
బిగ్‌బాస్ తెలుగు సీజన్ అఖరి ఘట్టానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేకు చేరువ కావడంతో కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు? రన్నరప్ ఎవరు? టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. టాప్-5 లో ఎవరున్నా టైటిల్ పోరు మాత్రం తనూజ, పవన్ కల్యాణ్ పడాల మధ్యనే సాగుతోంది. విన్నర్, రన్నర్ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కు కూడా కులం, మతం, ప్రాంతీయ రంగు అంటిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కంటెస్టెంట్ల పీ ఆర్ టీమ్సే ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నాయి. తమ కంటెస్టెంట్ పాజిటివ్ విషయాలను హైలెట్ చేయడం బదలు అవతలి కంటెస్టెంట్స్ ను నెగెటివ్ చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల కులం, మతం, ప్రాంతీయ ప్రస్తావనలు తీసుకొస్తున్నారు.
ఉదాహరణకు ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ రేసులో తనూజ ఉంది. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తనూజ అస్సలు బిగ్ బాస్ టైటిల్ గెలవకూడదంటూ కొందరు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ అతని పీఆర్ టీమ్స్, కొందరు నెటిజన్లు అతనిని హీరో చేస్తున్నారు.
తనూజ కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించింది. తన నటనతో అందరికీ చేరువైంది. ఇన్నాళ్లు గుర్తుకు రాని కన్నడ ట్యాగ్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందో తెలియదు. ఇదే పనిగా కొందరు ఆమెపై విషం కక్కుతున్నారు. కల్యాణ్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. అతని వ్యక్తిగత విషయాలను ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీనిపై మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi …🤮🤮
Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga
— Arachakame (@Arachakame) December 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.