Brahmamudi, October 25th Episode: రుద్రాణికి వచ్చేసిన డౌట్.. కంపెనీని కోలుకోని దెబ్బ కొట్టిన అనామిక..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆఫీస్ నుంచి కావ్య ఇంటికి వస్తుంది. కావ్య ఇంటికి రాగానే మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉంది? అల్లుడు గారు ఏమైనా అన్నారా? అని అడుగుతుంది. ఎలా జరగకూడదో అలాగే జరిగింది. పీక పిసికి చంపడం ఒక్కటే తక్కువ. చేయాల్సిన నానా రచ్చ చేశారు. ఆ తర్వాత తాతయ్య మీదకు కూడా యుద్ధాన్ని ప్రకటించారని కావ్య చెబితే.. అయ్యయ్యో అవునా.. రేపటి నుంచి అల్లుడు గారు ఆఫీస్‌కి రారా అని కనకం కంగారు పడితే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆఫీస్ నుంచి కావ్య ఇంటికి వస్తుంది. కావ్య ఇంటికి రాగానే మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉంది? అల్లుడు గారు ఏమైనా అన్నారా? అని అడుగుతుంది. ఎలా జరగకూడదో అలాగే జరిగింది. పీక పిసికి చంపడం ఒక్కటే తక్కువ. చేయాల్సిన నానా రచ్చ చేశారు. ఆ తర్వాత తాతయ్య మీదకు కూడా యుద్ధాన్ని ప్రకటించారని కావ్య చెబితే.. అయ్యయ్యో అవునా.. రేపటి నుంచి అల్లుడు గారు ఆఫీస్‌కి రారా అని కనకం కంగారు పడితే.. ఏమో నాకేం తెలుస్తుంది. రేపు ఆయన ఆఫీస్‌కి వచ్చి నన్ను వెళ్లగొడతారా.. ఆయన వెళ్లిపోతారా అన్నది ఆయన వచ్చాక తెలుస్తుంది. కావాలంటే మీ అల్లుడి గారికి ఫోన్ చేసి కనుక్కోమని కావ్య చెప్పి వెళ్లిపోతే.. ఎవరికి ఫోన్ చేయాలో వాళ్లకే చేస్తానని ఇందిరా దేవికి చేస్తుంది.
రాజ్ ఇగో రెచ్చ గొట్టాలి..
అప్పటికే రాజ్ గురించి అపర్ణ, ఇందిరా దేవిలు మాట్లాడుకుంటారు. కావ్య ఇంటికి వచ్చి విషయం చెప్పినట్టు ఉంది. అందుకే కంగారు పడి ఫోన్ చేస్తుంది. హలో అని ఇందిరా దేవి అనగానే.. ఏంటండీ అల్లుడు గారు ఆఫీస్ నుంచి అలిగి వచ్చేశారంట కదా.. ఇంతకీ ఆయన ఆఫీస్‌కి వెళ్తారా లేదా అది చెప్పమని అడుగుతుంది కనకం. మేము ఉండగా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు. ఆఫీస్‌కి వెళ్లము అంటే వదిలేస్తామా.. వాడి ఇగోనే రెచ్చగొట్టి పంపిస్తాం. అందుకే ఆపరేషన్ మొదలు పెట్టామని ఇందిరా దేవి చెబుతుంది. తప్పకుండా వస్తానని చెబుతుంది కనకం. అప్పుడే రుద్రాణి వచ్చి అపర్ణ, ఇందిరా దేవిల మాటలు వింటూ దగ్గరకు వస్తుంది. ఏంటి ఎవరి ఇగో రెచ్చగొట్టాలి అంటున్నారు? అని అడుగుతుంది.
రుద్రాణికి వచ్చిన డౌట్..
వచ్చిందమ్మా విలక్షణ నటి.. పాము చెవులు వేసుకుని ఎంత దూరంలో మాట్లాడినా వింటుందని ఇందిరా దేవి తిడుతుంది. ఏంటమ్మా అలా అంటున్నారు? అని రుద్రాణి అంటే.. కనకం ఇంట్లో నువ్వు ఆడిన డ్రామా మామూలుగా ఉందా.. వాళ్లిద్దర్నీ కలిపే సమయంలో వచ్చి విడగొట్టావని తిడుతుంది పెద్దావిడ. నేను కాదు నాటకం ఆడింది ఆ కనకమని రుద్రాణి అంటుంది. ఆ కనకం పాపం పిచ్చిది.. నీతో పోటీ పడి ఎక్కడ గెలుస్తుంది చెప్పు.. అని పెద్దావిడ అంటుంది. బాగానే మాటలు మాట్లాడుతున్నావ్ కానీ.. ఇంతకీ ఎవరి ఈగో రెచ్చగొట్టాలో చెప్పడం లేదని రుద్రాణి అంటుంది. చెప్తే ఏం చేస్తావ్? ఆ పని కూడా చెడగొడతావా? అని అపర్ణ గడ్డి పెట్టి వెళ్తారు. ఏదో ప్లాన్ చేస్తున్నారని ఏంటి అది.. అని రుద్రాణి ఆలోచిస్తే.. నాకు తెలుసు ఏంటో చెప్పమంటారా.. అని స్వప్న అంటుంది. నాకు నువ్వు నిజం చెప్తానా.. నేను నమ్మను.. నాకు ఎదురు తిరగడానికి ఈ ఇంట్లో ఎవరికీ ధైర్యం లేదని అంటుంది రుద్రాణి. వాళ్లు మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారని అంటుంది స్వప్న. మమ్మల్ని గెంటేస్తే మాతో పాటు నువ్వు కూడా బయటకు వస్తావని రుద్రాణి అంటుంది. నేను మీ లాగ బేవర్స్ పార్టీ అనుకుంటున్నారా.. తాతయ్య ఇచ్చిన ఆస్తితో సంతోషంగా బతుకుతానని స్వప్న చెప్పి వెళ్తుంది.
కళ్యాణ్ బాధ.. అప్పూ ఎంకరేజ్..
ఆ తర్వాత కళ్యాణ్ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ.. ఆటో నడిపే షర్ట్ వైపు చూస్తాడు. అప్పుడే అప్పూ వచ్చి.. ఏంటి ఆలోచిస్తున్నావ్? ఆ షర్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నావ్? ఇంకా తనివి తీరలేదా? అని అడుగుతుంది. ఆటో నడపడం అంత అవమానమా అని కళ్యాణ్ అడిగితే.. మన దేశంలో లక్షల మంది ఆటో నడుపుతున్నారు. వారి మీద ఆధార పడి కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. కాబట్టి ఆ పని చేయడంలో తప్పు ఏం ఉందని అప్పూ అంటుంది. మరి నేనేమన్నా దొంగ బిజినెస్ ఏమన్నా చేస్తున్నానా.. నన్ను నన్నుగా గుర్తించడానికి ఏంటి ప్రాబ్లమ్ అని కళ్యాణ్ అంటే.. రైటర్‌ని కలిశావా? అని అడుగుతుంది అప్పూ. వును.. నువ్వు ఆటో నడుపుతున్నావు.. ఎందుకు పనికి రావని అన్నాడు. ఆయన అసిస్టెంట్‌గా పని చేసే అర్హత కూడా లేదని అన్నాడని కళ్యాణ్ బాధ పడతాడు. అర్హత అనేది ఒకరు ఇచ్చేది కాదు.. మనమే సంపాదించుకోవాలని కళ్యాణ్‌ని ఎంకరేజ్ చేస్తుంది అప్పూ.
మేనేజర్ పోస్ట్ కూడా ఉండదు..
ఆ తర్వాత ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుని ల్యాప్ టాప్ ఓపెన్ చేస్తాడు. కానీ పాస్ వర్డ్ ఓపెన్ కాదు. దీంతో కావ్యకి మెసేజ్ చేస్తాడు. పాస్ వర్డ్ చెప్పమని అడిగితే.. నేను చెప్పను చేతనైతే మీరే కనుక్కోమని కావ్య అంటుంది. దీంతో రాజ్ చాలా కోపం వస్తుంది. ఎన్ని సార్లు ట్రై చేసినా ఓపెన్ కాదు. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంట్రా ఇది.. మొగుడు పోస్ట్ పోయింది.. ఎండీ పోస్ట్ పోయింది.. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు.. ఏంట్రా నీ పరిస్థితి. యువరాజులా ఉండేవాడికి.. ఎలా అయ్యావో అని అంటాడు. ఇప్పుడు ఏంటో అర్థమై ఉంటుందని అంతరాత్మ అంటుంది. ఆహా నా మొండి తనం ఏంటో ఇంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. రేపు అందరూ వచ్చి బతిమలాడి ఆఫీస్‌కి వెళ్లమని అంటారని రాజ్ అంటాడు. ఇలాగే కలలు కంటూ ఉండు.. రేపు ఆ మేనేజర్ పోస్ట్‌లో కూడా ఎవడో ఒకడు వస్తాడు.. అప్పుడు నీకు ఏ అటెండర్ పోస్టో వస్తుందని అంతరాత్మ అంటుంది. దీంతో రాజ్ కొట్టబోతుండగా.. అంతరాత్మ వెళ్లిపోతుంది.
కళ్యాణ్‌ని వాడేసుకుంటున్న లిరిక్ రైటర్.. అనామిక వార్నింగ్..
ఆ నెక్ట్స్ కళ్యాణ్‌కు లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్ ఫోన్ చేస్తాడు. హలో తమ్ముడు ఏంటి ఇందాక అన్నదానికి బాధ పడ్డవా.. కానీ రేపు ప్రొడ్యూసర్ ఒకటి అంటే.. డైరెక్టర్ మరొకటి అంటాడు. ఇందాక నువ్వు బతిమలాడే సరికి నా మనసు కరిగింది. అందుకే ఒక అవకాశం ఇస్తున్నా.. తల్లి, కొడుకులు కలిశారు. వారిద్దరి మధ్య ప్రేమ బయటకు వచ్చేలా దాని మీద మంచి పాట రాయమని చెప్పతాడు రైటర్. సరే సర్ తప్పకుండా రాస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక తెల్లవారుతుంది. అందరూ బతిమలాడుకోవడానికి రెడీగా ఉన్నారని రాజ్ కిందుకు వస్తాడు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఏమైంది వీళ్లకు.. ఇదేంటి తాతయ్య బ్రతిమలాడటం లేదని అనుకుంటాడు. నాన్నమ్మ ఏంటి సంగతి అని రాజ్ అడిగితే.. ఏం పనీ పాట లేదు కదా కూర్చున్నా అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్యకి ఫోన్ చేసి నీ క్లయింట్స్ అందరినీ లాక్కున్నా ఎవరూ రారని వార్నింగ్ ఇస్తుంది అనామిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..