Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్రాన్ని గెలిచిన అర్జున్.. శోభా ఆటలో అమర్ బలి..

|

Dec 02, 2023 | 6:57 AM

గౌతమ్ రేసు నుంచి తప్పుకోవడంతో తన పాయింట్స్ నుంచి సగం అమర్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. తనకు స్నేహితుడైన అర్జున్ కు ఇవ్వాలనుకున్నాడు గౌతమ్. కానీ ప్రియాంక కోరడంతో అమర్ కు ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ.. ఇవి ప్రియాంక పాయింట్స్.. ఇకపై తనను ఏం అనొద్దు అంటూ కౌంటరిచ్చాడు. అయితే గౌతమ్ మాటలపై అమర్ దీప్ సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మధ్యలో దూరిపోయి అతి చేసింది శోభా. ఏమనకు అంటే ఏంటీ.. పాయింట్స్ ఇస్తే ఇవ్వు.. అలా అనడం కరెక్ట్ కాదు గౌతమ్ అంటూ గొడవ పెట్టే ప్రయత్నం చేసింది.

Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్రాన్ని గెలిచిన అర్జున్.. శోభా ఆటలో అమర్ బలి..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో మూడు నాలుగు రోజులుగా టికెట్ టూ ఫినాలే రేసు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైనలిస్ట్ రేసు నుంచి శివాజీ, గౌతమ్, యావర్, ప్రియాంక, గౌతమ్, శోభా అవుట్ కాగా.. మిగిలిన ముగ్గురి మధ్య హోరా హోరీ పోటి జరిగింది. అయితే మొదటి నుంచి ఎవరి పాయింట్స్ తీసుకోకుండా సొంతంగా అన్ని టాస్కులలో గెలిచి మొట్ట మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు అర్జున్ అంబటి. ఇక ఎప్పటిలాగే మరోసారి అమర్‏కు నిరాశే మిగిలింది. అయితే నిన్నటి నుంచి శోభా తన అతి తెలివి చూపిస్తూ అమర్‏ను ఆటాడిస్తుంది. ఆమె చెప్పినట్లుగానే అమర్ దీప్ వింటూ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ అర్జున్ ఓడిపోతే పాయింట్స్ ఇచ్చేయాలంటూ చెత్తగా మాట్లాడాడు అమర్. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఇక గౌతమ్ రేసు నుంచి తప్పుకోవడంతో తన పాయింట్స్ నుంచి సగం అమర్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. తనకు స్నేహితుడైన అర్జున్ కు ఇవ్వాలనుకున్నాడు గౌతమ్. కానీ ప్రియాంక కోరడంతో అమర్ కు ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ.. ఇవి ప్రియాంక పాయింట్స్.. ఇకపై తనను ఏం అనొద్దు అంటూ కౌంటరిచ్చాడు. అయితే గౌతమ్ మాటలపై అమర్ దీప్ సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మధ్యలో దూరిపోయి అతి చేసింది శోభా. ఏమనకు అంటే ఏంటీ.. పాయింట్స్ ఇస్తే ఇవ్వు.. అలా అనడం కరెక్ట్ కాదు గౌతమ్ అంటూ గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ గౌతమ్ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఇక తర్వాత అర్ధరాత్రి ఇదే విషయాన్ని మళ్లీ స్టార్ట్ చేసింది శోభా. నువ్వు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా ఇవ్వొచ్చు.. గౌతమ్ కు ఇచ్చి.. మళ్లీ అమర్ కు ఇవ్వడం ఏంటని రచ్చ స్టార్ట్ చేసింది. దీంతో నిన్న రాత్రి నీకు చెప్పాను కదా.. గౌతమ్ ను అడిగానని అంటూ ప్రియాంక రియాక్ట్ కావడంతో అవును.. నేను అదే అంటున్న అనేసింది శోభా.

ఇక ఆ తర్వాత ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. మళ్లీ పవర్ అస్త్ర తనే గెలిస్తే ఎళా.. నీకు సపోర్ట్ చేయ్ అని అర్జున్ కు అడుగు అంటూ అమర్ ను పంపించింది. ఇక శోభా చెప్పినట్లుగానే అమర్ వెళ్లి అర్జున్ తో శోభా మాటలను చెప్పగా.. వాడు మనిషే కదరా.. వాడికి ఇస్తే తప్పేముంది అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు అర్జున్. దీంతో వాడికి ఎవిక్షన్ పాస్ ఉంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత మూడు టాస్కులలో అర్జున్ గెలిచి మొట్ట మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో శోభా అతి తెలివి తేటలతో అమర్ ను ఆటాడుకుంది.