
బిగ్‌బాస్ సీజన్ 9.. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఫైనలిస్ట్ టికెట్ కోసం టాస్కులు మొదలయ్యాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ బాక్సులో ఒక కలర్ గడి కేటాయించాడు. తొలి టాస్క్ ఆడేందుకు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పాడు. దీంతో కళ్యాణ్, ఇమ్మూ, డీమాన్ ముందుకు రాగా.. భరణి సైతం ఆడతానని ముందుకు వచ్చాడు. అయితే అప్పుడు తనూజ తన తెలివితే భరణిని ఆగిపోమ్మని చెప్పేసింది. అతడిని వెనకాల గోకుతూ మీరు ఆగిపోండి అంటూ హింట్ ఇవ్వడంతో వెనక్కు తగ్గాడు భరణి. ఇక రీతూ ఆడతానని వాదించడంతో డీమాన్ తప్పుకున్నాడు. మొదటగా మ్యాథ్స్ టాస్కు పెట్టగా.. కళ్యాణ్, ఇమ్మూ పోటీ పడ్డారు. లెక్కల టాస్కు కావడంతో రీతూ చేతులెత్తేసింది. ఈ టాస్కులో ఇమ్మూ ఇరగదీశాడు.
ఇక తర్వాతి టాస్కులో భఱణి, తనూజ, డీమాన్ ముగ్గురు పోటీ పడ్డారు. ఎవరు తీసుకున్న కలర్ పూలను తమకు అక్కడ ఏర్పాటు చేసిన మట్టిలో నాటాలని చెప్పారు. బజర్ మోగే సమయానికి ఎవరి పూలు ఎక్కువ ఉంటే వాళ్లు విన్ అవుతారని చెప్పాడు. తన టాస్కుకు కళ్యాణ్ సంచాలక్ కావాలంటే బిగ్‌బాస్ కంటే ముందే డిసైడ్ చేసింది తనూజ. టాస్కు స్టార్ట్ కాగానే.. తన నోటికి పనిచెప్పింది తనూజ. ఏంట్రా నీకు నచ్చినట్లు డెకరేట్ చేశావంటూ డీమాన్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పూలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అని సంచాలక్ చెప్పడంతో సైలెంట్ అయ్యింది. తర్వాత డీమాన్ పూలు తీసేయడంతో అసలు రచ్చ మొదలెట్టింది.. భరణి, తనూజ ఒక్కటైపోయి డీమాన్ పూలు లేకుండా చేశారు. దీంతో భరణి, తనూజ ఇద్దరిని పక్కకు లాక్కేల్లాడు డీమాన్. అప్పుడే అరవడం స్టార్ట్ చేసింది తనూజ. డీమాన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పటికీ తనూజ అరవడం మాత్రం ఆగలేదు. మరోపక్క డీమాన్ ను రీతూ ఎంకరేజ్ చేయడంతో నువ్వు వచ్చి ఆడేయ్ అంటూ సీరియస్ అయ్యింది తనూజ. ఈ టాస్కులో భరణి, తనూజ ఒక్కటి కాగా.. ఇద్దరి ఒంటిచేత్తో ఆపే ప్రయత్నం చేశాడు డీమాన్. మొత్తానికి సపోర్ట్ లేదంటూనే మరోసారి విన్ అయ్యింది తనూజ.
టాస్కు చివర్లోనూ తనకు నచ్చినట్టుగా పూలు పట్టుకుని నిలబడింది తనూజ. దీంతో అదే విషయాన్ని సంచాలక్ కు డీమాన్ చెప్పగా.. ఎప్పటిలాగే సమర్దించుకుంది తనూజ. ఎక్కువ పూలు ఉండడంతో ఆమెనే విన్నర్ అని ప్రకటించాడు కళ్యా్ణ్. గేమ్ అయ్యాక పూలు ఎందుకు తెచ్చుకోలేదని రీతూ అడగ్గా.. అక్కడ ఇద్దరూ ఒక్కటై ఆడుతుంటే ఎలా అంటూ డీమాన్ చెప్పాడు. తనూజ పూలు తీయకుండా భరణి మొత్తం నీపైనే ఫోకస్ పెట్టాడు అని రీతూ చెప్పింది. మరోవైపు భరణితో ముచ్చట పెట్టింది తనూజ. ఎవరి కోసం వాళ్లే ఆడాం కదా అని భరణిని అడగ్గా.. అవునంటూ తలాడించాడు. నాకు అదే రిగ్రెట్.. ఎంత ఆడినా అలాంటి మాటలే వస్తాయంటూ కవర్ చేసింది. మొత్తానికి ఈ టాస్కులో విన్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..