Bigg Boss 8: హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్.. టైటిల్ పోరులో మిగిలింది వీరే..

|

Dec 08, 2024 | 10:57 PM

Bigg Boss 8 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 క్లైమాక్స్‌కి చేరింది. ఈ వారం కూడా డబుల్‌ ఎలిమినేషన్‌ జరగ్గా.. హౌస్‌లో ఐదుగురు ఫైనలిస్ట్‌లు మాత్రమే మిగిలారు. శనివారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆదివారంనాడు మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 8: హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్.. టైటిల్ పోరులో మిగిలింది వీరే..
Vishnu Priya Eliminated From Bigg Boss 8
Follow us on

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 తుది అంకానికి చేరింది. ఈ వారం కూడా డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. శనివారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం తెలిసిందే. కాగా ఆదివారంనాడు మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది. డబుల్ ఎలిమినేష న్ ప్రక్రియ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

సీజన్ టాప్-5 ఫైనలిస్ట్‌లు వీరే..

డబుల్ ఎలిమినేషన్‌తో రోహిణి, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్‌ను వీడారు. దీంతో ఈ సీజన్‌ టాప్-5లో నబీల్‌, నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌లు నిలిచారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ పోరులో నిలిచిన ఈ ఐదుగురు ఫైనలిస్ట్స్ ‌లో ఈ సీజన్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠరేపుతోంది.

విష్ణుప్రియ ఫ్యాన్స్‌కు నిరాశ

విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఆమె ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. టాప్-5లో చోటు పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు విష్ణు ప్రియకు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెం‌ట్స్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచి 98వ రోజు వరకు హౌస్‌లో జెన్యూన్‌గా ఉన్నది ఆమె ఒక్కరేనంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం పట్ల షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. బిగ్ బాస్‌లో టైటిల్ గెలిచిన తొలి మహిళగా విష్ణుప్రియ నిలుస్తుందని ఆశించినట్లు కామెంట్స్ చేశారు. విష్ణు ప్రియను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ మరికొందరు ఫ్యాన్స్ మండిపడ్డారు.