AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: ఏం ట్విస్ట్ ఇచ్చారయ్యా.. బిగ్‏బాస్ 10లోకి మీనా, బాలు.. ఫ్యాన్స్ షాక్..

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ చేసిన ఈ షో ఇప్పుడు బుల్లితెరపై విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు హౌస్ లో ఆట మొదలైనట్టే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం విడుదలైన ప్రోమోలో ఫస్ట్ డే విభేదాలు, గొడవలు అయినట్లు తెలుస్తోంది.

Bigg Boss 10 Telugu: ఏం ట్విస్ట్ ఇచ్చారయ్యా.. బిగ్‏బాస్ 10లోకి మీనా, బాలు.. ఫ్యాన్స్ షాక్..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 4:54 PM

Share

బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడే అని అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈషో ఇప్పుడు ఎట్టకేలకు స్మాల్ స్క్రీన్ పై ప్రసారమవుతుంది. ఇక ఈరోజు ఉదయం విడుదలైన ప్రోమో చూస్తుంటే మొదటి రోజే హౌస్ లో గొడవలు, విభేదాలు మొదలైనట్లు కనిపిస్తుంది. సోమవారం రాత్రి ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కీల విషయంలో ముఖేష్, రాం ప్రసాద్, త్రిగుణ్ ముగ్గురు వాదించుకుంటున్నట్లు కనిపించింది. ఇదెలా ఉంటే తాజాగా మరో ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. అందులో ప్రేక్షకులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ అడియన్స్ ఫేవరేట్ జోడి మీనా, బాలు అనుహ్యంగా హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా కొత్తదనంతో ఆకట్టుకునే ఈ షో, ఈసారి కూడా సరికొత్త థీమ్, అద్భుతమైన హౌస్ డిజైన్‌తో ప్రేక్షకు ముందుకు వస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక హౌస్ టూర్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఈసారి బిగ్ బాస్ నివాసాన్ని పరిచయం చేయడానికి పాపులర్ సీరియల్ ‘గుండెనిండా గుడిగంటలు’ నటీనటులు ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వారు ప్రతి మూలన తిరుగుతూ బిగ్ బాస్ హౌస్ విశేషాలను ప్రేక్షకులకు వివరించారు. ప్రతిభావవంతమైన ఆర్కిటెక్చర్‌తో తీర్చిదిద్దిన లివింగ్ రూమ్, రంగురంగుల ఇంటీరియర్స్‌తో ఉన్న బెడ్‌రూమ్‌లు, విశాలమైన కిచెన్ ఏరియా మరియు గార్డెన్ స్పేస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి మూలకూ ఒక ప్రత్యేకత ఉండేలా, నామినేషన్లు , టాస్క్‌ల సమయంలో వేడి పెంచేలా ఈసారి హౌస్ రూపురేఖలను రూపొందించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లోని సీక్రెట్ కన్ఫెషన్ రూమ్ , గార్డెన్ ఏరియాలోని స్విమ్మింగ్ పూల్ ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ఈ ప్రోమో కేవలం ఇంటి అందాలను చూపించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఇంట్లో జరగబోయే మైండ్ గేమ్స్, వాగ్వాదాలు, ఎలిమినేషన్లు , ఉత్కంఠభరితమైన పోరాటాలకు సంబంధించి ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చింది. బయటకు ఎంత లగ్జరీగా కనిపించినా, లోపల ఉండే కంటెస్టెంట్లకు ఇది అసలైన పరీక్ష అని మరోసారి నిరూపితమవుతోంది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

బిగ్ బాస్ ప్రోమో..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us