AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu-Rathika Rose: బిగ్‏బాస్‏లో అచ్చ తెలుగు అందం.. క్యూట్‏ లుక్స్‏తో కట్టిపడేస్తోన్న రతిక..

మొదటిరోజే బిగ్‏బాస్ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రతిక రోస్. తెలుగులో చక్కగా మాట్లాడుతూ.. మేకప్ లేకుండానే ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది రతిక. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి. వెండితెరపై పలు సినిమాలు.. బుల్లితెరపై ఎన్నో షోలు చేసినప్పటికీ గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు బిగ్‏బాస్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు వచ్చిందీ ఈ బ్యూటీ. మొదటి రోజే ఫ్రెష్ లుక్ తో అట్రాక్షన్ అయిన రతిక గురించి

Bigg Boss 7 Telugu-Rathika Rose: బిగ్‏బాస్‏లో అచ్చ తెలుగు అందం.. క్యూట్‏ లుక్స్‏తో కట్టిపడేస్తోన్న రతిక..
Bigg Boss 7 Telugu Rathika
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2023 | 3:39 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యింది. అంతా ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచి ఎపిసోడ్స్‏తో క్యూరియాసిటి పెంచేసిన నాగ్..ఈసారి కూడా దాదాపు ప్రేక్షకులకు తెలియని వాళ్లేనే తీసుకొచ్చారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ సీజన్ 7 హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. అందులో శివాజీ, షకీలా, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, ఆట సందీప్ ఇప్పటికే ఫాపులారిటిని సంపాదించుకున్నవాళ్లే. ఇక ప్రిన్స్ యావర్ జనాలకు అస్సలు పరిచయం లేని ముఖం. ఇదిలా ఉంటే మొదటిరోజే బిగ్‏బాస్ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రతిక రోస్. తెలుగులో చక్కగా మాట్లాడుతూ.. మేకప్ లేకుండానే ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది రతిక. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి. వెండితెరపై పలు సినిమాలు.. బుల్లితెరపై ఎన్నో షోలు చేసినప్పటికీ గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు బిగ్‏బాస్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు వచ్చిందీ ఈ బ్యూటీ. మొదటి రోజే ఫ్రెష్ లుక్ తో అట్రాక్షన్ అయిన రతిక గురించి తెలుసుకుందామా.

రతిక రోస్.. తెలంగాణలోని వికారాబాద్ అమ్మాయి. నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయినా మెయిన్ రోల్స్ రాలేదు. 2016లో స్టాండప్ కామెడియన్ గా మారింది.

అప్పట్లో తన పేరును ప్రియా అని పరిచయం చేసుకుందా. బుల్లితెరపై పటాస్ షోలో స్టాండప్ కామెడితో ప్రేక్షకులను నవ్వించింది. ఆ తర్వాత కొంతం కాలం బ్రేక్ తీసుకుని మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. తెలుగమ్మాయికి తెలుగులో కాకుండా తమిళంలో కథానాయికగా అవకాశం వచ్చింది. అక్కడ మారో అనే సినిమా చేసింది. కానీ ఈ మూవీ విడుదలకు ముందే ఆగిపోయింది.

ఇక తెలుగులో రష్మిక నేను స్టూడెంట్ సర్ చిత్రంలో నటించింది. బెల్లంకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రతిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో రతికకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీకి దాదాపు 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది రతిక. ఇక ఇప్పుడు బిగ్‏బాస్ షోతో అడియన్స్ ముందుకు వచ్చిన రతిక.. ఆ తర్వాత సినీ పరిశ్రమలో బిజీ అవుతుందేమో చూడాలి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?