Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు.. యష్మీ వర్సెస్ మణికంఠ.. ఈ వారం నామినేషన్స్‏లో ఉన్నది వీళ్లే..

|

Sep 17, 2024 | 7:05 AM

ముందుగా నామినేషన్స్ సీత స్టార్ట్ చేసింది. ముందుగా యష్మీని నామినేట్ చేస్తూ గేమ్స్ లో ఎక్కువగా డామినేటింగ్ కనిపించిందని.. పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. నువ్వు గెలవాలనే కసి నాకు నచ్చుతుంది.. కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు.. నీ అగ్రెషన్ అసలు నాకు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇక తర్వాత వచ్చిన విష్ణు ప్రియ కూడా యష్మీనే నామినేట్ చేసింది.

Bigg Boss 8 Telugu: యాటిట్యూడ్ చూపించొద్దు.. యష్మీ వర్సెస్ మణికంఠ.. ఈ వారం నామినేషన్స్‏లో ఉన్నది వీళ్లే..
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో హౌస్మేట్స్ మధ్య హీటెక్కించే డిస్కషన్ నడిచింది. ఈవారం ట్రాష్ బిన్ (చెత్తబుట్ట) థీమ్ తీసుకువచ్చారు. ఇంట్లో వ్యర్థం అనుకునేవారి పేరు, కారణం చెప్పి వారి తలపై చెత్త వేయాలని బిగ్‏బాస్ చెప్పాడు. ఇక చీఫ్స్ అయిన కారణంగా అభయ్, నిఖిల్ ను ఎవరూ నామినేట్ చేయకూడదంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా నామినేషన్స్ సీత స్టార్ట్ చేసింది. ముందుగా యష్మీని నామినేట్ చేస్తూ గేమ్స్ లో ఎక్కువగా డామినేటింగ్ కనిపించిందని.. పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. నువ్వు గెలవాలనే కసి నాకు నచ్చుతుంది.. కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు.. నీ అగ్రెషన్ అసలు నాకు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇక తర్వాత వచ్చిన విష్ణు ప్రియ కూడా యష్మీనే నామినేట్ చేసింది.

ముందుగా సాక్స్ టాస్కులో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. ఇందుకు ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత యష్మీని నామినేట్ చేస్తూ.. మీరు చీఫ్ గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్ గా ఆడలేదు. అలానే పనులు ఎక్కువగా మా టీమ్ కే ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది. అన్నింటికంటే కుకింగ్ పని ఎక్కువ. రోజుకు మూడుసార్లు వంట చేయాలి. అందుకే మీకు తక్కువ ఇవ్వాలనే అన్నీ మీపైన వేశానంటూ చెప్పుకొచ్చింది యష్మీ. ఇక నాగ మణికంఠ, యష్మీ మధ్య ఓ రేంజ్ డైలాగ్ వార్ నడించింది.

మణికంఠ వర్సెస్ యష్మీ..

ఇవి కూడా చదవండి

నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావ్.. అలాగే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ మధ్యలో దూరి మాట్లాడేస్తుంటావు.. ప్రతి విషయంలో నీ ఇన్వాల్వ్మేంట్ ఉంటుందంటూ యష్మీని నామినేట్ చేశాడు మణికంఠ. దీంతో మధ్యలోనే యష్మీ మాట్లాడడంతో మణికంఠ సీరియస్ అయ్యాడు. నేను మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి.. మీ యాటిడ్యూట్ చూపించకండి.. అంటూ మణి ఫైర్ కాగా.. నేనంటే ఇదే.. ఈ రెండు వారాలు నేను చీఫ్ గా ఉన్నాను.. నేను మాట్లాడాలి.. నీకు అది మైక్రో మేనేజ్మెంట్ గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో.. అసలు నీకు చీఫ్ అంటే ఏంటీ, మెంబర్ అంటే ఏంటీ అనే క్లారిటీ రాలేదు అంటూ ఏదేదో మాట్లాడేసింది యష్మీ. ఇందుకు మణికంఠ క్లారిటీ ఇస్తుండగా.. మధ్యలో దూరేసింది యష్మీ. దీంతో మణికంఠ మరోసారి సీరియస్ కావడంతో టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు హౌస్ లో నా దగ్గరికొచ్చి ఫ్రెండ్ గా.. అది డ్రామా, నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదు అంటూ ఫ్రెండ్షిప్ ముడిపెట్టింది. దీంతో నాకు ఒక వ్యక్తిలో క్వాలిటీ నచ్చకపోతే నేను చెప్తాను అంటూ మణి మాట్లాడుతుండగా.. నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేది.. అంటూ మాటలు హద్దు మీరింది. దీంతో మంచిగా మాట్లాడు అంటూ వార్న్ చేశాడు మణి. మాట్లాడేందుకు నీకు దమ్ము లేదా.. నువ్వు ఫేక్ అంటూ రెచ్చిపోయింది యష్మీ. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది..

  1. ప్రేరణ..
  2. నైనిక..
  3. విష్ణుప్రియ..
  4. మణికంఠ..
  5. పృథ్వీ..
  6. సీత..
  7. యష్మీ..
  8. అభయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.