Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది.. ఈసారి మరింత కిక్కిచ్చేలా.. బజ్ హోస్ట్ ఎవరంటే..

బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటికే తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ షో 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఈసారి సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు. అలాగే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరలవుతుంది.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది.. ఈసారి మరింత కిక్కిచ్చేలా.. బజ్ హోస్ట్ ఎవరంటే..
Bigg Boss 9 Telugu

Updated on: Jun 27, 2025 | 9:50 AM

బుల్లితెర అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ పూర్తికగా..ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ షో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ, టీవీ కళాకారులు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల వివాదాలతో ఫేమస్ అయిన సోషల్ మీడియా తారలను సైతం తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా బిగ్‏బాస్ సీజన్ 9 లోగోను లాంచ్ చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి.. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్స్ ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచేసాయి.

ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయనున్నారని ప్రోమోతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్నవారిలో చాలా మంది బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అలాగే ఈ వారం స్టార్ట్ కాబోతున్న కూకు విత్ జాతిరత్నాలు కామెడీ షోలోని పలువురు కంటెస్టెంట్స్ సైతం పార్టిసిపేట్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ షోకు నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. బజ్ షోకు గత సీజన్ కంటెస్టెంట్ ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో బిగ్‏బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. ఇప్పటికే బమ్ చిక్ బబ్లూను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్యను సైతం బీబీ టీమ్ అప్రోచ్ అయినట్లు టాక్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..