Gorre Puranam: OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?

Gorre Puranam: OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే ‘గొర్రె పురాణం’ ఎక్కడంటే.?

Anil kumar poka

|

Updated on: Oct 06, 2024 | 4:44 PM

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు హీరో సుహాస్. ఈ కోవలోనే అతను నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించింది.

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు హీరో సుహాస్. ఈ కోవలోనే అతను నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. అయితే ఇప్పుడీ గొర్రె పురాణం ఓటీటీలోకి వస్తోంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గొర్రె పురాణం సినిమా పోస్టర్ ను విడుదల చేసింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్‌ 6న ఓటీటీలోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. లేదంటే, అక్టోబర్‌ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని టాక్.

ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్‌రెడ్డి గొర్రె పురాణం సినిమాను నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలు సమకూర్చారు. గొర్రె పురాణం టైటిల్‌ కు తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలా నలిగిపోయిందో సినిమాలో చక్కగా చూపించారు మేకర్స్. ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో బక్రీద్‌ పండుగకు రావాల్సిన గొర్రె అక్కడి నుంచి తప్పించుకుని ఓ గుడిలోకి వెళ్లింది. దీంతో హిందువులు గొర్రె తమదని, తామే బలిస్తామని గొడవకు దిగుతారు. మరి ఈ గొర్రె కోసం రెండు వర్గాల మధ్య గొడవలు ఎక్కడికి దారితీశాయి? చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే సుహాస్ గొర్రె పురాణం చూడాల్సిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.