బిగ్ బాస్ గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఇక వారం వారం తగ్గిపోతున్న బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ చూస్తే ఈ సీజన్ అట్టర్ ప్లాప్ అనేది అర్థమవుతుంది (Bigg Boss 6 Telugu). ఆట ఆడకుండా ఎంజాయ్ చేస్తున్న కంటెస్టెంట్లకు ప్రత్యేకంగా నాగార్జున క్లాస్ తీసుకుంటున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రావడం లేదనే చెప్పుకొవాలి. ఇక ఈవారం సైతం మరోసారి గేమ్ పై ఫోకస్ చేయనివారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి ఆట తగ్గించిన మరికొందరిని కూడా అదే బ్యాచ్లో కలిపేశారు. ఆట ఇంకా మొదలు పెట్టలేదని గత వారం తొమ్మిది మందిని సోఫా వెనక నిల్చోబెట్టిన సంగతి తెలిసిందే. అందులో అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ కాగా.. ఈవారం మిగిలిన ఏడుగురిని సోఫా వెనక నిల్చోబెట్టారు. వారిలో శ్రీహాన్, శ్రీసత్య ఇద్దరు ఈవారం చాలా బాగా ఆట ఆడారని వారిద్దని ప్రశంసించి సోఫాలో కూర్చోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత బాలాదిత్య ఆట తీరు.. ప్రవర్తన గురించి సీరియస్ అయ్యారు నాగ్. ముఖ్యంగా వీడియో చూపించి మరీ టార్గె్ట్ చేశారు.
ఆ తర్వాత వాసంతి, కీర్తి భట్, మెరీనా రోహిత్, సుదీప ఆట తీరు..ప్రవర్తన బాలేదంటూ చెప్పుకొచ్చారు. వీళ్లు మాత్రమే కాకుండా.. చంటి, రాజ్, అర్జున్ కళ్యాణ్ ఈవారం సరిగ్గా ఆట ఆడలేదని వారిద్దరి కూడా సోఫా వెనకాల నిల్చోబెట్టారు. అనంతరం.. ఇనయ, శ్రీహాన్ మధ్య జరిగిన గొడవ.. రేవంత్ లాగిపెట్టి కొడతాను అనడం.. గీతూ దొబ్బెయ్ అంటూ మాట్లాడిన తీరుపై నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఆట తీరు బాగున్నా.. మాట్లాడే విధానం సరిగ్గా లేదని.. ఇకపై అలా మాట్లాడితే ఊరుకోనంటూ ఫైర్ అయ్యారు. అనంతరం.. సోఫా వెనక నిల్చున్న 8 మందిలో హోస్ట్ నాగార్జున మొదటి సారి నేరుగా నామినేట్ చేశారు. బిగ్ బాస్ చరిత్రలోనే హోస్ట్ నామినేట్ చేయడం తొలిసారి అంటూ చెబుతూ.. హౌస్ మేట్స్ ఓట్లతో ఇద్దరిని నామినేట్ చేశారు. అందులో అర్జున్ కళ్యాణ్, కీర్తికి ఎక్కువ ఓట్లు రాగా.. వీరిద్దరిని నేరుగా నామినేట్ చేశారు నాగార్జున.