బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగపెట్టారు. అప్పుడే మొదటి రోజు కూడా పూర్తయ్యింది. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఎప్పటిలాగే ఒకరిపై ఒకరు అర్చుకోవడాలు, తిట్టుకోవడాలు, పులిహోర కలపడాలు మొదలయ్యాయి. ‘ఉల్టాపుల్టా’ అంటూ ఈ సీజన్ అంతా వెరైటీగా ఉందని చెప్పిన మేకర్స్ అందుకు తగ్గట్టే టాప్-5 కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాగానే బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చారు. అయితే తాము టైటిల్‌తోనే బయటకు వెళదామంటూ అందరూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అలాగే వీకెండ్‌లో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏడో సీజన్ కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్లకు సంబంధించి గఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. టాప్‌లో ఎవరున్నారు? చాలా తక్కువ పారితోషకం ఎవరికీ ఇస్తున్నారు? తదితర విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు తక్కువ మొత్తంలో పారితోషకాలు అందుతున్నాయని తెలుస్తోంది. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ వారానికి రూ. 2.5 లక్షల పారితోషకం అందుతోందట. ఇక బాహుబలి సింగర్ దామినీ భట్ల రూ. 2లక్షలు తీసుకుంటోందట. హీరోయిన్ రతికాకు కూడా అంతే మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారట మేకర్స్.
బిగ్‌బాస్ షోలో పాల్గొన్నందుకు కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టికి వారానికి రూ. 2.5 లక్షలు ఆఫర్ చేశారట. మరో నటి లాయర్ శుభశ్రీకి రూ. 2 లక్షలు, నటుడు గౌతమ్ కృష్ణకు రూ. 1.75 లక్షలు, మోడల్ ప్రిన్స్ యావర్‌కు రూ. 1.5 లక్షలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌కు వారానికి రూ.2.75 లక్షల పారితోషకం ఇస్తున్నారట. జానకికలగనలేదు ఫేమ్, నటుడు అమర్‌దీప్‌కు రూ. 2. 5 లక్షలు ఆఫర్ చేస్తే, ప్రముఖ యూట్యూబర్, నటుడు టేస్టీ తేజాకు రూ.1.5 లక్షలు ఇస్తున్నారట. ఇక సీనియర్ నటీమణులు షకీలా రూ. 3.5 లక్షలు అందుకుంటుంటే, కిరణ్ రాథోడ్ రూ. 3 లక్షలు తీసుకుంటోందట. ఇక సీనియర్ నటుడు శివాజీకి అందరికంటే అత్యధికంగా వారానికి రూ. 4 లక్షలు ఇస్తున్నారట.ఇక అతి తక్కువగా ప్రముఖ యూట్యూబర్, రైతు పల్లవిప్రశాంత్‌కు వారానికి కేవలం రూ. లక్ష మాత్రమే అందిస్తున్నారట. అంటే రెమ్యూనరేషన్ల విషయంలో ఈసారి టాప్ ప్లేస్‌లో శివాజీ ఉండగా, పల్లవి ప్రశాంత్ ఆఖరి స్థానంలో ఉన్నారని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..