Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ స్టార్ట్ అయ్యేది ఆరోజే.. ప్రోమోతో అనౌన్స్ చేసిన నాగార్జున..

సీరియల్ నటీనటులు, టాలీవుడ్ హీరోహీరోయిన్స్, ఇన్ స్టా స్టార్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ షో ఎప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలా మంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలలో అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? టైమింగ్ ఏంటీ ? అనే విషయాలను వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు బిగ్‏బాస్ రియాల్టీ షో లాంఛింగ్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేశారు.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ స్టార్ట్ అయ్యేది ఆరోజే.. ప్రోమోతో అనౌన్స్ చేసిన నాగార్జున..
Bigg Boss Telugu season 8
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2024 | 2:16 PM

ఎప్పుడెప్పుడా అని బుల్లితెర అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ రియాల్టీ షో అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రోమోలతో క్యూరియాసిటిని పెంచేస్తోన్న మేకర్స్.. ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8కు సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఈషోలోకి ఎంటరయ్యే కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సీరియల్ నటీనటులు, టాలీవుడ్ హీరోహీరోయిన్స్, ఇన్ స్టా స్టార్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ షో ఎప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలా మంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలలో అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? టైమింగ్ ఏంటీ ? అనే విషయాలను వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు బిగ్‏బాస్ రియాల్టీ షో లాంఛింగ్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ షోను సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకు బిగ్‏బాస్ అసలు ఆట మొదలుకాబోతుందని చెబుతూ అఫీషియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. 1.40 నిమిషాల నిడివితో ప్రోమో రిలీజ్ చేయగా.. “ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు” అంటూ పాత ప్రోమో డైలాగ్స్ రిపీట్ చేశారు నాగార్జున. పాత్ర ప్రోమోకు షో లాంఛింగ్ డేట్ అండ్ టైమ్ యాడ్ చేశారు. నిజానికి ఈ షో సెప్టెంబర్ 8న లేదా సెప్టెంబర్ 7న వినాయక చవితి పండగ రోజున లాంఛ్ చేయనున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అడియన్స్ ఊహించని విధంగా ఈ షోను లాంఛ్ చేస్తున్నారు.

అయితే ఈసారి షోలోకి ఎవరెవరు ఎంటర్ కానున్నారనే ఆసక్తి మాత్రం ప్రేక్షకులలో నెలకొంది. యూట్యూబ్ స్టార్స్, సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండనున్నారని తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లుగా నిత్యం నెట్టింట పాపులర్ అయిన వారిని కూడా ఈసారి షోలోకి తీసుకువస్తున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈసారి కూడా 24 అవర్స్ లైవ్ ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.