Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. టెలికాస్ట్‌ టైమింగ్స్‌లో మార్పు.. కాస్త ముందుగానే..

మిగతా రోజులు ఎలా ఉన్నా వీకెండ్‌ అంటే బిగ్‌బాస్‌ షోలో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటది. హోస్ట్‌ నాగార్జునతో పాటు పలువురు సెలబ్రిటీలు బిగ్‌ బాస్‌ స్టేజ్‌పై సందడి చేస్తారు. కంటెస్టెంట్లతో చిట్‌ చాట్‌ కూడా ఉంటుంది. దీనికి తోడు ఈ వారం దసరా పండగ కూడా వచ్చింది. కాబట్టి ఎంటర్‌టైన్మెంట్‌ నెక్ట్స్‌ లెవెల్‌ ఉండవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోల్లో కూడా ఎంతో జోష్‌ కనిపిస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. టెలికాస్ట్‌ టైమింగ్స్‌లో మార్పు.. కాస్త ముందుగానే..
Bigg Boss 7 Telugu

Updated on: Oct 22, 2023 | 3:16 PM

మిగతా రోజులు ఎలా ఉన్నా వీకెండ్‌ అంటే బిగ్‌బాస్‌ షోలో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటది. హోస్ట్‌ నాగార్జునతో పాటు పలువురు సెలబ్రిటీలు బిగ్‌ బాస్‌ స్టేజ్‌పై సందడి చేస్తారు. కంటెస్టెంట్లతో చిట్‌ చాట్‌ కూడా ఉంటుంది. దీనికి తోడు ఈ వారం దసరా పండగ కూడా వచ్చింది. కాబట్టి ఎంటర్‌టైన్మెంట్‌ నెక్ట్స్‌ లెవెల్‌ ఉండవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోల్లో కూడా ఎంతో జోష్‌ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభమై సుమారు సుమారు 50 రోజులు గడుస్తోంది. ఈ సందర్భంగా హౌజ్‌లోని కంటెస్టెంట్లకు ఒక బంపరాఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. పండగను పురస్కరించుకుని ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను కంటెస్టెంట్లకు అందజేశారు. దీంతో తమ కుటుంబ సభ్యులను తలచుకుని కంటెస్టెంట్స్‌ బాగా ఎమోషనల్‌ అయ్యారు. శోభా శెట్టి, ప్రిన్స్‌ యావర్‌, టేస్టీ తేజా, అమర్‌ దీప్‌ చౌదరి.. ఇలా పలువురు తమ ఉత్తరాలను చదివి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా దసరా సందర్భంగా ఇవాళ (అక్టోబర్‌ 22) బిగ్‌ బాస్‌ టెలికాస్ట్‌ టైమింగ్స్‌లో మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం 7 గంటలకే ఈ సెలబ్రిటీ ఎంటర్‌టైన్మెంట్‌ షో టెలికాస్ట్‌ అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది.

కాగా దసరా సందర్భంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్‌ పూలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. డ్యాన్స్‌లు కూడా వేశారు. ఇక ఈ వారం సెలబ్రిటీల విషయానికికొస్తే.. కొందరు యంగ్ సింగర్స్‌ బిగ్‌ బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. అలాగే డింపుల్‌ హయతి తన డ్యాన్స్‌తో షోకు మరింత గ్లామర్‌ తీసుకొచ్చింది. ఇక మంగళ వారం హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా బిగ్‌ బాస్‌ వేదికపై సందడి చేసింది. మరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో దసరా, బతుకమ్మ వేడుకలు ఎలా జరిగాయో ఈరోజు ఎపిసోడ్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో ఘనంగ బతుకమ్మ వేడుకలు..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

ఏడ గంటల నుంచే ఎంటర్ టైన్మెంట్ షురూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..