Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీరేనా? కాంట్రవర్సీ పర్సన్స్ చాలా ఉన్నారుగా..
బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సందడికి రంగం సిద్ధమైంది. ఇటీవలే షోకు సంబంధించి అధికారికంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ సారి బిగ్ బాస్ దశావతారం చూడబోతున్నారని హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వివాదాలు, గొడవలు ఉన్నప్పటికీ బుల్లితెరపై టాప్ షోగా చెలామని అవుతోంది. ఇక తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు పదో సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. గత సీజన్ల కంటే ఈసారి కాస్త ముందుగానే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అందుకోసమే ఇటీవల ప్రోమోను కూడా రిలీజ్ చేశారని టాక్. అంతేకాదు తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభమై పదేళ్లు కావడంతో ఈ సీజన్ లో చాలా స్పెషాలిటీస్ ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కు బిగ్ బాస్ హౌస్ లో స్థానం కల్పించనున్నారు. ఇందుకోసం త్వరలోనే అగ్నిపరీక్ష సీజన్ 2 ను ప్రారంభించనున్నారని టాక్. శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్ జడ్జీలుగా ఉండనున్నారని, ఈసారి ఐదుగురు సామాన్యులను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా పంపించనున్నారట. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొనడం ఎలా? నిబంధనలు ఏంటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర వంటి వివరాలను త్వరలోనే బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే పదవ సీజన్‌లో బిగ్ బాస్ షోకి సెలబ్రిటీ విభాగంలో ఎవరు కంటెంస్టెంట్లుగా రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కాగా సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉండి, జనానికి బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీలు, అందులోనూ వివాదాస్పద వ్యక్తులను కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం.. బుల్లితెర నటి పల్లవి గౌడ, జబర్దస్త్ నుంచి ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, ఈటీవీ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు హీరో చంద్రహాస్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇప్పటికే కొందరికి బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్స్ వచ్చాయని, కొందరు ట్రై చేస్తున్నారని సమాచారం. మరి పై లిస్టులో ఉన్న వారిలో ఎంత మంది బిగ్ బాస్ హౌస్ కు వస్తారో చూడాలి. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.
బిగ్ బాస్ 10 సీజన్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




