Bigg Boss 8 Telugu: టాస్కులో బొక్క బొర్లా పడ్డ తేజా.. పృథ్వీతో విష్ణు కబుర్లు.. డబ్బులు కొట్టేసిన సీత..

|

Oct 11, 2024 | 9:00 AM

ఆ తర్వాత స్టాఫ్ సేవలు మెచ్చి ఒక్కొక్కరికి స్టార్ ఇవ్వాలని చెప్పడంతో యష్మి, సీతకు రాయల్ క్లాన్ సభ్యులు స్టార్ ఇచ్చారు. అలాగే హోటల్ స్టాఫ్ శారీరక బలం గురించి తెలుసుకోవడానికి.. అందుకు రాయల్ క్లాన్ పలు పోటీలు నిర్వహించాలని చెప్పాడు బిగ్‏బాస్. ఇందులో భాగంగా ముందుగా ఓజీ క్లాన్ సభ్యులకు కప్ప గెంతులు గేమ్ పెట్టారు రాయల్ క్లాన్. ఇందులో యష్మి, ప్రేరణ ముందుగానే ఓడిపోగా.. ఆ తర్వాత మిగిలిన ఇంటి సభ్యులకు లెమన్, స్పూన్ గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో పృథ్వీ, నబీల్ అవుట్ అయ్యారు.

Bigg Boss 8 Telugu: టాస్కులో బొక్క బొర్లా పడ్డ తేజా.. పృథ్వీతో విష్ణు కబుర్లు.. డబ్బులు కొట్టేసిన సీత..
Bigg Boss 8 Telugu
Follow us on

గత సీజన్స్ మాదిరిగానే ఈసారి కూడా బిగ్‏బాస్ హౌస్ లో హోటల్ టాస్కు జరిగింది. గత రెండు రోజులుగా ఇదే టాస్కు ప్రసారం జరుగుతుంది. అయినా రోటీన్ సాగదీతే నడుస్తుంది. అప్పుడప్పుడు నవ్వులు.. ఎప్పుడూ జరిగే గొడవలతో నార్మల్ గా సాగింది. గురువారం కూడా హోటల్ టాస్కు జరిగింది. ఈసారి మణికంఠతో రోహిణి డ్యాన్స్ చేయించగా.. అంతలోనే కొందరి పాత్రలు మార్చేశాడు బిగ్‏బాస్. తేజ.. రోహిణి, అవినాష్ కు అసిస్టెంట్ అని.. కొడుకు గురించి గర్వంగా ఫీలవుతూ..అతడిని హీరోను చేద్దామని తల్లి పాత్ర హరితేజది. ఇక ఆకతాయి అబ్బాయి కమ్ నయని బాయ్ ఫ్రెండ్ గౌతమ్ అని.. అవినాష్ కు ఎట్రాక్టు అయిన హోటల్ మేనేజర్ ప్రేరణ అని.. హోటల్ ఓనర్ నబీల్ కొడుకు పృథ్వీ అని ఇలా కొందరి పాత్రలు మార్చి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్‏బాస్.

ఆ తర్వాత స్టాఫ్ సేవలు మెచ్చి ఒక్కొక్కరికి స్టార్ ఇవ్వాలని చెప్పడంతో యష్మి, సీతకు రాయల్ క్లాన్ సభ్యులు స్టార్ ఇచ్చారు. అలాగే హోటల్ స్టాఫ్ శారీరక బలం గురించి తెలుసుకోవడానికి.. అందుకు రాయల్ క్లాన్ పలు పోటీలు నిర్వహించాలని చెప్పాడు బిగ్‏బాస్. ఇందులో భాగంగా ముందుగా ఓజీ క్లాన్ సభ్యులకు కప్ప గెంతులు గేమ్ పెట్టారు రాయల్ క్లాన్. ఇందులో యష్మి, ప్రేరణ ముందుగానే ఓడిపోగా.. ఆ తర్వాత మిగిలిన ఇంటి సభ్యులకు లెమన్, స్పూన్ గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో పృథ్వీ, నబీల్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత మిగిలిన ఇంటి సభ్యులకు ఒంటి కాలిపై రెండు చేతుల్లో నీళ్లున్న గ్లాస్ పట్టుకోవాలని చెప్పగా.. ఈ టాస్కులో సీత, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ పోటీపడ్డారు.

ఈ టాస్కులో విష్ణు, సీత ఓడిపోగా.. నిఖిల్, మణికంఠ మాత్రమే చివరి వరకు నిలిచారు. వీరిద్దరికి మరో టాస్కు పెట్టారు. స్విమ్మింగ్ పూల్ లో అక్కడక్కడ వేసిన స్పూన్స్ ఒక్కొక్కటి తెచ్చి పెట్టే టాస్కు పెట్టగా.. ఇందులో నిఖిల్ విజేతగా నిలిచాడు. దీంతో అతడికి స్టార్ ఇచ్చారు. అలాగే మణికంఠ గేమ్ కూడా నచ్చడంతో అతడికి స్టార్ ఇచ్చారు. ఇక గేమ్స్ కంప్లీట్ కాగానే.. పృథ్వీతో సోఫాలో ముచ్చట్లు పెట్టింది విష్ణు. పృథ్వీ ఒడిలో పడుకున్న విష్ణు.. ఈ డబ్బులు తీసుకో.. కానీ నన్ను ప్రేమించు అంటూ ప్రాదేయపడింది. దీంతో పృథ్వీ మాట్లాడుతుండగానే మధ్యలో కల్పించుకుని నీకు నయని నచ్చిందా అంటూ క్వశ్చన్ చేసింది. దీంతో కాసేపు సైలెంట్ అయిన పృథ్వీ ఆ తర్వాత లేదు అని చెప్పాడు.

ఇక ఇంటిలో నీటి సరఫరా ఆపేసి రెండు టీంలకు వాటర్ సేకరించే టాస్కు ఇచ్చాడు బిగ్‏బాస్. ఇందులో ఓ చోట నుంచి మరో చోటుకు కింద అడుగుపెట్టకుండా దిగువన ఉన్న కొన్ని వస్తువులపై మాత్రమే నడుస్తూ గ్లాసుతో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. రెండు క్లాన్స్ నుంచి బాగా కష్టపడినప్పటికీ ఓజీ క్లాన్ సభ్యులు ఇందులో గెలిచారు. దీంతో వీరికి రూ.25000 గిఫ్ట్ ఇచ్చాడు బిగ్‏బాస్. పూర్తిగా టాస్కు కంప్లీట్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పాలని ఆదేశించాడు బిగ్‏బాస్. రాయల్ క్లాన్ దగ్గర డబ్బులు తక్కువగా ఉండడంతో ఓజీ క్లాన్ దగ్గరకు వెళ్లి అడగ్గా.. దొంగతనం చేశానని సీత చెప్పుకొచ్చింది. దీంతో రెండు టీమ్స్ మధ్య కాసేపు వాదన జరిగింది. చివరకు నబీల్ సర్దిచెప్పడంతో సీత డబ్బులు తిరిగి ఇచ్చేసింది. రాయల్ క్లాన్ దగ్గర లక్ష 16 వేల 500 ఉండగా.. ఓజీ క్లాన్ దగ్గర లక్ష 8 వేల 500 ఉన్నాయి. దీంతో రాయల్ క్లాన్ విజయం సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.