Subhashree Rayaguru: బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కయిన కారు.. ఆందోళనలో ఫ్యాన్స్

|

Oct 06, 2024 | 4:42 PM

టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఓ షూటింగ్ కోసం వెళ్తున్న ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆదివారం (అక్టోబర్ 06) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Subhashree Rayaguru: బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కయిన కారు.. ఆందోళనలో ఫ్యాన్స్
Subhashree Rayaguru
Follow us on

టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఓ షూటింగ్ కోసం వెళ్తున్న ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆదివారం (అక్టోబర్ 06) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బతింది. అయితే బైక్ మీద ప్రయాణిస్తోన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కాగా శుభశ్రీ కార్ యాక్సిడెంట్ సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే శుభ శ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కారు ప్రొడక్షన్ కంపెనీదే అని, శుభశ్రీ ది కాదని సమాచారం. ఓ సాంగ్ షూటింగ్ నిమిత్తం వెళుతున్నప్పుడు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శుభశ్రీ రాయగురు అలియాస్ సుబ్బు ఒకరు. బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన ఆమె తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. టైటిల్ గెలవకపోయినా తన అందం, క్యూట్ మాటలతో బుల్లితెర అభిమానుల మనసు దోచేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలోనూ కనిపించిందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శుభ శ్రీ. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి వీడియోలతో అభిమానులను అలరించడం మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రమాద స్థలంలో శుభ శ్రీ కారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.