Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

ఈ వారం మొత్తం బిగ్‏బాస్ హౌస్ గొడవలతో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌస్ మొత్తం హీట్ నడిచింది.

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..
Bigg Boss Promo

Updated on: Oct 24, 2021 | 4:27 PM

ఈ వారం మొత్తం బిగ్‏బాస్ హౌస్ గొడవలతో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌస్ మొత్తం హీట్ నడిచింది. ఇక ఈ సీజన్‏ మొదటి నుంచి కంటెస్టెంట్స్ శ్రుతిమించి ప్రవర్తి్స్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నారంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రతి వారం లాగే.. ఈ శనివారం కూడా హోస్ట్ నాగార్జున.. ఒక్కో కంటెస్టెంట్‏కు తీసుకున్నారు… ఒక్కొక్కరిని నిల్చోబెట్టి మరీ కడిగిపాడేశారు.. ఇక ఈరోజు సండే..ఫన్ డేతో ఇంటిని నవ్వులతో ముంచేత్తనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే ఇంటి సభ్యులను హోస్ట్ నాగార్జున.. వివిధ రకాల గేమ్స్‏తో ముప్పుతిప్పలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో నాగ్.. ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించినట్లుగా తెలుస్తోంది. కొన్ని సరదా టాస్కులు ఇచ్చి.. గెలిచిన వారికి ఓ పవర్ పుల్ బహుమతి ఇస్తానని చెప్పారు. ఇందులో భాగంగా.. కలర్ ఫుల్ కుషన్ టాస్క్ ఇచ్చి.. అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి .. మీ ఇష్టం ఏదైనా చేయండి .. నేను చెప్పిన కుషన్ మాత్రం సంపాదించుకోండి అని నాగ్ చెప్పగానే.. ఇంటిసభ్యులందరూ తమకు కావాల్సిన కుషన్ కోసం పోటీ పడ్డారు.. అనంతరం మిసెస్ ప్రభావతిని మెప్పించమని నాగ్ సూచించడంతో ప్లీజ్ బేబీ.. అంటూ ఇంటి సభ్యులు కాకపట్టారు. ఇక ఈరోజు ఇంటినుంచి బయటకు వచ్చేది ఎవరనేది కూడా ఈరోజు తెలియనుంది.

Also Read: Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..

RajiniKanth: అక్టోబర్ 25న రజినీకి ప్రత్యేకం.. తన జీవితంలో రేపు స్పెషల్ అంటున్న తలైవా.. ఎందుకంటే..

Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Ananya Nagalla: అందచందాలతో యూత్ ను తనవైపు తిప్పుకుంటున్న అనన్య నాగల్ల.. (ఫొటోస్)