Bigg Boss 8 Telugu: ‘శేఖర్ బాషా నా కోసం ఎంతో చేశాడు.. అతని కోసమైనా బిగ్ బాస్‌కు వెళతా’: రాజ్ తరుణ్

|

Sep 13, 2024 | 7:58 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ చురుగ్గా టాస్కుల్లో పాల్గొంటూ తమ ట్యాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇక వీరికి మద్దతుగా బయటి నుంచి పలు పలు విధాలుగా మద్దతు లభిస్తుంది. అలా ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ బాషాకు మద్దతుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాషా తన కోసం ఎంతో చేశాడని, అతని కోసమైనా బిగ్ బాస్ హౌస్ కు వెళతానంటూ చెప్పుకొచ్చాడు.

Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా నా కోసం ఎంతో చేశాడు.. అతని కోసమైనా బిగ్ బాస్‌కు వెళతా: రాజ్ తరుణ్
Raj Tarun, Shekar Basha
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ చురుగ్గా టాస్కుల్లో పాల్గొంటూ తమ ట్యాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇక వీరికి మద్దతుగా బయటి నుంచి పలు పలు విధాలుగా మద్దతు లభిస్తుంది. అలా ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ బాషాకు మద్దతుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాషా తన కోసం ఎంతో చేశాడని, అతని కోసమైనా బిగ్ బాస్ హౌస్ కు వెళతానంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వివాదానికి సంబంధించి రాజ్ తరుణ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ కు అండగా నిలబడ్డాడు శేఖర్ బాషా. అతనికి మద్దతుగా పలు ఛానెల్స్ లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అలాగే లావణ్య పై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే అతనిపై దాడి కూడా జరిగింది. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కోలుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తనకు అండగా నిలబడిన శేఖర్ బాషా కు మద్దతు ఇచ్చేందుకు బిగ్ బాస్ కు వెళతానంటున్నాడు రాజ్ తరుణ్.

‘శేఖర్ బాషా నాకు సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడు. ముఖ్యంగా అతను నిజం కోసం నిలబడ్డాడు. అలాంటి తన కోసం అవసరమైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తాను. గతంలో పలు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఒకట్రెండు సార్లు మాత్రమే శేఖర్ బాషాను కలిశాను. అంతే తప్ప అతడితో నాకు ఎలాంటి స్నేహం లేదు. కానీ నా కోసం అతను ఎంతో చేశాడు. నాకు మంచి మిత్రుడిగా మారాడు’ అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ బాషా..

కాగా ఇటీవలే పురుషోత్తముడు, తిరగబడరా సామీ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు రాజ్ తరుణ్. అయితే ఈ సినిమాలు పెద్దగ ఆడలేదు. ఇప్పుడు ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో రాజ్ కి జోడీగా యంగ్ బ్యూటీ మనీష కందుకూరు నటించింది. ఈ సినిమాకు శివ సాయి వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.