Bigg Boss: ఇదేం ట్విస్ట్! ఈసారి బిగ్ బాస్ 100 రోజులు కాదట! ఏకంగా అన్ని నెలలా?

మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ తదితర భాషల్లోనూ ఈ రియాలిటీ షో షురూ కానుంది. అయితే ఈసారి బిగ్ బాస్ షోను వంద రోజులు కాకుండా ఐదు నెలలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss: ఇదేం ట్విస్ట్! ఈసారి బిగ్ బాస్ 100 రోజులు కాదట! ఏకంగా అన్ని నెలలా?
Bigg Boss New Season

Updated on: May 25, 2025 | 4:55 PM

సాధారణంగా ఏ భాషలో నైనా బిగ్ బాస్ షో మూడు నెలలు (100 రోజులు) నడుస్తుంది. మన దేశంలో బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇలాగే కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు, TRP బాగున్నప్పుడు కొన్ని రోజులు లేదా వారాల పాటు బిగ్ బాస్ షోను పొడిగిస్తారు. అయితే ఇప్పుడీ రియాలిటీ షోను ఏకంగా ఐదు నెలలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే సాధారణంగా 100 రోజుల పాటు హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఇప్పుడు ఏకంగా 170 రోజుల పాటు ఉండాలన్నమాట. ఇందు కోసం కంటెస్టెంట్స్ మానసికంగా సిద్ధమై ఉండాలి. బిగ్ బాస్ ఇంట్లో మూడు నెలలు ఉండడమే ఎంతో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అలాంటిది ఏకంగా ఐదున్నర నెలలు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే మామూలు విషయం కాదు. ఒక వేళ ఇదే జరిగితే కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, 170 రోజుల విషయానికి వస్తే, పోటీదారుల సంఖ్య, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

బిగ్ బాస్ విషయానికి వస్తే చాలా గొడవలు జరుగుతాయి. ఇక కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరిగితే వివాదాలు, గొడవలు కూడా పెరగవచ్చు. మరి 170 రోజుల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉండటానికి కంటెస్టెంట్స్ ఎలా సిద్ధమవుతారో చూడాలి. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురించి కాదు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ గురించి. కొన్ని నివేదికల ప్రకారం బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో జూలై 30 నుండి ప్రారంభమవుతుంది. అలాగే జనవరి చివరి వరకు ఈ రియాలిటీ షో కొనసాగనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

గత సీజన్ల లాగే ఈసారి కూడా సల్మాన్ ఖానే బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్‌లో అతనికి మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ లభించనుందని తెలుస్తోంది. ఎందుకంటే సల్మాన్ ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్‌మెంట్లు ఇచ్చాడు. వీటన్నిటి మధ్యలో అతను బిగ్ బాస్ హోస్ట్ చేయాల్సి ఉంది.

సల్మాన్ ఖానే బిగ్ బాస్ హోస్ట్ .. కానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి