బిగ్బాస్ ఫైనల్ కు ఇంకా మూడు వారాలే మిగిలి ఉంది. ఇక అంతా ఎదురుచూసినట్లే ఈ శనివారం ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు నాగార్జున. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ ఆట కట్టించాడు. ఇక అమర్ దీప్ ఏడుపు.. శివాజీ మాట తప్పడం గురించి గట్టిగానే అడిగేశారు. కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చి చివరకు మాట తప్పావ్ అంటూ శివాజీ అడగ్గా.. డిప్యూటీలుగా ప్రియాంక, శోభాను పెడతా అన్నాడు.. అందుకే తప్పానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ శనివారం ఎపిసోడ్ సగం అమర్ ఏడుపు గురించి జరిగింది. ఒకప్పటి అమర్.. ఇప్పటి అమర్ అంటూ వరుసపెట్టి వీడియోస్ ప్లే చేసి చూపించాడు నాగ్. అప్పుడు సింపథీ డ్రామాలు వద్దని చెప్పి.. ఇప్పుడు నువ్వు చేసేదేంటని అడిగారు నాగ్. బాధ నా వరకు వస్తే గానీ తెలియలేదు సర్ అంటూ నిజం ఒప్పుకున్నాడు అమర్. ఇక నాగార్జున ముందే శివాజీ, అమర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
పోలీస్ గెటప్ లో అదరగొట్టేశావ్. చాలా ఫన్ క్రియేట్ చేసి మమ్మల్ని నవ్వించావ్ అంటూ అమర్ దీప్ ను మెచ్చుకున్నారు నాగ్. కెప్టెన్సీ డిజప్పాయింట్మెంట్ ఉండొచ్చు కానీ కప్పు చాలా పెద్దది దాని కోసం ఆడు అని నాగ్ సలహా ఇచ్చారు. ఇక తర్వాత గతంలో ప్రశాంత్, అమర్ దీప్ మధ్య నడిచిన బీటెక్, రైతులు వీడియో చూపించారు. అప్పుడు ప్రశాంత్ ను సెంటిమెంట్ డ్రామాలు ఆడద్దంటూ చెప్పావ్.. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావ్ అంటే నీది సెంటిమెంట్ డ్రామానా అని అడగ్గా.. నా వరకు వచ్చే వరకు ఆ బాధ తెలియలేదు సర్ అని అన్నాడు అమర్. నీకొస్తే బాధ.. అవతలి వాళ్లకు వస్తే బాధా కాదా.. నీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏడొద్దని చెప్పారు.. అయినా ఏడుస్తూనే ఉన్నావ్ అని నాగ్ అనడంతో.. నా అనుకున్న మనుషులు నాకు దెబ్బేశారు అందుకే ఆ బాధ.. శివాజీ అన్నని నమ్మేశా అని అన్నాడు.
ఇక తర్వాత శివాజీని క్వశ్చన్ చేశారు నాగ్. మాట కోసం చచ్చిపోతాను అన్నావ్ ఎందుకు మాట మార్చవ్ అని అడగ్గా.. డిప్యూటీలుగా ప్రియాంక, శోభాలను పెట్టుకుంటాను అన్నాడు. ఇక్కడ సేఫ్ గేమ్ నడుస్తుంది. అందుకే మాట తప్పాను అని అన్నాడు శివాజీ. వాళ్లిద్దరిని పెట్టుకుంటే నీకెంటీ ప్రాబ్లమ్, నువ్వు యావర్, ప్రశాంత్ ను డిప్యూటీలుగా పెట్టుకున్నావ్ కదా అన్నారు నాగార్జున. వాళ్లుంటే ఎలాంటి పనులు జరగడం లేదు అని శివాడీ అనడంతో ప్రియాంక గుడ్ కెప్టెన్ అని ఎందుకు చేయి ఎత్తావ్ అని అడిగారు. ఓకే అన్నట్లు చెప్పాను అన్నాడు. ఇక మధ్యలో ప్రియాంక కలగజేసుకోవడంతో కాసేపు శివాజీ, ప్రియాంక మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. ఇద్దరూ గట్టిగా అరుచుకోవడంతో నాగార్జున వారించారు. ఆ తర్వాత అమర్ ను పైకి లేపీ నువ్వు కెప్టెన్ అయినప్పుడు వాళ్లిద్దరినే ఎందుకు డిప్యూటీలుగా తీసుకోవాలనుకున్నావ్ అని అడగ్గా.. ముందే మాట్లాడుకున్నామంటూ అసలు విషయం బయటపెట్టేశాడు అమర్.
చివరకు అమర్ దీప్ కు ఓ వీడియో ప్లే చేశారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. నీకు నామినేషన్స్ టైమ్ లో ఒక ఊతపదం ఉంటుంది. ఎవరైనా నామినేట్ చేస్తామంటే రేయ్ నా లైఫ్ రా ఆలోచించుకో ప్లీజ్ అంటావని అంటే.. అది నా స్ట్రాటజీ.. కొంతమంది దానికి లొంగుతారు. మీరెందుకు బయటకు చెప్తారని అమర్ అన్నాడు. దీంతో నీ ఏడుపు కూడా స్ట్రాటజీ అనుకోవాలా అని నాగ్ అనడంతో.. నా ఒరిజినాలిటీ అది కాదు.. అంటూ చెప్పేశాడు అమర్. ఇక చాలాసేపు అమర్, శివాజీ, నాగార్జున మధ్య డిస్కషన్ జరిగింది. చివరకు మా అమ్మ మీద ఒట్టు అంటూ అమర్ అనడంతో నాగార్జున సీరియస్ అయ్యాడు. అమ్మ మీద ఒట్టు ఏంటీ .. ఆ మాట వెనక్కి తీసుకో అంటూ సీరియస్ అయ్యారు. నువ్వు పాతలో ఒకలా మాట్లాడి.. ఇప్పుడు ఒకలా మాట్లాడితే ప్రేక్షకులే అయోమయానికి గురవుతారు అంటూ చెప్పేశాడు నాగ్.