బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన కొత్త సీజన్ ఇప్పుడు ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. అలాగే ఏడు వారాల్లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనిక, సీత, మణికంఠ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఉన్నారు. అలా ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఆసక్తికరంగా మారిది. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, నయని ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ లో ప్రేరణ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆమెకు ఏకంగా 28శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఇక సెకండ్ ప్లేస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ ఉన్నాడు. అతనికి ఇప్పటివరకు 25 శాతం ఓట్లు పడ్డాయి. ఇక మూడో ప్లేస్ లో విష్ణుప్రియ కొనసాగుతోంది. ఆమెకు 14 శాతం ఓట్లు పడ్డాయి.
ఆ తర్వాత పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇందులో పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ కు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. దీనికి తోడు విష్ణు ప్రియతో ప్రేమాయణం ప్రచారం కూడా అతనికి బాగా కలిసొస్తోంది. ఇక నయని పావని కూడా బాగానే ఆడుతోంది. టాస్కులు, గేమ్స్ లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పుడు ఎటొచ్చి బిగ్ బాస్ ఎలిమినేషన్ కత్తి మెహబూబ్ మెడపైనే ఉంది. అతనికి ఇప్పటివరకు 10 శాతం ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నది కూడా మెహ బూబ్ నే. అయితే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆన్ లైన్ ఓటింగ్ కు సమయం ఉంది కాబట్టి. ఇందులో ఏమైనా మార్పులు వచ్చి మెహ బూబ్ తన ఓటింగ్ ను మెరుగు పర్చుకోవచ్చు. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం మెహ బూబ్ పెట్టే సర్దుకోవాల్సిందే.
The Bigg Boss house is buzzing with excitement as contestants take on the thrilling ‘Pattuko Cart Lo Pettuko’ challenge! 💪🚀 Who will race to victory and claim? #BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/01YDlfN7fZ
— Starmaa (@StarMaa) October 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.