
బిగ్‌బాస్ హౌస్ ఎనిమిదో వారం నామినేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అంతేకాదు నామినేషన్స్ పవర్ కూడా మాజీ కంటెస్టెంట్ల చేతికే అప్పగించాడు. ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాషైనీ, దమ్ము శ్రీజ హౌస్‌లోకి వచ్చి నామినేషన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి వచ్చిన వారికి రెండు కత్తులు ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో ఒక కత్తిని ఉపయోగించి హౌస్ మేట్స్ లో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలి. ఇంకొక కత్తి హౌస్‌మేట్స్‌లో ఎవరికైనా ఇవ్వాలి. వాళ్లు ఇంకొకరిని నామినేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ కెప్టెన కనక ఈ వారం నామినేషన్స్ లోకి రాలేదు. అలాగే ఈ ప్రక్రియ మొదలయ్యే ముందే సాయి శ్రీనివాస్ తనకి వచ్చిన ఇమ్యూనిటీ పవర్‌ని ముందుగానే ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఎవరూ వీరిని నామినేట్ చేయలేకపోయారు. ఈ నామినేషన్స్‌లో ముందుగా ప్రియ వచ్చి సంజనని డైరెక్టుగా నామినేట్ చేసింది. ఆ వెంటనే కళ్యాణ్ చేతికి కత్తి ఇచ్చింది. కళ్యాణ్.. రాముని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఫ్లోరా డైరెక్ట్‌గా రీతూని నామినేట్ చేసి మరో కత్తి సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ఏమో సంజనని నామినేట్ చేశాడు.
ఇక మనీష్ డైరెక్ట్‌గా కళ్యాణ్‌ని డైరెక్టుగా నామినేట్ చేశాడు. ఆ తర్వాత కత్తి ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చాడు మనీష్. ఇమ్మూ ఏమో తనూజని నామినేట్ చేశాడు. చివరిగా దమ్ము శ్రీజ వచ్చి డైరెక్ట్‌గా కళ్యాణ్‌ని నామినేట్ చేసి షాకిచ్చింది. ఇలా ఈ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి ఎనిమిదో వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి ఈ లిస్ట్ లో నిలిచారు. వీరిలో అందరికి ఎంతో కొంత బయట ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గౌరవ్, మాధురీలకు మాత్రం అంతగా ఆదరణ లేదు. మరి ఈ వారంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి.
The calm is over! Nominations battle erupts inside the house! 💣🔥👁
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/rnEReGWiG3
— Starmaa (@StarMaa) October 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.