Rakesh-Sujatha: మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. జోడీగా బోలెడు కామెడీ స్కిట్లు చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారీ ట్యాలెంటెడ్ యాక్టర్స్. రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్, సుజాత.
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. జోడీగా బోలెడు కామెడీ స్కిట్లు చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారీ ట్యాలెంటెడ్ యాక్టర్స్. రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్, సుజాత. ఇప్పుడు వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. రాకింగ్ రాకేష్, సుజాత అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. సుజాత పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా వారే అధికారికంగా వెల్లడించారు.
తాము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నామని… సుజాత పండంటి పాపకు జన్మనిచ్చిందని… ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో ఒక అద్భుతం అన్నాడు రాకేశ్. జీవితంలో సగ భాగం అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం.. అంటూ ఎమోషనల్ అయ్యాడు రాకింగ్ రాకేష్.
ప్రస్తుతం రాకింగ్ రాకేష్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా సుజాత కొన్ని రోజుల క్రితమే బిడ్డను ప్రసవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరు అమ్మానాన్నలైనట్లు పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.