Gangavva: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వకు భారీ ఊరట.. ఆ కేసు క్లోజ్‌.. జరిమానాతో సరిపెట్టిన అధికారులు

|

Oct 25, 2024 | 8:22 PM

గంగవ్వపై కేసు నమోదు కావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వస్తారేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు కేసు క్లోజ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన గంగవ్వ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

Gangavva: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వకు భారీ ఊరట.. ఆ కేసు క్లోజ్‌.. జరిమానాతో సరిపెట్టిన అధికారులు
Gangavva
Follow us on

ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్‌ గంగవ్వ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె చేసిన ఓ వీడియోకు సంబంధించి గంగవ్వతో పాటు మరో యూట్యూబర్ రాజు పై కేసులు నమోదయ్యాయి. దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ కోసం ఒక వీడియో చేశారు. గంగవ్వ చిలుక పంచాంగం పేరుతో రూపొందిన ఈ వీడియోలో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటించారు. అలాగే ఈ వీడియో కోసం ఒక చిలుకను కూడా ఉపయోగించారు. దీంతో స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ అనే వ్య‌క్తి జగిత్యాల‌ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.  ఈ ఫిర్యాదును స్వీక‌రించిన అటవీశాఖ పోలీసులు గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో గంగవ్వకు భారీ ఊరట లభించినట్లు సమాచారం. దీనికి గానూ మై విలేజ్ షో బృందం రూ.25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. దీంతో కేసు క్లోజ్ అయినట్టేనని పేర్కొన్నారు. అయితే ఈ వన్యప్రాణుల రక్షణ చట్టం గురించి తమకు తెలియదని ‘మై విలేజ్ షో’ టీమ్ సభ్యుడు అనిల్ చెప్పారు. ఈ క్రమంలో చిలుక జోస్యం వీడియోను కూడా తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో తొలిసారిగా కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు గంగవ్వ. అయితే అప్పటి వాతావరణం సరిపోకపోవడం, తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో షో మధ్యలోనే ఆమె బయటకు వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 8లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఆటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు సరి పడా వినోదాన్ని అందజేస్తున్నారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయానా తోటి కంటెస్టెంట్స్ తో కలిసి అభిమానులకు వినోదాన్ని అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.