Brahmamudi, August 28th episode: రాజ్ చేత భార్య అనిపించుకున్న కావ్య.. ఆనందంతో గంతులే గంతులు!!

|

Aug 28, 2023 | 2:59 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కంగారు టీ పెట్టి తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతుంది. కానీ ఎవరూ తీసుకోరు. ఆ తర్వాత అపర్ణకు టీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. వెంటనే అపర్ణ.. ధాన్యలక్ష్మి ఈ రోజు నుంచి మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని చెప్పాను కదా.. ఇలా అడ్డమైన వాళ్లందరూ వచ్చి నాకు టీ ఇస్తే తీసుకోవాలా.. అంటూ సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంటే ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నారన్నమాట అని కావ్య ఫీల్ అవుతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ బైక్ ను వేలం పాట పెడుతుంది. దీంతో జనాలందరూ ఎగబడతారు. పాట పాడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వచ్చి..

Brahmamudi, August 28th episode: రాజ్ చేత భార్య అనిపించుకున్న కావ్య.. ఆనందంతో గంతులే గంతులు!!
Brahmamudi
Follow us on

బ్రహ్మముడి ఎపిసోడ్ రోజు రోజుకూ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతున్నారు. హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎప్పుడు వస్తుందా.. అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. తాజాగా ఇవాళ్లి బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ బట్టలను కావ్య ఐరన్ చేస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి.. నా బట్టలు ఎందుకు తీశావు? ఎందుకు ఐరన్ చేస్తున్నావు? అంటూ సీరియస్ అవుతాడు. దీంతో కావ్య కళాపతి బట్టలు కళావతి ఇస్త్రీ చేస్తే తప్పేంటి? అని అంటుంది. ఏయ్ ఈ కళాపతి అనే పేరు పలకడం ఆపవా.. నాకు ఓ పేరు ఉంది అంటాడు. మీరు కూడా నన్ను కళావతి అనడం మారారా? నాక్కూడా పేరు ఉంది కదా.. ఆ పేరు పెట్టి పిలవడం అంటూ కావాలని ఆట పట్టిస్తుంది. దీంతో రాజ్ ఉడుక్కుని నేను ఎప్పటికీ నీ పేరుతో నిన్ను పిలవను అని చెప్తాడు. సేమ్ టూ సేమ్ అని ఆన్సర్ ఇస్తుంది కావ్య. ఏయ్ ఏంటో నాతో నీకు పోటీ.. నేను నీ భర్తను అని అంటాడు రాజ్. ఈ మాట విని కావ్య ఎంతో సంతోష పడుతుంది.

బ్రహ్మముడి కిందటి ఎపిసోడ్ లో..

ఇవి కూడా చదవండి

కావ్య కంగారుగా టీ పెట్టి తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతుంది. కానీ ఎవరూ తీసుకోరు. ఆ తర్వాత అపర్ణకు టీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. వెంటనే అపర్ణ.. ధాన్యలక్ష్మి ఈ రోజు నుంచి మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని చెప్పాను కదా.. ఇలా అడ్డమైన వాళ్లందరూ వచ్చి నాకు టీ ఇస్తే తీసుకోవాలా.. అంటూ సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంటే ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నారన్నమాట అని కావ్య ఫీల్ అవుతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ బైక్ ను వేలం పాట పెడుతుంది. దీంతో జనాలందరూ ఎగబడతారు. పాట పాడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వచ్చి.. ఏంటి ఇక్కడ ఇంత మంది జనం ఉన్నారు.. అనుకుంటూ ఆటో నుంచి దిగి వస్తాడు.. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అప్పూని అడుగుతాడు. కళ్లు కనిపిస్తలే.. వేలం పాట పెట్టినా.. అని సమాధానం ఇస్తుంది. అది నా బైక్ కదా అంటాడు కళ్యాణ్.. ఆ ముక్క నన్ను ఇక్కడ వదిలి వెళ్లక ముందు ఆలోచించాలి అని అంటుంది అప్పు. సారీ బ్రో కంగారులో అలా వదిలేసాను అని కళ్యాణ్.. అప్పుకి సారీ చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జనాన్ని పంపించేస్తాడు. సర్ సర్లే మీ సువర్ణ సుందరి కథ ఏమైందని అప్పు అడుగుతుంది. ఆమె సువర్ణ సుందరి కాదు.. మరొకరి సుందరి అట అని చెప్తాడు కళ్యాణ్.. ఆ అదేంటి? అని అప్పు అడగ్గా.. అవును బ్రో ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయ్యిందంట అని కళ్యాణ్ సమాధానం ఇస్తాడు. దీంతో అప్పు నవ్వుతుంది. ఆ తర్వాత కాసేపు కళ్యాణ్ ఆటపట్టిస్తుంది. ఇక ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

అత్తగారు అపర్ణ అన్న మాటలను తలుచుకుని బాధపడుతుంది కావ్య. ధాన్యలక్ష్మీతో మాట్లాడటానికి కావ్య ట్రై చేసినా.. ఆమె మాట్లాడదు. దీంతో అపర్ణ పెట్టిన కండీషన్ పేపర్ మీద రాసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక స్వప్న కంటిన్యూగా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. మళ్లీ కాల్ చేస్తే శిరీష కాల్ లిఫ్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను.. కానీ ఈసారి కూడా సింగిల్ లైనే వచ్చిందని చెప్తుంది స్వప్న. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదని చెప్తుంది శిరీష. అయ్యో ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతుంది స్వప్న. మళ్లీ నువ్వు నీ హస్పెండ్ తో ఇంటిమేట్ అవ్వాలని డాక్టర్ శిరీష చెప్తుంది. కానీ ఇప్పుడు కష్టం ఏం చేయాలి? అని ఆలోచనలో పడుతుంది స్వప్న. ఏదో ఒకటి తిని నా కడుపు పెరిగేలా చేసుకోవాలి అని ఆలోచిస్తుంది.

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యతో మాట్లాడాటానికి వస్తుంది రుద్రాణి. మా అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చారా.. అని కావ్య అడుగుతుంది. నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని చెప్తుంది రుద్రాణి. నాతో ఏం మాట్లాడాలి అని కావ్య అడుగుతుంది. నిన్న చూసి జాలి పడుతున్నా.. నీకు రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఈ ఇంట్లో మా వదినకు అంటే మీ అత్తకి ఎదురు మాట్లాడావు కాబట్టి.. జీవితాంతం ఆవిడ కింద బానిసలా బ్రతకాల్సిందే. లేదంటే మీ పుట్టింటికి వెళ్లి.. ఆ మట్టిని పిసుక్కుంటూ.. తొక్కుకుంటూ మట్టి మనిషిలా బ్రతకాలి. ఇందులో ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది.. చెప్తుంది రుద్రాణి. కానీ కావ్య పట్టించుకోదు.. రుద్రాణికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఆప్షన్ సీ నా ఆయుధం.. నా ఆయుధం పేరు సహనం.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో రుద్రాణి గుర్రుగా చూస్తుంది.

ఇక గదిలోకి వెళ్తుంది కావ్య. అక్కడ రాజ్ డిజైన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఇది చూసిన కావ్య.. ఏంటి పారిశ్రామిక వేత్త.. కళాకారుడు అయ్యాడు.. చిత్రంగా ఉందే.. ఏం గీస్తున్నారు? అంటూ ఆట పట్టిస్తుంది. హో మీకు మీరే డిజైన్స్ గీస్తున్నారా.. మీకు ఈ కళ కూడా తెలుసా.. కళా పతి అని అంటుంది. దీంతో రాజ్.. కావ్యపై సీరియస్ గా చూస్తాడు. మీరు నన్ను కళావతి అంటారు కదా.. కళావతి భర్త కళా పతి అంటే కొంచెం కళగా ఉంటుందని అందుకే అలా అన్నాను అని అంటుంది. దీంతో రాజ్ తల కొట్టుకుంటాడు. మా అత్తగారు మిమ్మల్ని మాట్లాడవద్దని హుకూం ఏమన్నా జారీ చేశారా.. అని అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పడు. కేవలం పేపర్ మీద రాసి గోడ మీద అంటిస్తాడు. కావ్యకి డౌట్ వచ్చి శ్రుతికి కాల్ చేసి.. ఏమైందని అడుగుతుంది. శ్రుతి ఆఫీసులో జరిగినదంతా చెప్తుంది. సరే అని అంటుంది కావ్య. ఆ తర్వాత కడుపు పెంచుకోవడానికి స్వప్న బిర్యానీ ఆర్డర్ పెడుకుంటుంది. అది వచ్చాక.. అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో కిందకు వచ్చి తింటుంది. అది చూసిన ధాన్యలక్ష్మి ఒక్కసారిగా భయపడుతుంది.