Pallavi Prashanth: రైతు బిడ్డకు పాటబిడ్డ స్నేహ హస్తం.. ప్రశాంత్‌కు బెయిల్‌ తీసుకొచ్చేందుకు భోలే ఏం చేశాడంటే?

|

Dec 22, 2023 | 9:33 PM

పల్లవి ప్రశాంత్‌ కు బెయిల్‌ రావడంలో పాట బిడ్డ భోలేషావళి కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. కష్ట కాలంలో రైతు బిడ్డకు స్నేహ హస్తం అందించిన పాట బిడ్డ చాలా మంది లాయర్లను కలిశాడట. కేవలం 48 గంటల్లోనే పల్లవి ప్రశాంత్‌ని బెయిల్‌పై తీసుకు రావడంలో ప్రధాన పాత్ర పోషించాడట. అందుకే రైతు బిడ్డకు బెయిల్ మంజూరు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు పాట బిడ్డ.

Pallavi Prashanth: రైతు బిడ్డకు పాటబిడ్డ స్నేహ హస్తం.. ప్రశాంత్‌కు బెయిల్‌ తీసుకొచ్చేందుకు భోలే ఏం చేశాడంటే?
Bhole Shavali, Pallavi Prashanth
Follow us on

బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట దొరికింది. అతడికి కోర్టు షరతుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆదివారం నాడు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ప్రశాంత్‌ను కోర్టు ఆదేశించింది. 15 వేల రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని పేర్కొంది. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ -1గా ఉన్న ప్రశాంత్‌తో నుంచి ఏ -4 వరకు నిందితులందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడ కూడా సమావేశాలు పెట్టకూడదని, మీడియా తో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. కాగా పల్లవి ప్రశాంత్‌ కు బెయిల్‌ రావడంలో పాట బిడ్డ భోలేషావళి కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. కష్ట కాలంలో రైతు బిడ్డకు స్నేహ హస్తం అందించిన పాట బిడ్డ చాలా మంది లాయర్లను కలిశాడట. కేవలం 48 గంటల్లోనే పల్లవి ప్రశాంత్‌ని బెయిల్‌పై తీసుకు రావడంలో ప్రధాన పాత్ర పోషించాడట. అందుకే రైతు బిడ్డకు బెయిల్ మంజూరు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు పాట బిడ్డ. ‘స్నేహబంధమూ ఎంత మధురమూ’ అని పాట పాడుతూ ప్రశాంత్‌కి బెయిల్‌కు తీసుకొచ్చిన లాయర్‌కు ముద్దులు పెట్టాడు. ‘ రైతుబిడ్డకి న్యాయం జరిగింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లో బెయిల్ వచ్చేట్టు చేశాం. జడ్జీగారికి పాదాభివందనం. ప్రశాంత్ తమ్ముడు జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. ప్రాసెస్ పూర్తి అయితే శుక్రవారం నాడే రిలీజ్ కావొచ్చు. లేదంటే.. సోమవారం నాడు జైలు నుంచి విడుదల’ అని చెప్పుకొచ్చాడు భోలే షావలి. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం.. పోలీస్ వారికి మరొకసారి క్షమాపణలు చెబుతున్నాం’ అని చెప్పుకొచ్చాడు పాట బిడ్డ.

ప్రశాంత్‌ కు టేస్టీ తేజా మద్దతు

ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల విధులకు ప్రశాంత్‌ ఆటంకం కలిగించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రశాంత్‌ రెచ్చగొట్టడం వల్లే యువకులు రెచ్చిపోయారని.. పోలీసుల ముందే ఆర్టీసీ బస్సులు, కార్లను ధ్వంసం చేశారన్నారు. సమాజం పట్ల బాధ్యత, భయం ఉండాలనే కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. గత ఆదివారం బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ బయట గొడవ జరిగింది. ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, రన్నర్‌గా నిలిచిన అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా ఇతర కంటెస్టెంట్ల వాహనాలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ధ్వంసం చేశారని కేసు నమోదైంది. అక్కడి నుంచి హడావుడి లేకుండా వెళ్లాలని పోలీసులు చెప్పినా.. పల్లవి ప్రశాంత్ వినిపించుకోలేదని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడి స్వగ్రామమైన కొలుగూరుకు వెళ్లి అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రశాంత్‌కు బెయిల్‌ వచ్చింది. మరోవైపు ప్రశాంత్ అరెస్ట్‌పై హీరో శివాజీ రియాక్ట్‌ అయ్యారు. ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలుగా తాను చూశానని.. చాలా మంచివాడని చెప్పారు. ప్రశాంత్ నేరస్తుడో.. క్రిమినలో కాదని అభిప్రాయపడ్డారు. శివాజీతోపాటు.. అశ్వినీ కూడా ప్రశాంత్‌కు సపోర్ట్‌గా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. భోలే, టేస్టీ తేజ ఇప్పటికే ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.