Bigg Boss Telugu 9: ఈ విషయంలో మాధురిని మెచ్చుకోవచ్చు.. తన బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌ను ఏం చేయనుందో తెలుసా?

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్ లోకి వెళ్లిన దివ్వెల మాధురి మూడో వారమే ఎలిమినేట్ అయ్యింది. ఆమె హౌస్ నుంచి బయటకు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం మాధురిని మెచ్చుకోవచ్చు.

Bigg Boss Telugu 9: ఈ విషయంలో మాధురిని మెచ్చుకోవచ్చు.. తన బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌ను ఏం చేయనుందో తెలుసా?
Divvala Madhuri

Updated on: Nov 04, 2025 | 10:16 PM

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి దివ్వెల మాధురి బయటకు వచ్చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తొమ్మిదో వారంలో గౌరవ్‌ గుప్తా, దివ్వెల మాధురికి తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే చివరికి మాధురినే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ కు చాలా కారణాలున్నాయి. బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది మాధురి. రీతూ చౌదరి తదితర కంటెస్టెంట్లతో తరచూ గొడవలకు దిగింది. దీంతో నాగార్జున కూడా దివ్వెల మాధురి తీరును తప్పుపట్టాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో మూడు వారాలే ఉన్నప్పటికీ మాధురికి రెమ్యునరేషన్ గట్టిగా అందిందని సమాచారం. సెలబ్రిటీ రేంజ్‌లోనే ఆమె కూడా రెమ్యూనరేషన్‌ తీసుకుందట. రోజుకి రూ.40వేలకుపైగా చొప్పున వారానికి మూడు లక్షల పారితోషికం తీసుకుందట.
అలా మూడు వారాలకు గానూ మాధురికి మొత్తం రూ. 9 లక్షల రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. మిగతా కామనర్స్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే మాధురికి ఈ రేంజ్ పారితోషకం చాలా ఎక్కువని చెప్పవచ్చు.

కాగా గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మాధురికి వచ్చే బిగ్‌ బాస్‌ పారితోషికాన్ని ఏం చేయనున్నారన్న ప్రశ్నకు శ్రీనివాస్ ఆసక్తికర సమాధానమిచ్చారు. వెల్లడించారు. ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్‌ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ హౌస్ లో దివ్వెల మాధురి

‘మాకు దేవుడు ఇచ్చింది చాలు. ఇంకా అవసరం లేదు. మాధురి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ను దివ్యాంగుల సంక్షేమం కోసం వినియోగిస్తాం. క్యాన్సర్ తో బాధపడుతోన్న పేదలకు ఖర్చు చేస్తాం. నేను రెగ్యులర్ గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇక మాధురికి బిగ్ బాస్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాం’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పాతవే అయినప్పటికీ మాధురి ఎలిమినేషన్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వైరలవుతున్నాయి. మాధురి, శ్రీనివాస్ లపై ఎంత నెగెటివిటీ ఉన్నా ఈ విషయంలో మాత్రం వారిని మెచ్చుకోవచ్చంటున్నారు నెటిజన్లు.

దివ్వెల మాధురి గురించి దువ్వాడ శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.