ఈ లోపు పై నుంచి రాజ్ దిగి వచ్చి.. ఏంటి రా? ఇవి.. ఎక్కడికి తీసుకెళ్తున్నావ్? ఏం చేయడానికి తీసుకెళ్తున్నావ్? అని ప్రశ్నిస్తాడు. రుద్రాణికి కూడా అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. అంటే రాహుల్ ప్లాన్ బహుశా రుద్రాణికి తెలియక పోవచ్చు. మరి రాహుల్ ఏం చెప్పి తప్పించుకుంటాడు. ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో..
రాహుల్ కి ఉదయాన్నే ఫోన్ చేసి షాక్ ఇస్తాడు మైఖేల్. నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏం చేయాలో అదే చేస్తా అంటూ బెదిరిస్తాడు. మైఖేల్ మాటలు విన్న రాహుల్.. మాట్లాడుకుంటూ కిందకు వెళ్తాడు. ఆ వెనకాలే స్వప్న కూడా వస్తుంది. ఏంటి రాహుల్ ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదని చెప్పి తప్పించుకుంటాడు. ఆ వెంటనే లాయర్ కి కాల్ చేసి మైఖేల్ కి బెయిల్ అరేంజే చేయమని.. ఈ రోజు సాయంత్రం వరకు డబ్బు మీ చేతికి అందుతుందని చెప్తాడు. ఓకే అని లాయర్ ఫోన్ పెట్టేస్తాడు.
కళ్యాణ్ కాల్ కట్ చేస్తున్న అప్పు.. ఇంటికి వచ్చేసిన కళ్యాణ్:
ఆ తర్వాత అప్పూకి కళ్యాణ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా కట్ చేస్తుంది. ఫోన్ రింగ్ రావడం.. అప్పు కట్ చేయడం.. ఇది చూసిన కృష్ణ మూర్తి ఎవరమ్మా కాల్ కట్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఏమీ లేదు నాన్న రాంగ్ నెంబర్ అని చెప్తుంది. అప్పుడే కళ్యాణ్ కూడా వస్తాడు. రాంగ్ నెంబర్ కాదు.. రైట్ నెంబరే అని చెప్తూ కళ్యాణ్ వస్తాడు. ఏమైందో ఏంటో అంకుల్ ఈ మధ్య నాతో అప్పు సరిగ్గా మాట్లాడటం లేదు.. కాల్ చేసినా కట్ చేస్తుంది.. అని కంప్లైంట్ ఇస్తాడు. నువ్వేమైనా చిన్న పిల్లోడివా కంప్లైంట్ చేస్తున్నావ్ అని అప్పు ఫైర్ అవుతుంది. అదంతా కాదు ఇప్పుడు సంగతేంటి? ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది అప్పు.
దొరికిపోయిన కావ్య, రాజ్ లు.. ఆట పట్టించిన దుగ్గిరాల ఫ్యామిలీ:
సరే మీ అమ్మగారు బట్టలు తీసుకు రమ్మన్నారని చెప్తాడు. ఇదిగో ప్యాక్ చేశా.. తీసుకెళ్లు అని చెప్తుంది అప్పు. సరే నువ్వు కూడా రా అని పిలుస్తాడు కళ్యాణ్. లేదు నేను రానని.. కనకానికి ఫోన్ చేయబోతుంది అప్పు. అమ్మకి ఫోన్ ఎందుకు లేమ్మా వెళ్లు.. బాబు పిలుస్తున్నాడు కదా అని కృష్ణ మూర్తి చెప్పగా బయలు దేరుతుంది అప్పు. ఇక ఆ తర్వాత కావ్య ఏంటి? ఇంకా లేవలేదా.. టీ పెట్టలేదా? అని ఇందిరా దేవి అనగా.. మీరు బాగా గారాబం చేసి చెడగొట్టారు. అందుకే భయం లేకుండా ఉంటుంది అని అపర్ణ దేవి అనగా.. ఒక్క రోజు టీ పెట్టకపోతే అన్ని మాటలు అనాలా.. ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎవరో ఒక్కరు పెట్టొచ్చుగా అని సుభాష్ అంటాడు. ఈ లోపు కావ్య, రాజ్ లు వస్తారు. అదేంటి మీరు ఇప్పటిదాకా నిద్ర పోతున్నారు అనుకున్నాం. బయట నుంచి వచ్చారా అని ఇంట్లోని వాళ్లందరూ అడుగుతారు. ఏమీ లేదని సిగ్గు పడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది కావ్య. ఇక రాజ్ కూడా ఎలాగోలా తప్పించుకుంటాడు.