
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 8 వారంలోకి చేరుకుంది. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా 9 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ కోసం గట్టిగా పోరాడుతోన్న కంటెస్టెంట్లకు బయటి నుంచి కూడా చాలా మద్దతు లభిస్తోంది. సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టమైన కంటెస్టెంట్లకు సపోర్టుగా నిలుస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ నటి కస్తూరి శంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తమిళ్ బిగ్ బాస్ లో సందడి చేసిన ఈ అందాల తార ఓ కంటెస్టెంట్ ను ఆకాశానెత్తికేసింది. ‘నేను పెద్దగా బిగ్ బాస్ చూడను. గతంలో తమిళ్ బిగ్ బాస్ ఓ సెలబ్రిటీ వీక్ కింద ఒక వారం ఉండి వచ్చాను అంతే. అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ నాయర్ ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు ఈ రియాలిటీ షో చూస్తున్నాను. ఈసారి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ నాయర్. వైల్డ్ కార్డు ద్వారా అతను ఎంట్రీ ఇచ్చాడు. అతనికి అన్ని సాధ్యమే. బాగా ఆడతాడు, కప్పు కూడా గెలుస్తాడు. గృహలక్ష్మి సీరియల్ లో అతను నా కొడుకు. అతని గురించి నాకు బాగా తెలుసు’ అని చెప్పుకొచ్చాడు.
కస్తూరి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కస్తూరి చెప్పినట్లుగా బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఆక్టటుకోవడం లేదు నిఖిల్ నాయర్. జస్ట్ ఫిజికల్ టాస్కుల్లో మాత్రమే సత్తా చాటున్నాడు. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడంతో నిఖిల్ బాగా వెనకపడ్డాడు.
మళయాళంకు చెందిన నిఖిల్ నాయర్ అక్కడ సీరియల్స్ లో నటిస్తూనే తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. పలుకే బంగారమాయెనా, గృహలక్ష్మి వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ భాగమయ్యాడు. తన నటనతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. మరి కస్తూరి చెప్పినట్లు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటుతాడేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.