Bigg Boss 7 Telugu: రవితేజ కోసం టైటిల్ వదిలేసి పరుగులు పెట్టిన అమర్.. మాస్ మహారాజా భావోద్వేగం..

|

Dec 17, 2023 | 2:26 PM

తాజాగా బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల చేశారు. "సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్" అంటూ సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్ చెప్పారు నాగ్. ఆ తర్వాత టాప్ 6 ఫైనలిస్ట్స్ మాత్రమే కాకుండా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం మాట్లాడారు. బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పదిరెట్లు బెటర్ అంటూ దామిని చెప్పింది. ఇక తర్వాత తనకు 15 సినిమా ఆఫర్స్ వచ్చాయని తేజ అన్నాడు. శుభ శ్రీని ఎక్కడ చూసిన మనోభావాలు పాప అని గుర్తుపడుతున్నారని చెప్పగా.. సింగర్ భోలే.. భోలే అంటే హీరో అంటూ పాటతో అదరగొట్టేశాడు.

Bigg Boss 7 Telugu: రవితేజ కోసం టైటిల్ వదిలేసి పరుగులు పెట్టిన అమర్.. మాస్ మహారాజా భావోద్వేగం..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 నేటితో పూర్తి కానుంది. మొత్తం 105 రోజులు.. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇప్పటికే బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రశాంత్, అమర్ మధ్య స్వల్ప తేడాతో ఓటింగ్ ఉండడంతో వీరిలో విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది ఊహించలేకపోతున్నారు. ఇప్పటివరకు ప్రశాంత్ టాప్ 1 స్థానంలో ఉన్నప్పటికీ ఉల్టా పుల్టా సీజన్ అంటూ ట్విస్ట్ ఛాన్స్ లేకపోలేదంటున్నారు అడియన్స్. తాజాగా బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల చేశారు. “సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్” అంటూ సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్ చెప్పారు నాగ్. ఆ తర్వాత టాప్ 6 ఫైనలిస్ట్స్ మాత్రమే కాకుండా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం మాట్లాడారు. బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పదిరెట్లు బెటర్ అంటూ దామిని చెప్పింది.

ఇక తర్వాత తనకు 15 సినిమా ఆఫర్స్ వచ్చాయని తేజ అన్నాడు. శుభ శ్రీని ఎక్కడ చూసిన మనోభావాలు పాప అని గుర్తుపడుతున్నారని చెప్పగా.. సింగర్ భోలే.. భోలే అంటే హీరో అంటూ పాటతో అదరగొట్టేశాడు. ఆ తర్వాత నరేష్, కళ్యాణ్ రామ్, రాజ్ తరుణ్, సుమ, రోషన్ ఇలా చాలా మంది అతిథులు వచ్చారు. అయితే ఇదే ప్రోమోలో మాస్ మహారాజా రవితేజ అమర్ దీప్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అమర్ రవితేజ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. దీంతో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. “అమర్.. నీకు అద్భఉతమైన ఆఫర్ ఇస్తున్నా.. గేట్లు ఓపెన్ చేస్తున్నా.. ఇప్పుడు నువ్వు అన్నీ వదిలేసి వచ్చేస్తే.. రవితేజ నెక్ట్స్ సినిమాలో రవితేజతో కలిసి నటించే ఆఫర్ వస్తుంది.. నీకు ఏడు సెకన్స్ టైం ఇస్తున్నా.. బిగ్‏బాస్ హౌస్ లో ఉంటావా ?.. లేదంటే రవితేజ సినిమాలో నటిస్తావా ” అని అడిగారు. అయితే అమర్ మాత్రం క్షణం ఆలోచించకుండా పరుగుతుకుంటూ రావడం కనిపించింది.

రవితేజ సినిమా ఛాన్స్ కోసం అమర్ పరుగులు పెట్టడం చూసి అందరూ షాకయ్యారు. ఇక రవితేజ మాత్రం ఎమోషనల్ అయిపోయారు. నాకేం మాట్లాడాలో తెలియడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమర్ బయటకు పరిగెత్తడంతో అతడి భార్య తేజ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే మొత్తం 105 రోజులు బిగ్‏బాస్ హౌస్ లో ఉన్న అమర్.. కేవలం రవితేజ సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం టైటిల్ ను వదిలేసి పరిగెత్తడం చూస్తుంటే.. మాస్ మహారాజా అంటే అభిమానం ఏస్థాయిలో తెలిసిపోతుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలో అన్నింటిని ఇది హైలెట్ అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.