Smriti Irani: ‘సెట్‏లోనే అబార్షన్ అయితే అబద్దాలు చెబుతున్నా అన్నారు’.. స్మృతి ఇరానీ కామెంట్స్..

|

Mar 27, 2023 | 9:55 AM

ఆమె నటించిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ అప్పట్లో ప్రేక్షకాదరణ లభించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ నిర్మాత పండిత్ జనార్దన్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది స్మృతి. దీనిని శోభాకపూర్, ఏక్తాకపూర్ బ్యానర్ పై నిర్మించారు.

Smriti Irani: సెట్‏లోనే అబార్షన్ అయితే అబద్దాలు చెబుతున్నా అన్నారు.. స్మృతి ఇరానీ కామెంట్స్..
Smriti Irani
Follow us on

బీజేపీ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సుపరిచితమైన రాజకీయ నాయకురాలు. కానీ పాలిటిక్స్‏లోకి అడుగుపెట్టకముందు ఆమె ఓ నటి అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. వెండితెరపై.. బుల్లితెరపై పలు చిత్రాలు, ధారావాహికలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె నటించిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ అప్పట్లో ప్రేక్షకాదరణ లభించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ నిర్మాత పండిత్ జనార్దన్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది స్మృతి. దీనిని శోభాకపూర్, ఏక్తాకపూర్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా ఈ సీరియల్ నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు స్మృతి. ఈ సీరియల్ సెట్ లో తనకు అబార్షన్ అయ్యిందని.. ఈ విషయాన్ని చెబితే అబద్ధాం చెబుతున్నానని అనుకున్నారని అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

“క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ.. సీరియల్ నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ షూటింగ్ సమయంలో నేను ప్రెగ్నెంట్. కానీ ఆ విషయం నాకు తెలియదు. ఓ రోజు షూట్ చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించింది. ఓపిక లేదని.. ఇంటికి వెళ్లిపోతానని అడిగానూ. కానీ వర్క్ ఎక్కువగా ఉండడం వలన సాయంత్రం వరకు సెట్ లోనే ఉన్నాను. ఆరోజు సాయంత్రం ఆసుపత్రికి వెళ్లగా అబార్షన్ అయినట్లు తెలిసిందే. ఎంతో కుంగుబాటుకు గురయ్యాను. షూట్ నుంచి కాస్త విరామం తీసుకుందామనుకున్నప్పటికీ ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్ కు వెళ్లాను.

ఇవి కూడా చదవండి

నాకసలు అబార్షన్ కాలేదని.. అబద్ధం చెబుతున్నానంటూ ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో నేను చెప్పేది నిజమని నమ్మించడం కోసం రిపోర్ట్స్ తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్ కు చూపించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా సంపాదన రూ. 1800. నా పెళ్లి సమయంలో మా వద్ద రూ. 30 వేలు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి కార్లు, స్కూటర్లు లేవు. ఎక్కడికి ప్రయాణించాలన్నా ఆటోలో వెళ్లేదాన్ని. అది చూసి నా మేకప్ ఆర్టిస్ట్ ఇబ్బందిగా ఫీలయ్యాడు. మేడమ్ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఒక కారు తీసుకోండి అన్నాడు. ” అంటూ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు స్మృతి ఇరానీ. అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తనను ఎంతో బాధించిందని.. మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు స్మృతి. ఎలాంటి కష్టాలు ఎదురైనా యువత తమను తాము చంపుకోవద్దని సూచించారు స్మృతి ఇరానీ.