Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ నుంచి క్రై బేబీ ఎలిమినేట్.. నాలుగు వారాలకు నయని ఎన్ని లక్షలు సంపాదించిందంటే?

|

Nov 04, 2024 | 6:47 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగిసింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాల్టీ షో సక్సెస్ ఫుల్ గా 9 వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఆదివారం (నవంబర్ 03) వీకెండ్ ఎపిసోడ్ లో నయని పావని ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ నుంచి క్రై బేబీ ఎలిమినేట్.. నాలుగు వారాలకు నయని ఎన్ని లక్షలు సంపాదించిందంటే?
Nayani Pavani
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ రియాల్టీషో ఇప్పుడు పదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ 9 వారాల్లో ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, నైనిక, కిర్రాక్ సీత, మణికంఠ, మెహబూబ్ దిల్ సే ఇప్పటికే ఎలిమినేట్ కాగా.. రీసెంట్ గా క్రై బేబీ నయని పావని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. గత వారమే నయని ఎలిమినేట్ అవ్వాల్సింది. అయితే త్రుటితో తప్పించుకుంది. ఆమె స్థానంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఈ వారం ఎలిమినేషన్ నుంచి నయని తప్పించుకోలేకపోయింది. నయని గత సీజన్‌లోనూ వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడిపై సింపతీ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్‌లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుని మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో ఆటపై బాగానే దృష్టి పెట్టింది. తన మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది.

అయితే క్రమక్రమంగా నయని ఆట మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్‌గా మారింది. టాస్కుల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు అనవసర గొడవల్లో తలదూర్చుతుందన్న చెడ్డ పేరు తెచ్చుకుంది. ఇది బిగ్ బాస్ ఆడియెన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు. ఫలితంగా ఆమెకు తక్కువ ఓట్లు వేసి బయటకు పంపించారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో నయని పావని..

ఇక నయని పావనికి బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. రోజుకు దాదాపుగా 21,428 రూపాయల చొప్పున వారానికి రూ. 1,50,000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నాలుగు వారాలకు దాదాపుగా రూ. 6 లక్షల పారితోషికం నయని పావని అందుకుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ బజ్ లో నయని పావని ఇంటర్వ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.