Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్‏లో ఆ ఇద్దరూ.. మిడ్ నైట్ షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరంటే..

|

Oct 03, 2024 | 6:11 PM

ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన ఓటింగ్స్ చూస్తే అత్యధిక ఓటింగ్‏తో టాప్ లో దూసుకుపోతున్నాడు నబీల్. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ అనంతరం.. నబీల్ కు ఓటింగ్ శాతం పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడు. సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయి.

Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్‏లో ఆ ఇద్దరూ.. మిడ్ నైట్ షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరంటే..
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8 ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ముందుగానే ప్రకటించాడు నాగార్జున. ఈ వారం మధ్యలోనే ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందని గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో ప్రేక్షకులకు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వీకెండ్ లో మొత్తం 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. దీంతో ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు కానున్నారనే చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలలో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి హింట్స్ ఇస్తున్నాడు బిగ్‏బాస్. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన ఓటింగ్స్ చూస్తే అత్యధిక ఓటింగ్‏తో టాప్ లో దూసుకుపోతున్నాడు నబీల్. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ అనంతరం.. నబీల్ కు ఓటింగ్ శాతం పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడు. సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయి.

వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో విష్ణుప్రియ ఉండగా..ఆ తర్వాత స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అందరి కంటే తక్కువ ఓటింగ్ తో చివరి స్థానంలో నైనిక ఉండగా.. ఆమె కంటే కాస్త ఎక్కువ ఓటింగ్ తో ఆదిత్య ఉన్నాడు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మాత్రం నైనికను కాకుండా ఆదిత్య ఓంను ఇంటి నుంచి బయటకు పంపించాడట బిగ్‏బాస్. నైనిక, ఆదిత్య ఓం మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది.

తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో మిడ్ నైట్ డేంజర్ అల్లారం మోగించాడు బిగ్‏బాస్. ప్రతిరోజులానే మొదలైన ఈరోజు ఒకరికి మాత్రం పీడకలగా మారబోతుంది. మీలో నుంచి ఒకరు ఈరాత్రి హౌస్ ను వదిలి వెళ్లబోతున్నారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్‏బాస్. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఓటింగ్ లో ఉన్న లాస్ట్ ముగ్గురిని..మీ బ్యాగ్స్ అన్ని సర్దుకొని.. ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ బిగ్‏బాస్ చెప్పాడు. విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. వీరిలో ఎవరు బయటకు వెళ్లాలనుకుంటున్నారు అంటూ మిగతా కంటెస్టెంట్లను అడగ్గా.. ఒక్కొక్కరు ఒకరి పేరు చెప్పారు. ఎక్కువ మంది ఆదిత్య ఓం పేరు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆదిత్య ఓంను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.