Bigg Boss 8 Telugu: అలాంటి కామెంట్స్ చేయడం ఆపేయండి.. మణికంఠ భార్యకు అండగా నిలిచిన మరదలు..

|

Sep 11, 2024 | 9:32 PM

మొదట అతడు చెప్పిన మాటలతో మణికంఠ భార్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆమె పెద్ద విలన్ అని అంతా అనుకున్నారు. కానీ బిగ్‏బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని.. షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు. దీంతో నాగ మణికంఠ ఫ్యామిలీ గురించి

Bigg Boss 8 Telugu: అలాంటి కామెంట్స్ చేయడం ఆపేయండి.. మణికంఠ భార్యకు అండగా నిలిచిన మరదలు..
Naga Manikanta
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8లో తొలివారం మొత్తం సింపథి స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్నాడు నాగ మణికంఠ. చిన్నప్పుడే నాన్న చనిపోవడం.. ఆ తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకుందని.. ఊహ తెలిసినప్పటికీ తన తండ్రి స్టెప్ ఫాదర్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయానంటూ తన గతం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తన భార్య, కూతురి గురించి స్పెషల్ వీడియోలో వేరేలా.. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరోలా మాట్లాడాడు. మొదట అతడు చెప్పిన మాటలతో మణికంఠ భార్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆమె పెద్ద విలన్ అని అంతా అనుకున్నారు. కానీ బిగ్‏బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని.. షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు. దీంతో నాగ మణికంఠ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని.. అతడి భార్య, కూతురి ఫోటోస్ చూడాలని తెగ సెర్చ్ చేశారు నెటిజన్స్. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నాగ మణికంఠ పెళ్లి వీడియో నెట్టింట వైరలయ్యింది.

నాగ మణికంఠ భార్య పేరు శ్రీప్రియ.. అందులో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె శరీరాకృతిపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ అమ్మాయి కోసమా ఇంతలా ఏడ్చావు.. కితకితలు 2 సినిమా చూసినట్లుంది.. అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడు అంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మణికంఠ సోదరి కావ్య అమర్ నాథ్ తన వదినకు అండగా నిలిచింది. మణికంఠ భార్య గురించి వస్తున్న కామెంట్స్ పై ఫైర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

“మా అన్నవదినల వీడియో ఒకటి వైరలవుతుండడం నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఎంతో బాధేసింది. కితకితలు సినిమా రెండో పార్ట్ చూసినట్లుంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు. ఇది హీనమైన చర్య. మా వదిన సౌందర్యవతి.. తన మనసు చాలా అందమైనది. ఆమె ప్రేమ, బలం, దయాగుణం.. ఇలా ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మార్చాయి. నాకు తల్లిగా నిలబడుతుంది. ఆమె పై బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి. బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగవచ్చు. ఆ మాటలు వారి మనసును బాధిస్తాయి. గాయపరుస్తాయి. మీ నెగిటివిటీని పక్కనపెట్టి ప్రేమను పంచండి. అవతలివారు ఎలా ఉన్నరన్నదానికి బదులుగా ఎలాంటివారో తెలుసుకుని వారికి మెచ్చుకోండి” అంటూ పోస్ట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.