Bigg Boss 9 Telugu: ఇక మరవా అక్క.. బాధతో విలవిలలాడిన ఇమ్మూ.. మళ్లీ తొండాట ఆడి గెలిచిన తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుగనుంది. ఈసారి విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ కాగా.. సెకండ్ ఫైనలిస్ట్ కోసం వరుస టాస్కులు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి అడ్డంగా దొరికిపోయింది.

Bigg Boss 9 Telugu: ఇక మరవా అక్క.. బాధతో విలవిలలాడిన ఇమ్మూ.. మళ్లీ తొండాట ఆడి గెలిచిన తనూజ..
Bigg Boss (4)

Updated on: Dec 13, 2025 | 12:04 PM

సెకండ్ ఫైనలిస్ట్ కోసం హౌస్ లో వరుస టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి (డిసెంబర్ 13న) ఎపిసోడ్ లో ఇమ్మూ కాలికి గాయమయ్యింది. అయినప్పటికీ కాలికి కట్టుతో టాస్క్ అదరగొట్టేశాడు. అదే టాస్కులో మరోసారి తొండట ఆడి అడ్డంగా దొరికిపోయింది తనూజ. గత వారం రోజులుగా సంజన, ఇమ్మాన్యుయేల్ మాట్లాడుకోవడం లేదు. వెళ్లి మాట్లాడండీ అని సంజనతో చెప్పాడు సుమన్. తను దూరం అవుతాడని నాకు తెలుసు. అందుకే చివరి నిమిషం వరుక ఓపికతో ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది సంజన. ఇక ఎప్పటిలాగే తనూజకు కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు కళ్యాణ్. తనూజ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్న కళ్యాణ్… ఎక్కువ అలసిపోకు.. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా నేనున్నాను అంటూ తనూజకు హితోపదేశం చేశాడు.

చివరకు భరణి తనూజకు ఇచ్చి రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇమ్మూ, తనూజ మధ్య బెలూన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో మరోసారి తొండి గేమ్ ఆడింది తనూజ. చేతులు ఉపయోగించకూడదని బిగ్ బాస్ చెప్పినా.. సంచాలక్ గా ఉన్న సంజన హెచ్చరించినా.. చేతులతో టచ్ చేస్తూ .. లేదు నేను టచ్ చేయలేదు అని అబద్దాలు చెప్పేసింది. సంజనాకు డౌట్ వచ్చి.. చేతుల్ని ఉపయోగించిందా ? అని కళ్యాణ్, డీమన్ లను అడిగితే లేదని అబద్ధం చెప్పారు. అయితే టాస్కులో ఇమ్మూ కాలు పట్టేయడంతో వెంటనే అతడిని మెడికల్ రూంకు పంపించారు. ఆ తర్వాత కాళ్లకు కట్టు కట్టుకుని మరీ గేమ్ అదరగొట్టి గెలిచాడు ఇమ్మూ.

ఇక చివరా.. ఇద్దరి మధ్య మరో టాస్క్ పెట్టారు. దీనికి కళ్యాణ్ సంచాలక్. అయితే ఈ టాస్కులో ఇమ్మూ చేతిలో ఉన్న రాడ్ పొరపాటున తనూజకు తగలడంతో బాధతో విలవిలలాడింది. దీంతో కాసేపు గేమ్ ను ఆపి మళ్లీ కంటిన్యూ చేశారు. ఇందులో తనూజ గెలిచింది. అన్ని టాస్కులలో గెలిచి చివరి టాస్కులో ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు ఇమ్మూ. చివరి టాస్కులో గెలవడంతో తనూజకు 750 పాయింట్లు వచ్చాయి. ఇక టాప్ లో నిలిచిన తనూజను కన్ఫెషన్ రూంకు పిలిచిన బిగ్ బాస్… మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. కానీ మీ దగ్గర మూడు లక్షల పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ కావచ్చు. ఆ మొత్తం విన్నర్ ఫ్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని అన్నాు బిగ్ బాస్. రెండింటికి నో చెప్పిన తనూజ ఆడియన్స్ రిజల్డ్ ను బట్టే వెళ్తానని చెప్పింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..