Bigg Boss 9 Telugu : ఇమ్మూను అడ్డంగా ఇరికించిన నాగ్.. తనూజ ముందు నిజం బట్టబయలు.. వీడియో చూపించి మరీ క్లారిటీ..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఏడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. అంతకుముందు శనివారం ఎపిసోడ్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ కు ఇచ్చిపడేశాడు హోస్ట్ నాగార్జున. ఇప్పటికే పాజిటివ్ ఓటింగ్ ఉన్న ఇమ్మూకు ఇచ్చిపడేశాడు. నిన్నటి ఎపిసోడ్ లో రావడంతోనే మరోసారి కెప్టెన్ అయినందుకు ఇమ్మూను కంగ్రాట్యులేట్ చేశారు నాగ్.

Bigg Boss 9 Telugu : ఇమ్మూను అడ్డంగా ఇరికించిన నాగ్.. తనూజ ముందు నిజం బట్టబయలు.. వీడియో చూపించి మరీ క్లారిటీ..
Bigg Boss 9 Telugu (1)

Updated on: Oct 26, 2025 | 7:56 AM

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా నాగ్ కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత హౌస్మేట్స్ ముందు కొన్ని ట్యాగ్స్ బోర్డ్ పెట్టి.. అందులో ఒక్కో ట్యాగ్ ఎవరికీ సెట్ అవుతుందో వారికి ఇవ్వాలని అన్నారు. ముందుగా రమ్య ఫేక్ బాండ్స్ అనే బోర్డు మాధురి మెడలో వేసి.. మొదట్లో ఆవిడ బాండ్స్ పెట్టుకుని అని చెప్పింది. ఇప్పుడు మళ్లీ బాండ్స్ కే వెళ్తున్నట్లు అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మాధురి మాట్లాడుతూ.. నేను అందరితో సమానంగా ఉంటున్నాను.. ఆమె అలా ఫీల్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఇక తర్వాత కళ్యాణ్ ను ఒక ప్రశ్న అడిగారు. ఇమ్మాన్యుయేల్ తో నువ్వు మాట్లాడినప్పుడు ఎవరిని నామినేట్ చేస్తానని అన్నావ్ అని అడగ్గా.. తనూజ సార్ అని చెప్పాడు కళ్యామ్. మరెందుకు చేయలేదు అని అడగ్గా.. నేను అనుకున్న పాయింట్స్ తో తనూజను రమ్య నామినేట్ చేసింది.. అందుకే చేయలేదని అని అన్నాడు. ఇమ్మాన్యుయేల్ నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీలయ్యావా అని అడిగారు నాగ్. నాకు చెప్పి ..అవతలి వ్యక్తిని నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా అని అర్థం కాలేదు సార్. అందుకే కళ్యాణ్ తనని నామినేట్ చేద్ధామనుకున్న పాయింట్ తనూజకు తెలియాలనే అలా చేశానని అన్నాడు ఇమ్మూ.

తనూజను కళ్యాణ్ నామినేట్ చేయకపోవడంతో నీకు కోపం వచ్చిందా.. లేదా సంజనను చేశాడని కోపం వచ్చిందా అని నాగ్ అడిగారు. నువ్వు తనూజని నామినేట్ చేయ్యోచ్చు కదా అని అడగ్గా.. నా దగ్గర సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది.. అది కూడా పాయింటా.. నేను అపార్థం చేసుకున్నానా అని నాకు అర్థం కాలేదు. అందుకే తనకు ఇచ్చేశా అని ఇమ్మూ చెప్పాడు. కళ్యాణ్ తో తనూజను నామినేట్ చేయించాలని అనుకున్నావా అని అడగ్గా.. లేదు.. అంతకు ముందే తనూజను నామినేట్ చేస్తానని రమ్య చెప్పింది. వాళ్లు వాళ్లు చూసుకుంటారని వదిలేశానని అన్నాడు ఇమ్మూ. తనూజను కాకుండా సంజనను నామినేట్ చేస్తానని చెబితే స్లిప్ ఇచ్చేవాడివా అని అడగ్గా.. లేదు అన్నాడు. మరీ ఇప్పుడే కదా చెప్పావు తనూజనను కాదు ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పిన కళ్యాణ్ కు స్లిప్ ఇస్తానని అంటూ ఇరికించారు నాగ్. సంజన గారిని నామినేట్ చేస్తా అంటే ఆలోచించేవాడిని అని అన్నాడు ఇమ్మూ.

దీంతో ఇమ్మూ వీడియో ప్లే చేశాడు. అందులో కళ్యాణ్, ఇమ్మూ ఇద్దరూ తనూజను నామినేట్ చేయడం గురించి మాట్లాడారు. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కను పెంచినట్లయింది అంటూ ఇమ్మూ చెప్పడం చూసి తనూజ షాకయ్యింది. నువ్వు చెప్పిన మాటలకు, అక్కడ కనిపించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని అడగ్గా.. సారీ చెబుతున్నాడు కళ్యాణ్.. ఏదో అయిపోయింది అని మాట్లాడాను అంటూ ఇమ్మూ చెబుతుండగా.. నీళ్లు పోసి పెంచడం అన్న పాయింట్ అవసరమా.. అని నాగ్ ప్రశ్నించారు. ఆ తర్వాత చచ్చిపోయిన మొక్క ఒకసారి లే అమ్మా అంటూ తనూజను పిలిచారు. వీడియో మీద నీ అభిప్రాయం ఏంటీ అని అడితే షాకవుతున్నాను అని చెప్పింది. నేను ముందే ఇమ్మూను అడిగాను.. నువ్వే నామినేట్ చేయ్యోచ్చు కదా అని అడగాను.. కానీ ఇదంతా జరిగిందని నాకు తెలియదు అని చెప్పింది. ఇమ్మూ నువ్వు సేఫ్ ఆడావు.. మనం అందరినీ మెప్పించలేం.. అందరి దృష్టిలో మంచిగా ఉండలేం.. సేఫ్ మాత్రం ఆడొద్దు. నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు.. వేరే వాళ్లను అస్త్రాలు చేయాల్సిన పనిలేదు అంటూ ఇమ్మూకు కౌంటర్స్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?